Rapid Fire
-
పిస్టల్ ‘మిస్’ ఫైర్
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో... మహిళల స్కీట్ ఈవెంట్లో భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. ఆదివారం క్వాలిఫికేషన్ రౌండ్ ఆరంభంలో ఆకట్టుకున్న భారత షూటర్లు విజయ్‌వీర్ సిద్ధూ, అనీశ్ భన్వాలా చివరి వరకు అదే జోరు కొనసాగించలేక.. ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయారు. విజయ్‌వీర్ 583 పాయింట్లతో తొమ్మిదో స్థానానికి పరిమితం కాగా... అనీశ్ 582 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు.ఒక దశలో రెండో స్థానానికి చేరి ఆశలు రేపిన విజయ్‌వీర్ ఆ తర్వాత గురి తప్పడంతో తుదిపోరుకు చేరకుండానే వెనుదిరిగాడు. తొలి ఆరు స్థానాల్లో నిలిచిన షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. మహిళల స్కీట్ విభాగంలో మహేశ్వరి చౌహాన్ (118 పాయింట్లు) 14వ స్థానం, రైజా ధిల్లాన్ (113 పాయింట్లు) 23వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. నేటితో ఒలింపిక్స్‌లో షూటింగ్ ఈవెంట్ ముగుస్తుంది. చివరిరోజు స్కీట్ మిక్స్డ్ విభాగంలో భారత్ నుంచి మహేశ్వరి చౌహాన్, అనంత్‌జీత్ సింగ్ నరూకా జోడీ పోటీపడనుంది. మొత్తం 15 జోడీలు క్వాలిఫయింగ్‌లో ఉన్నాయి. టాప్–4లో నిలిచిన జోడీలు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. టాప్–2లో నిలిచిన రెండు జంటలు స్వర్ణ–రజత పతకాల కోసం... మూడు–నాలుగు స్థానాల్లో నిలిచిన రెండు జోడీలు కాంస్య పతకం కోసం పోటీపడతాయి.శుభాంకర్ 40వ స్థానంలో... పారిస్ ఒలింపిక్స్ గోల్ఫ్ పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో భారత్‌కు నిరాశ తప్పలేదు. ఈ విభాగంలో పోటీపడిన శుభాంకర్ శర్మ 40వ స్థానంలో నిలవగా ... గగన్‌జీత్ సింగ్ భుల్లర్ 45వ ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. శుభాంకర్ ఓవరాల్‌గా 283 పాయింట్లు సాధించగా.. గగన్‌జీత్ 285 పాయింట్లతో ఆకట్టుకోలేకపోయారు. సెయిలింగ్ డింగీ విభాగంలో 8 రేసులు ముగిసేసరికి పురుషుల విభాగంలో భారత సెయిలర్ విష్ణు శరవణన్ 18వ స్థానంలో.. మహిళల విభాగంలో నేత్ర కుమానన్ 25వ స్థానంలో నిలిచారు. నేడు మరో రెండు రేసులు జరగాల్సి ఉంది. మొత్తం పది రేసుల్లో టాప్–10లో నిలిచిన సెయిలర్లు పతక పోరుకు అర్హత సాధిస్తారు. -
వరుణ్ సందేశ్‌తో ర్యాపిడ్ ఫైర్
-
అల్లు శిరీష్‌తో ప్రత్యేక రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
-
కాజల్ అగర్వాల్‌తో ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
-
కళ్యాణ్ రామ్ సంయుక్త మీనన్ ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
-
Asian Shooting Championships 2023: అనీశ్ డబుల్ ధమాకా
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. సోమవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత యువ షూటర్ అనీశ్ భన్వాలా కాంస్య పతకం సాధించాడు. ఆరుగురి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల అనీశ్ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంతో ముగించాడు. ఈ ప్రదర్శనతో అనీశ్ వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకున్నాడు. ఇప్పటి వరకు షూటింగ్లో భారత్‌కు 12 ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. మరోవైపు పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్, జొరావర్ సింగ్ సంధూ, పృథ్వీరాజ్ తొండైమన్‌లతో కూడిన భారత జట్టుకు రజత పతకం దక్కింది. కైనన్, జొరావర్, పృథీ్వరాజ్ బృందం 341 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్ 30 పతకాలు సాధించింది. -
Asian Games 2023: ‘పసిడి’ బుల్లెట్...
హాంగ్జౌ: తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత యువ షూటర్లు ఆసియా క్రీడల్లో తమ గురికి పదును పెట్టారు. పోటీల రెండో రోజు భారత షూటర్లు ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు అందించారు. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రుద్రాంశ్ పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాంశ్ సింగ్ పన్వర్‌లతో కూడిన భారత జట్టు 1893.7 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే కొత్త ప్రపంచ రికార్డును నెలకొలి్పంది. ఈ ఏడాది ఆగస్టు 23న చైనా జట్టు 1893.3 పాయిం్లటతో సాధించిన ప్రపంచ రికార్డును భారత త్రయం తిరగరాసింది. క్వాలిఫయింగ్‌లో ఆయా దేశాల షూటర్లు చేసిన స్కోరును లెక్కించి టాప్–3లో నిలిచిన జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. క్వాలిఫయింగ్‌లో భారత్ నుంచి రుద్రాంశ్ 632.5 పాయింట్లు, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 631.6 పాయింట్లు, దివ్యాంశ్ 629.6 పాయింట్లు సాధించారు. టాప్–8లో నిలిచిన ఈ ముగ్గురూ ఫైనల్‌కు అర్హత సాధించారు. అయితే నిబంధనల ప్రకారం ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరు షూటర్లకు మాత్రమే ఫైనల్లో ఆడేందుకు అనుమతి ఉంది. దాంతో దివ్యాంశ్ కంటే ఎక్కువ పాయింట్లు స్కోరు చేసిన రుద్రాంశ్ , ఐశ్వరీ ప్రతాప్ భారత్ తరఫున ఫైనల్లో పోటీపడ్డారు. ఎనిమిది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రుద్రాంశ్ 208.7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలువగా... ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 228.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. లిహావో షింగ్ (చైనా; 253.3 పాయింట్లు) కొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని ౖకైవసం చేసుకోగా... హాజున్ పార్క్ (దక్షిణ కొరియా; 251.3 పాయింట్లు) రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విజయ్‌వీర్ సిద్ధూ (582 పాయింట్లు), ఆదర్శ్ సింగ్ (576 పాయింట్లు), అనీశ్ (560 పాయింట్లు)లతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. భారత త్రయం మొత్తం 1718 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఇండోనేసియా కూడా 1718 పాయింట్లు సాధించినా... 10 పాయింట్ల షాట్లు భారత్‌కంటే (45) ఇండోనేసియా (37) తక్కువగా కొట్టడంతో టీమిండియాకు కాంస్యం ఖరారైంది. క్వాలిఫయింగ్‌లో విజయ్‌వీర్ సిద్ధూ ఆరో ర్యాంక్‌లో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో విజయ్‌వీర్ 21 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో కాంస్య పతకానికి దూరమయ్యాడు. కాంస్య పతకాలతో ఆదర్శ్, విజయ్‌వీర్, అనీశ్ -
నాగ చైతన్య, కృతి శెట్టి ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
-
ర్యాపిడ్ ఫైర్‌లో రానా ఆన్సర్స్
సౌత్ సినీ పండుగ సైమా అబుదాబిలో ఘనంగా జరిగింది. దక్షిణాది సినీ ప్రముఖులు హాజరైన ఈ వేదికపై యంగ్ హీరో రానా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాంకర్ అడిగిన ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు రానా చెప్పిన సమాధానాలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన బ్రెస్ట్ ఫ్రెండ్, తనకు నచ్చిన చోటు, ఇష్టమైన ఫుడ్ లాంటి విషయాలను ఏ మాత్రం తడబడకుండా టక టక చెప్పేశాడు రానా. ఒకే పాటను జీవితాంతం వినాల్సి వస్తే బాహుబలి సినిమాలోని మహిష్మతి టైటిల్ సాంగ్‌నే వింటాడట. ఎప్పటికీ ఒకే నగరంలో ఉండాల్సి వస్తే హైదరాబాద్, ఒకే ఫుడ్ తినాల్సి వస్తే హాలీమ్, ఒకే సినిమా రోజూ చూడాల్సి వస్తే స్టార్ వార్స్ సినిమాలు చూస్తాడట. ఒకే షో ఎప్పటికీ చూడాల్సి వస్తే మాత్రం టీవీ ఆఫ్ చేసేస్తానన్నాడు రానా. ఒకే మనిషి జీవితాంతం ఫ్రెండ్‌గా ఉండాల్సి వస్తే ఆ ప్లేస్ రామ్ చరణ్‌కు మాత్రమే ఇస్తా అన్నాడు. జీవితాంతం తనకు ఒకే ప్రేక్షకుడు ఉంటే అది మా నాన్నే అన్న రానా, ఒకే స్టార్‌తో జీవితాంతం గడపాల్సి వస్తే అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేను అన్నాడు. తాను పుట్టిన దగ్గర నుంచి స్టార్ల మధ్యే పెరిగాను కాబట్టి ఒకే స్టార్‌ను ఎంపిక చేసుకోవటం కష్టమన్నాడు.