
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న మూవీలో రామ్ చరణ్ సరసన కనిపించనుంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది ముద్దుగుమ్మ.
తాజాగా ముంబయిలో జరుగుతున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వెడ్డింగ్ వేడుకల్లో మెరిసింది. బుధవారం జరిగిన శివశక్తి పూజకు హాజరైంది. జాన్వీ భాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న శిఖర్ పహారియాతో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీరితో పాటు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దంపతులు కూడా సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment