Ragala Venkat Rahul
-
తెలుగు తేజానికి రజతం
అపియా (సమోవా): తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్ కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిశాడు. పురుషుల 89 కేజీల ఈవెంట్లో పోటీపడిన ఈ గుంటూరు జిల్లా వెయిట్‌లిఫ్టర్ 325 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ అయిన రాహుల్ క్లీన్ అండ్ జెర్క్‌లో 145 కేజీలు, స్నాచ్‌లో 180 కేజీల బరువెత్తాడు. ఓవరాల్‌గా 325 కేజీలతో రజతం కైవసం చేసుకున్నాడు. మిగతా భారత వెయిట్లిఫ్టర్లలో అజయ్ సింగ్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో కొత్త రికార్డు నెలకొల్పి బంగారు పతకం గెలిచాడు. 81 కేజీల కేటగిరీలో పోటీపడిన అజయ్ క్లీన్ అండ్ జర్క్‌లో తన బరువుకు రెండిం తలు ఎక్కువైన 190 కేజీల బరువెత్తి రికార్డు నెలకొల్పాడు. స్నాచ్‌లో 148 కిలోల బరువెత్తి మొత్తం 338 కేజీలతో స్వర్ణం గెలిచాడు. ఈ కేటగిరీలో భారత్‌కే చెందిన పపుల్ చంగ్‌మయ్ రజతం నెగ్గాడు. అతను 313 కేజీల (135+178) బరువెత్తాడు. -
చీరాలలో సందడి చేసిన వెయిట్ లిఫ్టర్ రాహుల్
-
రాగాల వెంకట్ రాహుల్‌కు అభినందనల వెల్లువ
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా) : కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణం అందించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిస్బేన్‌లో వెంకట్ రాహుల్‌ను క్వీన్స్‌ల్యాండ్ తెలుగు అసోసియేషన్ సన్మానించింది. ఆస్ట్రేలియా లోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2018 వెయిట్ లిఫ్టింగ్ 85 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. తెలుగు క్రీడాకారులను ఆదరించి మరింత ప్రోత్సహిస్తే, భవిష్యత్తులో వారు మరిన్నివిజయాలను సాధించటానికి ప్రేరణగా ఉంటుంది అని క్వీన్స్‌ల్యాండ్ తెలుగు అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. క్వీన్స్‌ల్యాండ్ తెలుగు అసోసియేషన్ సభ్యులు నవనీత తాటిమకుల, రవి కాంత్ గుండేపల్లి, కృష్ణ రావిపాటి, ఉమా గూడూరు, రత్న బుద్ధవరపు తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కామన్వెల్త్ గేమ్స్‌కు సతీశ్, రాహుల్ క్వాలిఫై
సాక్షి, న్యూఢిల్లీ : భారత వెయిట్ లిఫ్టర్లు శివలింగం సతీశ్ కుమార్, రాగల వెంకట్ రాహుల్ కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్-2018కి అర్హత సాధించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో పురుషులు, మహిళలకు పలు విభాగాల్లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇదివరకే రికార్డులు సృష్టించిన రాహుల్ స్నాచ్ లో 156 కేజీలు, క్లీన్ అండర్ జర్క్‌లో 195 కేజీలు ఎత్తి సత్తాచాటారు. జూనియర్, సీనియర్ విభాగాలలో బరిలోకి రాహుల్ దిగనున్నారు. 2014 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన సతీశ్ కుమార్ 77 కేజీల విభాగంలో స్నాచ్‌లో 148 కేజీలు, క్లీన్ అండర్ జర్క్‌లో 172 కేజీలతో ఓవరాల్‌గా 320 కేజీలెత్తారు. -
ఆసియా యూత్ క్రీడలకు రాహుల్
న్యూఢిల్లీ: ఆసియా యూత్ క్రీడల్లో పాల్గొనే భారత వెయిట్‌లిఫ్టింగ్ జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాగాల వెంకట్ రాహుల్‌కు చోటు లభించింది. ఈనెల 16 నుంచి 24 వరకు చైనాలోని నాన్జింగ్ నగరంలో ఈ క్రీడలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్ (ఏపీఎస్ఎస్) విద్యార్థి అయిన రాహుల్ 77 కేజీల విభాగంలో పోటీపడతాడు. గతేడాది ఆసియా యూత్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో రాహుల్ మూడు స్వర్ణ పతకాలు సాధించాడు. రాహుల్‌తో కలిపి మొత్తం తొమ్మిది మంది వెయిట్‌లిఫ్టర్లు ఈ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.