న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌ను భారత జట్టు నాలుగు పతకాలతో ముగించింది. టోర్నీ చివరిరోజు గురువారం భారత్ ఖాతాలో ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి రెండు పతకాలు చేరాయి. పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో జైపూర్‌కు చెందిన వివాన్ కపూర్ రజత పతకం సొంతం చేసుకోగా... పురుషుల స్కీట్ ఈవెంట్‌లో అనంత్‌జీత్ సింగ్ నరూకా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఆరుగురు షూటర్లు పోటీపడ్డ ‘ట్రాప్’ ఫైనల్లో 22 ఏళ్ల వివాన్ 44 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. వివాన్ కెరీర్‌లో ఇదే తొలి అంతర్జాతీయ వ్యక్తిగత పతకం. గతంలో అతను మూడుసార్లు వరల్డ్‌కప్ టీమ్ ఈవెంట్స్‌లో రజత పతకాలు సాధించాడు. ‘స్కీట్’ ఈవెంట్ ఫైనల్లో ‘పారిస్ ఒలింపియన్’ అనంత్‌జీత్ 43 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని పొందాడు.
అనంత్ కెరీర్‌లో ఇదే తొలి వరల్డ్‌కప్ మెడల్ కావడం విశేషం. మహిళల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో భారత షూటర్ గనీమత్ సెఖోన్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ టోరీ్నలో భారత్ 2 రజతాలు, 2 కాంస్యాలతో నాలుగు పతకాలు నెగ్గి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment