Anant
-
ప్రతిభా భూషణాలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్,నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.పట్టుదలే పద్మభూషణ్ వరకూ...అజిత్ తండ్రి సుబ్రమణి తమిళనాడులో పుట్టారు. అయితే కేరళ మూలాలు ఉన్న కుటుంబం. తల్లి మోహినిదిపాకిస్థాన్ లోని కరాచీ. కోల్‌కతాలో స్థిరపడ్డ సింధీ కుటుంబం. కాగా కోల్‌కతాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో మోహినితో ప్రేమలో పడ్డారు సుబ్రమణి. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సికిందరాబాద్‌లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఇక్కడ ఐదేళ్లు ఉంది ఆ కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు. అజిత్ రెండో కొడుకు. అజిత్‌కి ఏడాదిన్నర వచ్చాక చెన్నైలో స్థిరపడ్డారు. చదువులో లాస్ట్... అజిత్‌కి పెద్దగా చదువు అబ్బలేదు. అయితే క్రికెట్లో బెస్ట్. ఎన్ సీసీలోనూ మంచి ర్యాంకు సంపాదించాడు. కానీ సరిగ్గా చదవకపోవడంతో స్కూలు యాజమాన్యం అజిత్‌ని పదో తరగతి పరీక్షలు రాయడానికి అనుమతించకపోవడంతోపాటు స్కూలు నుంచి పంపించేసింది. ఆ తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు షోరూమ్‌లో మెకానిక్ అప్రెంటిస్‌గా చేరడం, తల్లిదండ్రుల ్రపోద్భలంతో గార్మెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్‌లో చేరడం, అవి చేస్తూనే రేసుల్లోపాల్గొనడం, ఇలా సాగింది. ఇక ఎవరో ఇచ్చిన సలహాతో సినిమాల్లో ప్రయత్నించాలనుకున్నారు అజిత్. ప్రముఖ నటుడు–రచయిత–దర్శకుడు గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘ప్రేమ పుస్తకం’ సినిమా ఆరంభమైంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పడంతో నిర్మాత పూర్ణచంద్రరావు అజిత్‌ని హీరోగా తీసుకున్నారు. అయితే శ్రీనివాస్ మృతి చెందడంతో షూటింగ్ ఆగింది. ఆ తర్వాత ఆ చిత్రాన్ని మారుతీరావు పూర్తి చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు.‘ఆశై’తో హిట్ ట్రాక్: ఎస్పీబీయే తమిళ దర్శకుడు సెల్వకి చెప్పి, అజిత్‌కి ‘అమరావతి’లో హీరోగా నటించే చాన్స్ ఇప్పించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతోపాటు లుక్స్, నటన పరంగా అజిత్‌కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఓ రేసుకి సంబంధించిన ట్రయల్కి వెళుతుండగా జరిగిన ప్రమాదంలో వెన్నెముకకి సర్జరీ జరిగింది. ఆ తర్వాత ‘ఆశై’ (1995)తో అజిత్ కెరీర్ హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత చేసిన ‘కాదల్ కోటై్ట’ (ప్రేమ లేఖ), ‘వాలి’ వంటివి సూపర్ హిట్. సినిమాలు చేస్తూనే బైక్, కారు రేస్లకూ వెళుతుంటారు. ఇటీవల కారు రేసులో అజిత్ టీమ్ విజయం సాధించింది. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రాల్లో ‘విడాముయర్చి’ తెలుగులో ‘పట్టుదల’గా విడుదల కానుంది. జీవితంలోనూ అజిత్‌కి పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదలే నేడు ‘పద్మభూషణ్’ వరకూ తీసుకొచ్చింది. ఇక ‘అమర్కలమ్’ (1999) సినిమాలో నటించినప్పుడు అజిత్, హీరోయిన్ షాలిని ప్రేమలో పడ్డారు. 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.యాక్టివ్‌గా యాక్టింగ్ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ (76) గురించి నేటి తరానికి చెప్పాలంటే ‘కేజీఎఫ్’ సినిమా చాలు. ‘ప్రేమ లేఖలు’ (1977), ఆ తర్వాత ‘శాంతి క్రాంతి’, ‘శంఖారావం’ వంటి చిత్రాలతో నాటి తరం తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు బాగా గుర్తింపు ఉంది. ఇక నేటితరం తెలుగు ప్రేక్షకులకు ‘కేజీఎఫ్’ (2018) ద్వారా దగ్గరయ్యారు అనంత్ నాగ్. ఈ సినిమాలో ఆయన రచయితపాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘సంకల్ప’ (1973) చిత్రంతో కన్నడంలో నటుడిగా పరిచయం అయ్యారు అనంత్ నాగ్. ఆ చిత్రం పలు అవార్డులు సాధించడంతోపాటు నటుడిగానూ గుర్తింపు తెచ్చిపెట్టింది. 50 ఏళ్ల నట జీవితంలో దాదాపు రెండువందల కన్నడ చిత్రాల్లోనూ, హిందీ, మరాఠీ, తెలుగు, మలయాళం, ఆంగ్లంలో దాదాపు వంద చిత్రాలు... మొత్తంగా మూడ వందల చిత్రాల్లో నటించారు అనంత్ నాగ్. కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. పలు టీవీ షోల్లోనూ నటించారు. 76 ఏళ్ల వయసులోనూ యాక్టివ్‌గా ఉంటూ... సినిమాలు చేస్తున్నారు.కొత్త పంథాకి భూషణంశేఖర్ కపూర్ భారతీయ సినిమా రంగానికి, ముఖ్యంగా బాలీవుడ్‌కి మ్యాజికల్ టచ్ ఇచ్చిన నిన్నటి తరం దర్శక–నిర్మాత. చేసినవి కొన్ని సినిమాలే అయినా, సంపాదించిన కీర్తి, భారతీయ సినిమాకి తెచ్చిపెట్టిన గౌరవం గొప్పవి. ఇప్పటిపాకిస్థాన్లోని లాహోర్‌లో జన్మించారు. సినిమాల మీద మక్కువతో ముంబయి చేరుకున్నారు. మొదట నటుడుగా ప్రయత్నాలు చేశారు. దేవానంద్ ‘ఇష్క్ ఇష్క్ ఇష్క్’లో నటించారు. దూరదర్శన్ తొలిదశలో వచ్చిన ‘ఖాన్ దాన్’ మొదలైన టీవీ సీరియల్స్‌లో ప్రేక్షకులకి గుర్తుండిపోయే కొన్నిపాత్రలు చేశారు. ‘మాసూమ్’తో డైరెక్టర్‌గా...‘మాసూమ్’ సినిమాతో డైరెక్టర్‌గా తన కెరీర్‌ని కొత్త దారి పట్టించారు. ‘ది మేన్, విమెన్ అండ్ చైల్డ్’ అనే ఇంగ్లిష్ నవల ఆధారంగా శేఖర్ కపూర్ తీసిన సినిమా అది. భారతీయ సినిమాకి తెలియని కొత్త కథేమీ కాదు. కానీ సెన్సిబుల్‌గా కథని చెప్పారు. దాంతో శేఖర్ కపూర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.స్టయిల్ మార్చేశారుఇండియాలో అన్ని వర్గాల ఆడియన్స్‌కి శేఖర్ కపూర్‌ని ఓ బ్రాండ్‌గా మార్చిన సినిమా ‘మిస్టర్ ఇండియా’. ‘ది ఇన్విజిబుల్ మేన్’ అనే కామిక్స్ స్ఫూర్తితో ‘మిస్టర్ ఇండియా’ కథ రూపొందింది. హిందీలో అదృశ్య వ్యక్తి హీరోగా అంతకు మునుపు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఈ ఐడియానిపాపులర్ పల్ప్ ఫిక్షన్ చేసిన ఘనత శేఖర్ కపూర్‌దే. కమర్షియల్ కథలను కొత్తగా చెప్పే డైరెక్టర్ వచ్చాడని బాలీవుడ్ మురిసిపోయినంత సేపు పట్టలేదు – శేఖర్ కపూర్ తన స్టయిల్ మార్చేశారు.బాండిట్ క్వీన్‌కి అడ్డంకులు... అవార్డులుచంబల్ లోయకి చెందిన బందిపోటు పూలన్ దేవి జీవిత గాథ ఆధారంగా ‘బాండిట్ క్వీన్’ సినిమా తీశారు శేఖర్. సెన్సేషనల్ హిట్ అయిన ఆ సినిమా పలు సెన్సార్ సమస్యలు ఎదుర్కొంది. రిలీజ్ అయ్యాక చాలా అవార్డులు గెలుచుకుంది. శేఖర్ కపూర్ దృక్పథాన్ని మార్చింది. బ్రిటన్ మహారాణి జీవితం ఆధారంగా ‘ఎలిజిబెత్’ సినిమా తీశారు. అంతర్జాతీయంగా శేఖర్ కపూర్ పేరు మారుమోగిపోయింది. ఆ చిత్రం ఆస్కార్ అవార్డ్స్‌లో ఏడు నామినేషన్లు దక్కించుకుంది. ఆ తర్వాత ఆయన ‘ది ఫోర్ ఫెదర్స్’ (2002), ‘ఎలిజెబెత్’కి సీక్వెల్‌గా ‘ఎలిజెబెత్: ది గోల్డెన్ ఏజ్’ (2007)ని తెరకెక్కించారు. ఎన్నో ఏళ్ళ క్రితమే భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన శేఖర్ కపూర్ పద్మ భూషణుడు కావడం చిత్రసీమకు లభించిన గిఫ్ట్.– తోట ప్రసాద్, ప్రముఖ సినీ రచయితఆమె కెరీర్ శోభాయమానంకేరళలోని త్రివేండ్రంలో (ప్రస్తుతం తిరువనంతపురం) 1970 మార్చి 21న జన్మించారు శోభన. ఆమె పూర్తి పేరు శోభనా చంద్రకుమార్ పిళ్లై. నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభనకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా అక్కినేని నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ (1986) సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు శోభన. ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్‌బాబు, రజనీకాంత్, మోహన్ లాల్, రాజేంద్ర ప్రసాద్, శరత్ బాబు, కార్తీక్ వంటి హీరోల సరసన నటించారు.మాతృభాష మలయాళంతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సినిమాలు చేసిన శోభన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ‘రుద్రవీణ, అభినందన, అల్లుడుగారు, అప్పుల అప్పారావ్, రౌడీగారి పెళ్లాం, రౌడీ అల్లుడు’ వంటి పలు తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. నటనలోనే కాకుండా నాట్యంలో కూడా అద్భుతంగా రాణించారు. చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందిన ఆమె క్లాసికల్ డ్యాన్సర్‌గానూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఆమె దగ్గర నటనలోనూ, నాట్యంలోను శిక్షణ తీసుకుంటుండటం విశేషం. 1994లో ‘కళార్పణ’ అనే సంస్థను నెలకొల్పారు శోభన. ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని కళకు అంకితం చేశారు. ఓ వైపు దేశ విదేశాల్లో క్లాసికల్ డ్యాన్స్ షోలు చేస్తూ.. మరోవైపు డ్యాన్స్ స్కూల్ నడిపిస్తున్నారామె.నటసింహ కీర్తి కిరీటంలో...నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.‘సాహసమే జీవితం’తో హీరోగా1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. 50 ఏళ్ల నట ప్రస్థానంలో...‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. -
వివాన్‌కు రజతం... అనంత్‌కు కాంస్యం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌ను భారత జట్టు నాలుగు పతకాలతో ముగించింది. టోర్నీ చివరిరోజు గురువారం భారత్ ఖాతాలో ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి రెండు పతకాలు చేరాయి. పురుషుల ట్రాప్ ఈవెంట్లో జైపూర్‌కు చెందిన వివాన్ కపూర్ రజత పతకం సొంతం చేసుకోగా... పురుషుల స్కీట్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్ నరూకా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆరుగురు షూటర్లు పోటీపడ్డ ‘ట్రాప్’ ఫైనల్లో 22 ఏళ్ల వివాన్ 44 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. వివాన్ కెరీర్లో ఇదే తొలి అంతర్జాతీయ వ్యక్తిగత పతకం. గతంలో అతను మూడుసార్లు వరల్డ్‌కప్ టీమ్ ఈవెంట్స్‌లో రజత పతకాలు సాధించాడు. ‘స్కీట్’ ఈవెంట్ ఫైనల్లో ‘పారిస్ ఒలింపియన్’ అనంత్‌జీత్ 43 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని పొందాడు. అనంత్ కెరీర్లో ఇదే తొలి వరల్డ్‌కప్ మెడల్ కావడం విశేషం. మహిళల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో భారత షూటర్ గనీమత్ సెఖోన్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ టోరీ్నలో భారత్ 2 రజతాలు, 2 కాంస్యాలతో నాలుగు పతకాలు నెగ్గి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది. -
అనంత్ అంబానీ పెళ్లిలో లాలూకు ప్రత్యేక స్వాగతం
రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన ఫార్మా టైకూన్ వీరేన్, శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లికి హాజరైన వారిలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ యాదవ్ కూడా ఉన్నారు.లాలూ యాదవ్‌తో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మిసా భారతి కూడా వివాహ వేడుకలో పాల్గొన్నారు. లాలూ కుటుంబ సభ్యులను అనంత్ అంబానీ చిన్నాన్న అనిల్ అంబానీ, చిన్నమ్మ టీనా అంబానీ ప్రత్యేకంగా స్వాగతించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన భార్య డింపుల్ యాదవ్‌తో సహా వివాహానికి వచ్చారు. అలాగే గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్ తన భార్యతో కలిసి వచ్చారు. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తదితరులు కూడా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహానికి హాజరయ్యారు. बिहार के पूर्व सीएम और RJD अध्यक्ष लालू यादव शादी में शामिल होने पहुँचे#BiharNews #anantambaniwedding #AnantRadhikaWedding #AnantAmbani #MukeshAmbani #LaluPrasadYadav pic.twitter.com/JSym9IpQOO— India TV (@indiatvnews) July 12, 2024 -
పెళ్లి వేడుకల్లో ప్రియుడితో కలిసి సందడి చేసిన హీరోయిన్..!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న మూవీలో రామ్ చరణ్ సరసన కనిపించనుంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది ముద్దుగుమ్మ.తాజాగా ముంబయిలో జరుగుతున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వెడ్డింగ్ వేడుకల్లో మెరిసింది. బుధవారం జరిగిన శివశక్తి పూజకు హాజరైంది. జాన్వీ భాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న శిఖర్ పహారియాతో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీరితో పాటు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దంపతులు కూడా సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
సైబర్ నేరాలు.. ఏటా రూ.10 లక్షల కోట్ల భారం !
న్యూఢిల్లీ: సైబర్ నేరాలనేవి డిజిటలీకరణకు అతి పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. వీటి వల్ల 2025 నాటి కల్లా ఎకానమీలపై ఏటా 10 లక్షల కోట్ల మేర భారం పడనుందని అంచనాలు నెలకొన్నాయి. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. సైబర్ నేరాల వల్ల ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలపై ఏటా 6 లక్షల కోట్ల డాలర్ల మేర భారం పడుతోందని, 2025 నాటికి ఇది దాదాపు 10 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయని ఆయన వివరించారు. వ్యాపారంలో టెక్నాలజీ వినియోగ తీవ్రతను బట్టే ప్రతి కంపెనీ వృద్ధి ఆధారపడి ఉంటోందని మహేశ్వరి తెలిపారు. పరిశ్రమ వృద్ధి చెందే కొద్దీ, కంపెనీలు సైబర్ సెక్యూరిటీపైనా, విశ్వసనీయ టెక్నాలజీపైనా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. డిజిటల్‌కు మారే క్రమంలో భారత్ .. క్లౌడ్ సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. -
‘రైతు’పై లోక్‌సభలో రచ్చ
♦ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న కాంగ్రెస్ ♦ స్వామినాథన్ సిఫారసులపై ఏం చేశారని ప్రశ్న ♦ విపక్షానివి మొసలి కన్నీళ్లేనన్న కేంద్ర మంత్రి అనంత్ ♦ సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్.. కోరం లేక రాజ్యసభ వాయిదా న్యూఢిల్లీ: రైతు సమస్యలపై శుక్రవారం లోక్‌సభ వేడెక్కింది. దేశవ్యాప్తంగా అన్నదాత ఇబ్బందులకు మీరంటే మీరేనని అధికార, విపక్షాలు విమర్శించుకోవటం, స్పీకర్ పోడియం వద్ద నిరసనలు చేయటంతో సభ నినాదాలతో దద్దరిల్లింది. రైతులు రోడ్లపైకి వస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ప్రభుత్వానికి అసలు రైతు సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించింది. ప్రధాని సమాధానం ఇవ్వని కారణంగా సభనుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ప్రభుత్వం మండిపడింది. రైతు సమస్యలపై 60 ఏళ్లుగా కాంగ్రెస్ మొసలికన్నీరు కారుస్తోందని ప్రతివిమర్శలు చేసింది. అటు రాజ్యసభలో పలు బిల్లులపై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ కోరం లేక సభ వాయిదా పడింది. స్వామినాథన్ సిఫారసుల అమలేది? లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు దీపేందర్ సింగ్ హుడా రైతు సమస్యలపై చర్చను లేవనెత్తారు. ‘మధ్యప్రదేశ్ అయినా, మహారాష్ట్ర అయినా దేశవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చారు. సభలో దీనిపై చర్చ జరిగినా ప్రధాని నుంచి స్పందన లేదు’ అని ఆయన విమర్శించారు. ఎమ్మెస్ స్వామినాథన్ సిఫారసులను అమలుచేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఇంతలోనే ప్రధాని స్పందించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ కాసేపు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత జీరో అవర్‌లోనూ కాంగ్రెస్ సభ్యులు ఇదే డిమాండ్‌తో నిరసన తెలిపింది. అనంతరం.. ప్రధాని రైతు సమస్యలపై స్పందించకపోవటంతో వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌వి మొసలి కన్నీళ్లు! స్పీకర్ పోడియం వద్ద కాంగ్రెస్ సభ్యుల నినాదాలు, హుడా ప్రసంగంపై అధికార పక్షం దీటుగానే స్పందించింది. 60 ఏళ్లుగా రైతుల కోసం కాంగ్రెస్ ఏం చేసిందని బీజేపీ ఎంపీలు సభలో మండిపడ్డారు. సమస్యలు తీర్చకపోగా మరింత నష్టాల్లోకి వ్యవసాయాన్ని నెట్టేశారంటూ ప్రతివిమర్శలు చేశారు. రైతు సమస్యలపై 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ విమర్శించారు. వ్యవసాయ సమస్యలపై బుధవారం జరిగిన చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ పారిపోయిందని ఎద్దేవాచేశారు. రైతులకు ఎరువులు అందుబాటులోకి తీసుకురావటం మొదలు పంట బీమా వరకు ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం మూడేళ్లుగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని అనంత్ కుమార్ తెలిపారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పోలిస్తే దేశంలో వైద్యుల కొరత స్పష్టంగా ఉందని ప్రభుత్వం లోక్‌సభకు వెల్లడించింది. ప్రతి వెయ్యి మందికి కనీసం ఒక్క డాక్టర్ కూడా లేని పరిస్థితులు దేశంలో ఉన్నాయని వైద్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పాటిల్ స్పష్టం చేశారు. రాజ్యసభలో.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించినప్పటికీ కొన్ని పత్రికలు, చానెళ్లు ప్రసారం చేయటంపై ఆ పార్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సభ చైర్మన్ హమీద్ అన్సారీ జోక్యం చేసుకుని ఆయా మీడియా సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కాగా, ప్రాంతీయ భాషలపై హిందీని రుద్దాలనుకోవటం లేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టం చేసింది. హిందీ అధికారిక భాష అయినప్పటికీ.. అన్ని భాషలను జాతీయ భాషలుగానే గుర్తిస్తున్నామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం 38 భాషలకు త్వరలోనే అధికారిక భాష హోదా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అయితే రాజ్యసభలో పలు బిల్లులపై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ సరైన కోరం (కనీసం 25 మంది ఉండాల్సి ఉండగా 23 మందే సభలో ఉన్నారు) లేని కారణంగా సభ వాయిదా పడింది. 19వేల కోట్ల నల్లధనం గుర్తింపు న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌లోని హెచ్ఎస్బీసీ అకౌంట్లతోపాటుగా ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం (ఐసీఐజే) వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రూ.19 వేల కోట్ల భారతీయుల నల్లధనాన్ని ఐటీ శాఖ గుర్తించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో తెలిపారు. ఐసీఐజే, హెచ్ఎస్బీసీ నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం.. 700 మంది భారతీయులు అనుమానాస్పదంగా విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంపై విచారణ సందర్భంగా ఈ వివరాలు వెల్లడయ్యాయన్నారు. దీనికి సంబంధించిన 31 కేసుల్లో 72 ఫిర్యాదులను క్రిమినల్ కోర్టుల్లో దాఖలు చేసినట్లు వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో ఖాతాలున్న 628 మంది భారతీయుల వివరాలను ఫ్రాన్స్ ప్రభుత్వం అందజేసిందన్నారు. ‘ప్రభుత్వ సంస్థల విచారణ సందర్భంగా రూ.8,437 కోట్ల నల్లధనాన్ని మే 2017 వరకు దేశానికి తీసుకొచ్చాం. 162 కేసుల్లో రూ.1,287 కోట్ల జరిమానా విధించాం. 84 కేసుల్లో 199 క్రిమినల్ ప్రాసిక్యూషన్ కేసులు దాఖలు చేశాం’ అని జైట్లీ వెల్లడించారు. పనామా పేపర్ల లీక్ సమయంలోనే (ఏప్రిల్ 2016లో) ప్రభుత్వం వివిధ విచారణ సంస్థల బృందం (ఎమ్‌ఏజీ)ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.