ఆసియా యూత్ క్రీడలకు రాహుల్ | Asian Youth Games, Ragala Venkat Rahul | Sakshi
Sakshi News home page

ఆసియా యూత్ క్రీడలకు రాహుల్

Published Thu, Aug 8 2013 2:10 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

Asian Youth Games, Ragala Venkat Rahul

న్యూఢిల్లీ: ఆసియా యూత్ క్రీడల్లో పాల్గొనే భారత వెయిట్‌లిఫ్టింగ్ జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాగాల వెంకట్ రాహుల్‌కు చోటు లభించింది. ఈనెల 16 నుంచి 24 వరకు చైనాలోని నాన్‌జింగ్ నగరంలో ఈ క్రీడలు జరగనున్నాయి.
 
 ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్ (ఏపీఎస్‌ఎస్) విద్యార్థి అయిన రాహుల్ 77 కేజీల విభాగంలో పోటీపడతాడు. గతేడాది ఆసియా యూత్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో రాహుల్ మూడు స్వర్ణ పతకాలు సాధించాడు. రాహుల్‌తో కలిపి మొత్తం తొమ్మిది మంది వెయిట్‌లిఫ్టర్లు ఈ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement