చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. సోమవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత యువ షూటర్ అనీశ్ భన్వాలా కాంస్య పతకం సాధించాడు. ఆరుగురి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల అనీశ్ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంతో ముగించాడు.
ఈ ప్రదర్శనతో అనీశ్ వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకున్నాడు. ఇప్పటి వరకు షూటింగ్‌లో భారత్‌కు 12 ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. మరోవైపు పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్, జొరావర్ సింగ్ సంధూ, పృథ్వీరాజ్ తొండైమన్‌లతో కూడిన భారత జట్టుకు రజత పతకం దక్కింది. కైనన్, జొరావర్, పృథీ్వరాజ్ బృందం 341 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్ 30 పతకాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment