ISSF
-
వివాన్‌కు రజతం... అనంత్‌కు కాంస్యం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌ను భారత జట్టు నాలుగు పతకాలతో ముగించింది. టోర్నీ చివరిరోజు గురువారం భారత్ ఖాతాలో ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి రెండు పతకాలు చేరాయి. పురుషుల ట్రాప్ ఈవెంట్లో జైపూర్‌కు చెందిన వివాన్ కపూర్ రజత పతకం సొంతం చేసుకోగా... పురుషుల స్కీట్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్ నరూకా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆరుగురు షూటర్లు పోటీపడ్డ ‘ట్రాప్’ ఫైనల్లో 22 ఏళ్ల వివాన్ 44 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. వివాన్ కెరీర్లో ఇదే తొలి అంతర్జాతీయ వ్యక్తిగత పతకం. గతంలో అతను మూడుసార్లు వరల్డ్‌కప్ టీమ్ ఈవెంట్స్‌లో రజత పతకాలు సాధించాడు. ‘స్కీట్’ ఈవెంట్ ఫైనల్లో ‘పారిస్ ఒలింపియన్’ అనంత్‌జీత్ 43 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని పొందాడు. అనంత్ కెరీర్లో ఇదే తొలి వరల్డ్‌కప్ మెడల్ కావడం విశేషం. మహిళల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో భారత షూటర్ గనీమత్ సెఖోన్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ టోరీ్నలో భారత్ 2 రజతాలు, 2 కాంస్యాలతో నాలుగు పతకాలు నెగ్గి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది. -
షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్ ఆతిథ్యం
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్ ఫైనల్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూఢిల్లీలోని కర్ణీ సింగ్ రేంజ్లో ప్రపంచకప్ ఫైనల్ పోటీలు నిర్వహించనున్నట్లు భారత రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) గురువారం ప్రకటించింది. ఒలింపిక్స్‌లోని 12 వ్యక్తిగత విభాగాల్లో విజేతలుగా నిలిచిన షూటర్లు ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధించనున్నారు. వీరితో పాటు గత సంవత్సరం దోహా, ఖతార్‌లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్ చాంపియన్లు కూడా ఇందులో నేరుగా పాల్గొననున్నారు. ఇక ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన షూటర్లు కూడా నేరుగా పోటీ పడనున్నారు. ఆతిథ్య హోదాలో భారత్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవకాశాలు ఉన్నాయి. ‘ప్రపంచకప్ ఫైనల్ భారత్ లో జరగనుండటం ఇది రెండోసారి’ అని ఎన్ఆర్ఏఐ గురువారం ప్రకటించింది. -
ఒలింపిక్స్ షూటింగ్లో ఆసియా కోటా పెంపు..
న్యూఢిల్లీ: ఆసియా దేశాల షూటర్లకు ఇది కచ్చితంగా తీపి కబురే! అంతర్జాతీయ క్రీడా షూ టింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఒలింపిక్స్ షూటింగ్లో ఆసియా కోటా పెంచింది. 38 బెర్త్‌ల నుంచి 48 బెర్త్‌లకు పెంచింది. వచ్చే పారిస్ ఒలింపిక్స్ (2024)లో ఈ హెచ్చింపు అమలయ్యే అవకాశాలున్నాయి. ఈ మెగా ఈవెంట్ కోసం వచ్చే ఏడాది నుంచి షూటింగ్లో క్వాలిఫికేషన్ పోటీలు జరుగనున్నాయి. ఈ ఏడాది జరిగిన టోక్యో ఈవెంట్లో ఆసియా దేశాలకు 38 కోటా బెర్తులు ఇచ్చారు. ‘నిజమే...ఒలింపిక్స్ కోటా పెంచామని ఐఎస్ఎస్ఎఫ్ నుంచి ఆసియా షూటింగ్ కాన్ఫెడరేషన్ (ఏఎస్సీ)కు లేఖ రాసింది’ అని ఏఎస్సీ తెలిపింది. చదవండి: T20 WC 2021 Winner Australia: మ్యాచ్ చూడలేదా అమిత్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే -
ఐఎస్ఎస్ఎఫ్ పేజీని తొలగించిన ఫేస్బుక్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్)కు ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ షాక్ ఇచ్చింది. ఐఎస్ఎస్ఎఫ్ అధికార పేజీని తొలగిస్తూ ఫేస్బుక్ నిర్ణయం తీసుకుంది. దాంతో ఆగ్రహించిన ఐఎస్ఎస్ఎఫ్ ‘అన్‌బ్లాక్ ఐఎస్ఎస్ఎఫ్ ఫేస్బుక్’ హ్యాష్ ట్యాగ్‌తో ఇతర సామాజిక మాధ్యమాలు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో మద్దతు ఇవ్వాలని కోరింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌కు మద్దతుగా పలువురు షూటర్లు కూడా ఈ ట్యాగ్‌కు తమ కామెంట్లను జత చేశారు. ‘ఐఎస్ఎస్ఎఫ్ చరిత్రలో గురువారం ఒక దురదృష్టకరమైన రోజు. ఎటువంటి కారణం, ముందస్తు హెచ్చరిక లేకుండానే ఐఎస్ఎస్ఎఫ్ పేజీని ఫేస్బుక్ తొలగించింది’ అని ఐఎస్ఎస్ఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. 2010 జనవరి 14న ఐఎస్ఎస్ఎఫ్ ఫేస్బుక్లో చేరింది. తొలగించడానికి సరైన కారణం తెలియకపోయినా... ఫేస్బుక్ నిబంధనల ప్రకారం రైఫిళ్లు, హ్యాండ్గన్లకు సంబంధించిన వాటి ప్రచారాన్ని తమ ఫేస్బుక్ ద్వారా చేయకూడదు. ఈ కారణంతోనే ఐఎస్ఎస్ఎఫ్ పేజీని ఫేస్బుక్ తొలగించినట్లు సమాచారం. -
షూటింగ్ ప్రపంచ కప్ వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో జరగాల్సిన ప్రతిష్టాత్మక షూటింగ్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు కోవిడ్–19 వైరస్ అడ్డుగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ విజృంభిస్తుండటంతో పాటు... దేశంలో కూడా పలు కేసులు నమోదు కావడంతో ఈ మెగా ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి 25 వరకు న్యూఢిల్లీ వేదికగా ఈ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే భారత్‌లో 31 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం... కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్ దేశాలపై భారత ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ విధించడంతో టోర్నీని ప్రస్తుతం నిర్వహించడం సాధ్యం కాదని ఐఎస్‌ఎస్‌ఎఫ్‌కు భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) తెలిపింది. అంతేకాకుండా టోర్నీలో పాల్గొనే 22 దేశాలు కూడా చివరి నిమిషంలో వైదొలిగాయని పేర్కొంది. అయితే షూటింగ్ ప్రపంచ కప్‌ను రెండు దశల్లో నిర్వహించే విషయమై పరిశీలిస్తున్నామని ఐఎస్ఎస్ఎఫ్ పేర్కొంది. మే 5 నుంచి 12 మధ్య రైఫిల్, పిస్టల్ ఈవెంట్లను... జూన్ 2–9 మధ్య షాట్‌గన్ షూటింగ్ పోటీలను నిర్వహించాలని ఎన్ఆర్ఏఐ తమను కోరినట్లు ఐఎస్ఎస్ఎఫ్ తెలిపింది. దీంతో పాటు ఏప్రిల్ 16 నుంచి టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్ టెస్టు ఈవెంట్ కూడా రద్దు అయింది. బయోమెట్రిక్‌కు ‘బ్రేక్’ ఇచ్చిన ‘సాయ్’ అథ్లెట్లు, సిబ్బంది హాజరు కోసం ఉపయోగిస్తున్న బయోమెట్రిక్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) తెలిపింది. బయోమెట్రిక్ ద్వారా కోవిడ్–19 ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘సాయ్’ తెలిపింది. అనుకున్న సమయానికే ఐపీఎల్: గంగూలీ కోవిడ్ దెబ్బకు ఒక్కో టోర్నీ వాయిదా పడుతున్నా... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ సీజన్–13 అనుకున్న తేదీనే ప్రారంభమవుతుందని స్పష్టం చేశాడు. వైరస్ ప్రబలకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటామని... దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన అన్నాడు. ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 29న ప్రారంభమవుతుంది. -
భారత షూటర్ల కొత్త చరిత్ర
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. గతంలో ఎన్నడు లేని విధంగా 11 స్వర్ణాలతో పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. పోటీల ముగింపు రోజు శుక్రవారం రెండు స్వర్ణాలు, ఓ రజతం భారత్ ఖాతాలో చేరడంతో... మొత్తంగా 27 పతకాల (11 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు)తో మూడో స్థానంతో ముగించింది. మన షూటర్లు చివరి రోజు జూనియర్ విభాగంలో రెండు స్వర్ణాలు... సీనియర్ విభాగంలో ఓ రజతం సాధించారు. జూనియర్ 25 మీ. పిస్టల్ విభాగంలో పదహారేళ్ల విజయ్‌వీర్ 572 పాయింట్లతో పసిడి పతకం సాధించాడు. టీమ్ విభాగంలో విజయ్‌వీర్ (564), రాజ్కన్వర్ సింగ్ సంధు (564), ఆదర్శ్ సింగ్ (559)లతో కూడిన భారత జట్టు 1695 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. కొరియా (1693), చెక్ రిపబ్లిక్ (1674) వరుసగా రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నాయి. సీనియర్ 25 మీ. పిస్టల్ విభాగంలో గురుప్రీత్ సింగ్ 579 పాయింట్లతో రజతం సాధించాడు. టీమ్ విభాగంలో గురుప్రీత్, అమన్‌ప్రీత్ సింగ్, విజయ్ కుమార్‌లతో కూడిన భారత బృందం 1699 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్ ఈవెంట్‌గా నిర్వహించిన ఈ టోర్నీలో భారత్ రెండు ఒలింపిక్ బెర్త్‌లను సొంతం చేసుకుంది. అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండీలా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈ బెర్త్‌లు సాధించారు. -
భారత్‌కు 12వ స్థానం
చాంగ్‌వన్ (కొరియా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) రెండో ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత షూటర్లు నిరాశపరిచారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో భారత్ ఒకే రజత పతకం సాధించి ఓవరాల్‌గా 12వ స్థానంతో సరిపెట్టుకుంది. గత నెలలో మెక్సికోలో జరిగిన తొలి ప్రపంచకప్‌లో భారత్ తొమ్మిది పతకాలు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. కానీ ఇక్కడ మాత్రం అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. చివరిదైన పురుషుల స్కీట్ ఈవెంట్లో భారత షూటర్ షీరాజ్ షేక్ 118 పాయింట్లతో 23వ స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో షాజర్ రిజ్వీ రజతం గెలిచి భారత్‌కు ఏకైక పతకాన్ని అందించాడు. -
భారత షూటర్ల జోరు
గబాలా (అజర్బైజాన్): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పోటీల్లో భారత్‌కు ఐదు పతకాలు లభించాయి. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ రుషిరాజ్ బారోట్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. 19 ఏళ్ల రుషిరాజ్ 556 పాయింట్లు సాధించి ఐదో స్థానంతో ఫైనల్‌కు అర్హత పొందాడు. ఫైనల్లో రుషిరాజ్ 25 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... లుకాస్ స్కుర్మల్ (చెక్ రిపబ్లిక్-23 పాయింట్లు) రజత పతకాన్ని, సెర్గీ ఎవ్‌గ్లెవ్‌స్కీ (ఆస్ట్రేలియా-20 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించారు. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ప్రతీక్, అర్జున్ బబూటా, ప్రశాంత్‌లతో కూడిన భారత బృందానికి పసిడి పతకం లభించింది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో అర్జున్‌కు కాంస్యం దక్కింది. 50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో అన్మోల్, నిశాంత్ భరద్వాజ్, అర్జున్ దాస్లతో కూడిన భారత జట్టు రజతం సాధించింది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో దిల్రీన్ గిల్, గీతాలక్ష్మి దీక్షిత్, ఆశి రస్తోగిలతో కూడిన భారత జట్టు కాంస్యం కై వసం చేసుకుంది. -
‘రజత’ రాజ్‌పుత్
ఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్ సంజీవ్ రాజ్‌ఫుత్ రజత పతకాన్ని సాధించాడు. అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో జరిగిన ఈ ఈవెంట్లో రాజ్‌పుత్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫైనల్లో రాజ్‌పుత్ 456.9 పాయింట్లు స్కోరు చేశాడు. భారత్‌కే చెందిన గగన్ నారంగ్ 23వ, చెయిన్ సింగ్ 32వ స్థానంలో నిలిచారు. -
షూటర్ రాజ్‌పుత్‌కు రజతం
బాకు(అజర్బైజాన్):ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్‌లో భారత షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ రజతం సాధించాడు. అజర్ బైజాన్‌లో జరుగుతున్న ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆద్యంత ఆకట్టుకున్న రాజ్ పుత్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకున్నాడు. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్లో 456.9 పాయింట్ల స్కోరు చేసి రజతాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ పోటీలో కొరేషియా షూటర్ పీటర్ గోర్సా 4 57.5 పాయింట్ల స్కోరుతో స్వర్ణాన్ని సాధించగా, కొరియా షూటర్ హైన్జున్ కిమ్ 445.5 స్కోరుతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా, మరో భారత షూటర్ జితూ రాయ్ 10 మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో రజతం సాధించాడు. దీంతో భారత్ ఖాతాలో రెండు రజతాలు చేరాయి. కాగా, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత షూటర్ గగన్ నారంగ్ 1161 పాయింట్ల స్కోరు చేసి 23వ స్థానంలో నిలిచాడు. -
జీతూకు ఆరోస్థానం
రియో డి జనీరో: భారత మేటి షూటర్ జీతూ రాయ్ ఇంటర్నేషనల్ షూటింగ్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్ టోర్నమెంట్లో పేలవ ప్రదర్శన కనబరిచాడు. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల 50 మీ. పిస్టల్ షూటింగ్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ జీతూ రాయ్ ఆరోస్థానంలో నిలిచాడు. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో 563 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. -
ఐఎస్ఎస్ఎఫ్ కమిటీకి మళ్లీ ఎన్నికైన బింద్రా
న్యూఢిల్లీ: భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) అథ్లెట్ కమిటీకి మళ్లీ ఎన్నికయ్యాడు. ఏడుగురు సభ్యులున్న ఈ కమిటీకి తొలిసారిగా 2010లో అతను ఎన్నికయ్యాడు. తాజాగా మళ్లీ ఎన్నికైన నలుగురు సభ్యుల్లో బింద్రా కూడా ఉన్నాడు. ఈ ఎన్నిక కోసం మొత్తం 13 మంది అథ్లెట్లు నామినేట్ కాగా భారత షూటర్‌తో పాటు అరునోవిక్ (సెర్బియా), డి నికోలో (ఇటలీ), హెన్రీ (జర్మనీ)లకు కమిటీలో చోటు దక్కింది. -
భారత షూటర్లకు రెండు పతకాలు
- జీతూ రాయ్‌కు రజతం - అయోనిక ఖాతాలో కాంస్యం - షూటింగ్ ప్రపంచకప్ మారిబోర్ (స్లొవేనియా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్ల గురి అదిరింది. పురుషుల 50 మీటర్ల పిస్టల్ విభాగంలో జీతూ రాయ్ రజతం... మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అయోనిక పాల్ కాంస్య పతకం సాధించారు. సోమవారం జరిగిన ఈ పోటీల ఫైనల్లో జీతూ రాయ్ 193.9 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని సంపాదించాడు. జీతూ రాయ్ ధాటికి ప్రపంచ చాంపియన్ తొమోయుకి మత్సుదా (జపాన్-172.9 పాయింట్లు) కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. దామిర్ మికెక్ (సెర్బియా-194 పాయింట్లు) స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జీతూ రాయ్‌కిది వారం వ్యవధిలో రెండో రజతం కావడం విశేషం. గతవారం మ్యూనిచ్‌లో జరిగిన ప్రపంచకప్‌లోనూ అతను రజతం సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో మహారాష్ట్ర అమ్మాయి అయోనిక పాల్ 185.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కెరీర్లో తొలి ప్రపంచకప్ పతకాన్ని దక్కించుకుంది. లండన్ ఒలింపిక్స్ చాంపియన్ యి సిలింగ్ (చైనా-209.6 పాయింట్లు) స్వర్ణం సాధించాడు. షూటర్లకు అమితాబ్ చేయూత ముంబై: సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ యువ క్రీడాకారులకు ఆర్థికంగా అండగా నిలవనున్నారు. ఇద్దరు మహిళా షూటర్లు అయోనికా పాల్, పూజా ఘట్కర్‌లను ఆయన స్పాన్సర్ చేస్తారు. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ప్రణాళికలో భాగంగా ఆటగాళ్లకు అమితాబ్ తన మద్దతు పలికారు. -
చరిత్ర సృష్టించిన మహిళా షూటర్ హీనా సిద్ధూ
ముంబై: భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ ఫైనల్స్ టోర్నమెంట్లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ పిస్టల్ షూటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ఈ సీజన్ ముగింపు టోర్నమెంట్లో హీనా సిద్ధూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. గతంలో భారత్ నుంచి అంజలి భగవత్ (2002లో), గగన్ నారంగ్ (2008లో) రైఫిల్ ఈవెంట్లో ఈ ఘనత సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-10 షూటర్లు మాత్రమే పాల్గొనే ఈ టోర్నీలో హీనా విశేషంగా రాణించింది. స్వర్ణ పతకాన్ని నెగ్గే క్రమంలో ఈ పంజాబ్ అమ్మాయి ‘డబుల్ ఒలింపిక్ చాంపియన్’ గువో వెన్జున్ (చైనా)... ప్రపంచ చాంపియన్ అరునోవిచ్ జొరానా (సెర్బియా)... రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ఒలెనా కొస్టెవిచ్ (ఉక్రెయిన్)లను ఓడించింది. క్వాలిఫయింగ్‌లో