
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ బాక్సర్ డేవిడ్ నీకా కామన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన స్వర్ణ పతకాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆక్లాండ్‌లో కారులో ఉంచిన ఆ పతకం చోరికి గురైందని అతను వాపోతున్నాడు. గత నెల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన ఈ క్రీడల్లో హెవీవెయిట్ కేటగిరీలో అతను విజేతగా నిలిచాడు.
‘ఒక యువ అభిమానికి చూపించేందుకు నేను ఆ పతకాన్ని ఇంట్లోంచి బయటకు తీశాను. అది కారులో ఉండగా దొంగిలించారు. అది లేకపోతే నా కెరీర్‌కే విలువుండదు. దయచేసి నా పతకం నాకు ఇచ్చేయండి. నేను చెమటోడ్చి సాధించిన స్వర్ణం తిరిగి నా చేతికందుతుందన్న నమ్మకం నాకుంది’ అని నీకా తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment