సాక్షి, మడకశిర: అనంతపురం జిల్లా మడకశిరలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శంకరగల్లు గ్రామానికి చెందిన పుష్పలత నాలుగు రోజుల కిందట దారుణహత్యకు గురైంది. గ్రామస్తుల సమాచారం మేరకు అదే గ్రామానికి చెందిన మారుతి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళపై అత్యాచారం చేసి నగలు దోచుకొని మహిళను చంపి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిందితుడు మారుతిని తమ గ్రామం నుంచి బహిష్కరించి కఠినంగా శిక్షించాలని శంకరగల్లు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి శనివారం మధ్యాహ్నం మడకశిర పోలీసు స్టేషన్ ను ముట్టడించారు. పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment