
రాగాల వెంకట రాహుల్
అపియా (సమోవా): తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్ కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిశాడు. పురుషుల 89 కేజీల ఈవెంట్‌లో పోటీపడిన ఈ గుంటూరు జిల్లా వెయిట్‌లిఫ్టర్ 325 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ అయిన రాహుల్ క్లీన్ అండ్ జెర్క్‌లో 145 కేజీలు, స్నాచ్‌లో 180 కేజీల బరువెత్తాడు. ఓవరాల్‌గా 325 కేజీలతో రజతం కైవసం చేసుకున్నాడు. మిగతా భారత వెయిట్‌లిఫ్టర్లలో అజయ్ సింగ్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో కొత్త రికార్డు నెలకొల్పి బంగారు పతకం గెలిచాడు. 81 కేజీల కేటగిరీలో పోటీపడిన అజయ్ క్లీన్ అండ్ జర్క్‌లో తన బరువుకు రెండిం తలు ఎక్కువైన 190 కేజీల బరువెత్తి రికార్డు నెలకొల్పాడు. స్నాచ్‌లో 148 కిలోల బరువెత్తి మొత్తం 338 కేజీలతో స్వర్ణం గెలిచాడు. ఈ కేటగిరీలో భారత్‌కే చెందిన పపుల్ చంగ్మయ్ రజతం నెగ్గాడు. అతను 313 కేజీల (135+178) బరువెత్తాడు.
Comments
Please login to add a commentAdd a comment