అతని వల్ల నా హార్ట్‌ బ్రేక్ అయింది: జాన్వీ కపూర్ కామెంట్స్‌ | Janhvi Kapoor talks about going back to Shikhar Pahariya after break up | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: పీరియడ్స్‌లో ఉన్నప్పుడు బ్రేకప్ చెప్పేదాన్ని: దేవర భామ

Published Mon, Jul 22 2024 3:28 PM | Last Updated on Mon, Jul 22 2024 3:42 PM

Janhvi Kapoor talks about going back to Shikhar Pahariya after break up

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం ఉలజ్ మూవీతో ప్రేక్షకులను ‍పలకరించనుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.  ఈ మూవీ ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. ఆ తర్వాతా టాలీవుడ్‌లో దేవర భామ ఎన్టీఆర్ సరసన కనిపించనుంది. ఇటీవల అంబానీ పెళ్లిలో తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి సందడి చేసింది. వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. దీంతో అతనితోనే ఏడడుగులు నడుస్తుందని బాలీవుడ్‌లో టాక్‌ కూడా వినిపిస్తోంది. తాజాగా అతనితో రిలేషన్‌పై జాన్వీ కపూర్‌ ఆసక్తికర కామెంట్స్ చేసింది. కానీ అతని వల్లే తనకు ఒకసారి హార్ట్ బ్రేక్ అయిందని వెల్లడించింది.

శిఖర్ పహారియాతో తన రిలేషన్‌ గురించి జాన్వీ కపూర్ చాలా ఓపెన్‌గా మాట్లాడింది. గతంలో తాను శిఖర్‌తో ఎందుకు విడిపోయిందో కారణాలను వివరించింది. నాకు పీరియడ్స్ వచ్చాక మొదటి రెండేళ్ల పాటు ప్రతి నెలా అతనితో బ్రేకప్ అయ్యానని వెల్లడించింది. దీంతో తాను మొదటి రెండు, మూడు నెలలు షాక్‌లో ఉన్నాడని తెలిపింది. ఆ తర్వాత రెండు రోజులకే నేను అతని వద్దకు వెళ్లి ఏడుస్తూ సారీ చెప్పేదాన్ని అని పేర్కొంది. కానీ ఆ సమయంలో నా మెదడు ఎందుకలా పనిచేస్తుందో అర్థం కాలేదని జాన్వీ చెప్పుకొచ్చింది.

శిఖర్ వల్ల ఒకసారి తన గుండె పగిలిపోయిందని.. కానీ అదే మనిషి తిరిగి వచ్చి నా పగిలిన గుండెను మళ్లీ ఒక్కటి చేశాడని తెలిపింది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని వివరించింది. కాగా.. బాలీవుడ్‌ ఎంట్రీకి ముందే జాన్వీ శిఖర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ఆ తర్వాత 2018 వచ్చిన రొమాంటిక్ మూవీ ధడక్‌ సహనటుడు ఇషాన్ ఖట్టర్‌తో డేటింగ్ చేసింది. ఇషాన్‌తో విడిపోయిన తర్వాత మళ్లీ శిఖర్‌తో జతకట్టింది. ఇక సినిమాల విషయాకొనిస్తే..జాన్వీ చిత్రం ఉలాజ్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో జాన్వీ కపూర్‌ డిప్యూటీ హైకమీషనర్‌గా కనిపించనున్నారు. ఆ తర్వాత దేవర పార్ట్ 1తో పాటు రామ్ చరణ్ సరసన నటించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement