
ఇంట్లో ఆడుకుంటుండగా చిన్నారుల హత్య
అనంతపురం : అనంతపురం జిల్లా మడకశిరలో దారుణం జరిగింది. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సమీపంలోని ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురయ్యారు. వీరిద్దరు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. దొంగతనం కోసం వచ్చిన దుండగులు చిన్నారులను గొంతు నులిమి హతమార్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.