
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పోటీల ఆరో రోజు ఆదివారం భారత్‌కు రజతం, కాంస్యం లభించాయి. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో 15 ఏళ్ల అనీశ్ భన్వాలా రజత పతకం సొంతం చేసుకోగా... నీరజ్ కుమార్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో అనీశ్ 26 పాయింట్లు, నీరజ్ 23 పాయింట్లు సాధించి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఓవరాల్‌గా ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్‌కు 18 పతకాలు వచ్చాయి.