
దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గ్లామరస్ బ్యూటీగా నిత్యం వార్తల్లో నిలిచే జాన్వీ ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియాతో ఆమె డేటింగ్ చేస్తుందంటూ బీటౌన్‌లో వార్తలు గుప్పమంటున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు స్పందించని ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి ప్రియుడితో కనిపించింది.
బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహరియాతో కలిసి ముంబైలోని కలినా ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. ఇద్దరూ వైట్‌డ్రెస్‌లో ట్విన్నింగ్ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. అయితే ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు రాగానే ఇద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
గతంలో పలు పార్టీలకు కలిసి హాజరైన జాన్వీ-శిఖర్‌లు ఇప్పటివరకు తమ రిలేషన్‌షిప్‌పై అధికారికంగా ప్రకటించలేదు. కాగా ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్‌తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‌కు పరిచయం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment