
రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన ఫార్మా టైకూన్ వీరేన్, శైలా మర్చంట్‌ల కుమార్తె రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లికి హాజరైన వారిలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ యాదవ్ కూడా ఉన్నారు.
లాలూ యాదవ్‌తో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మిసా భారతి కూడా వివాహ వేడుకలో పాల్గొన్నారు. లాలూ కుటుంబ సభ్యులను అనంత్ అంబానీ చిన్నాన్న అనిల్ అంబానీ, చిన్నమ్మ టీనా అంబానీ ప్రత్యేకంగా స్వాగతించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన భార్య డింపుల్ యాదవ్‌తో సహా వివాహానికి వచ్చారు. అలాగే గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్ తన భార్యతో కలిసి వచ్చారు. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తదితరులు కూడా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్‌ల వివాహానికి హాజరయ్యారు.
बिहार के पूर्व सीएम और RJD अध्यक्ष लालू यादव शादी में शामिल होने पहुँचे#BiharNews #anantambaniwedding #AnantRadhikaWedding #AnantAmbani #MukeshAmbani #LaluPrasadYadav pic.twitter.com/JSym9IpQOO
— India TV (@indiatvnews) July 12, 2024
Comments
Please login to add a commentAdd a comment