మెడలో బాయ్‌ఫ్రెండ్‌ నెక్లెస్.. దేవర భామ డేటింగ్‌ నిజమేనా! | Janhvi Kapoor Wears Necklace With Boyfriend Shikhar Pahariyas Name | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌ పేరుతో నెక్లెస్.. జాన్వీ కపూర్‌ డేటింగ్‌ నిజమేనా!

Published Wed, Apr 10 2024 3:32 PM | Last Updated on Wed, Apr 10 2024 3:56 PM

Janhvi Kapoor Wears Necklace With Boyfriend Shikhar Pahariyas Name - Sakshi

బాలీవుడ్‌ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ పరిచయం అక్కర్లేని పేరు. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆ తర్వాత బుచ్చిబాబు- చెర్రీ కాంబోలో వస్తోన్న మూవీలోనూ ఛాన్స్‌ కొట్టేసింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమంలో మెరిసింది జాన్వీ. 

అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇటీవలే తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. అదే సమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్‌ పహారియా కూడా వెంటే ఉన్నారు. అయితే వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. అదే సమయంలో ఇటీవల ఆమె తండ్రి బోనీకపూర్‌ కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. శిఖర్‌ చాలా మంచివాడని ప్రశంసలు కురిపించారు. దీంతో వీరిద్దరి డేటింగ్‌ నిజమేనని హింట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా జాన్వీ కపూర్ మైదాన్‌ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లింది. అదే సమయంలో అక్కడున్న వారి పోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్‌ తన భాయ్‌ఫ్రెండ్‌ పేరు ఉన్న నెక్లెస్‌ను ధరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

పేరుతో నెక్లెస్

జాన్వీ కపూర్‌ ధరించిన నెక్లెస్‌పై శిఖు అని రాసి ఉంది. ఈ పేరుతోనే జాన్వీ అతన్ని ముద్దుగా పిలుస్తుందట. అంతేకాదు మంగళవారం ఉదయం నటి శిఖర్ తల్లి స్మ్రుతి షిండేతో కలిసి బాంద్రా ప్రభాదేవిలోని సిద్ధివినాయక ఆలయానికి చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించింది.

మార్చిలో జాన్వీ తన పుట్టినరోజు సందర్భంగా శిఖర్‌తో కలిసి తిరుపతి బాలాజీ ఆలయానికి నడిచి వెళ్లారు. మోకాళ్లపై ఆలయ మెట్లను కూడా ఎక్కారు. ఇవన్నీ చూస్తుంటే శిఖర్‌ పహారియాకు జాన్వీ  కపూర్ కుటుంబం ఓకే చెప్పినట్లు అర్థమవుతోంది. ఇటీవల జాన్వీ తండ్రి బోనీ కపూర్ మాట్లాడుతూ.. తమ జీవితంలోకి ఇలాంటి యువకుడు ఉన్నందుకు తాము ఆశీర్వదంగా భావిస్తున్నామని తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య డేటింగ్‌ నిజమేనని తెలుస్తోంది. 
 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement