ఒలింపిక్స్‌ షూటింగ్‌లో  ఆసియా కోటా పెంపు.. | ISSF increases Asias Olympic quota places from 38 to 48 | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌ షూటింగ్‌లో  ఆసియా కోటా పెంపు..

Published Mon, Nov 15 2021 2:16 PM | Last Updated on Mon, Nov 15 2021 2:21 PM

 ISSF increases Asias Olympic quota places from 38 to 48 - Sakshi

న్యూఢిల్లీ: ఆసియా దేశాల షూటర్లకు ఇది కచ్చితంగా తీపి కబురే! అంతర్జాతీయ క్రీడా షూ టింగ్‌ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ఒలింపిక్స్‌ షూటింగ్‌లో ఆసియా కోటా పెంచింది. 38 బెర్త్‌ల నుంచి 48 బెర్త్‌లకు పెంచింది. వచ్చే పారిస్‌ ఒలింపిక్స్‌ (2024)లో ఈ హెచ్చింపు అమలయ్యే అవకాశాలున్నాయి.

ఈ మెగా ఈవెంట్‌ కోసం వచ్చే ఏడాది నుంచి షూటింగ్‌లో క్వాలిఫికేషన్‌ పోటీలు జరుగనున్నాయి. ఈ ఏడాది జరిగిన టోక్యో ఈవెంట్‌లో ఆసియా దేశాలకు 38 కోటా బెర్తులు ఇచ్చారు. ‘నిజమే...ఒలింపిక్స్‌ కోటా పెంచామని ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ నుంచి ఆసియా షూటింగ్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఎస్‌సీ)కు లేఖ రాసింది’ అని ఏఎస్‌సీ తెలిపింది.

చదవండి: T20 WC 2021 Winner Australia: మ్యాచ్‌ చూడలేదా అమిత్‌.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement