Brutally Murdered
-
బెజవాడలో వ్యక్తి దారుణ హత్య
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరం నడిరోడ్డున మంగళవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచిన స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన, సేకరించిన వివరాల ప్రకారం.. యనమలకుదురు డొంకరోడ్డులోని శ్రీనివాస అపార్ట్‌మెంట్స్‌లో మహ్మద్ రఫీ(54), అజ్మరీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. రఫీ వారి ఇంటి సమీపంలోనే ఆదిల్ డిజిటల్ సేవా కేంద్రాన్ని నడుపుతూ జీవనం సాగిస్తూ పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. రఫీతో కలిసి లయోలా కళాశాలలో చదువుకున్న సాగి వెంకట నరసింహరాజు(54) అనే స్నేహితుడు హైదరాబాద్‌లో నివసిస్తూ ఓ ఫార్మసీ కంపెనీని నడుపుతున్నాడు. సోమవారం నగరానికి వచ్చిన నరసింహరాజు తన స్నేహితుడు రఫీకి ఫోన్ చేసి అయోధ్యనగర్‌లోని లోటస్ ల్యాండ్‌మార్క్‌లో ఉన్న తన ఫ్లాట్‌కు రమ్మని పిలిచాడు. దీంతో రఫీ సోమవారం తన స్నేహితుడు ఉన్న ఫ్లాట్‌కు వెళ్లాడు. రఫీకి మద్యం తాగే అలవాటు ఉంది. నరసింహరాజు మాత్రం మద్యం ముట్టడు. దీంతో నరసింహరాజు తన స్నేహితుడు రఫీకి మద్యం తెప్పించాడు. రఫీ మద్యం తాగాడు. అనంతరం రఫీకి, నరసింహరాజుకు మధ్య డబ్బుల విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో రఫీ సమీపంలో ఉన్న కత్తెరను తీసుకొని నరసింహరాజును పొడిచేందుకు ప్రయత్నించగా అతను తన మెడలో ఉన్న కండువాను తీసి రఫీ మెడకు గట్టిగా బిగించేయడంతో రఫీ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు. నరసింహరాజు విషయాన్ని 100కు ఫోన్ చేసి పోలీసులకు, 108కు ఫోను చేసి జరిగిన విషయాన్ని చెప్పగా వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రఫీని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. కత్తితో దాడి చేయబోతే ప్రతిఘటించా... తన స్నేహితుడు రఫీ ఇటీవల బాగా అప్పులపాలయ్యాడని ఈ క్రమంలో తనను రూ.3 లక్షలు అప్పుగా అడగడంతో తాను నిరాకరించానన్నారు. ఆ విషయంలో తమ ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందని, రఫీ పక్కనున్న కత్తెరతో తనపై దాడికి ప్రయతి్నంచగా తాను అతన్ని ఆపేందుకు కండువాతో గట్టిగా గొంతు నులిమానంటూ నిందితుడు నరసింహరాజు పోలీసులకు చెప్పుకొచ్చాడు. తన బాల్య స్నేహితుడిని తానెందుకు చంపుకొంటానంటూ వాపోయాడు. అన్నీ అబద్ధాలే.. కావాలనే నా భర్తను హతమార్చారు... నరసింహరాజు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని రఫీ భార్య అజ్మిరీ ఆరోపించింది. తన భర్త రఫీయే నరసింహరాజుకు డబ్బులు ఇచ్చాడని, వాటిని ఇవ్వమని అనేకసార్లు అడుగుతుంటే మాట దాట వేసుకుంటూ వస్తున్నాడన్నారు. ఈ విషయమే మాట్లాడేందుకు వారిద్దరూ కలిశారని తెలిపింది. పథకం ప్రకారమే తన భర్తకు ఫుల్‌గా మద్యం తాగించి, తన భర్త పైనే కత్తెరతో దాడిచేసి నైలాన్ కండువాతో గొంతు నులిమి హత్య చేశాడని ఆమె ఆరోపించింది. నరసింహరాజుతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కలిసి తన భర్తను హతమార్చి ఉంటారని, పోలీసు ఉన్నతాధికారులు దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆమె కోరింది. రఫీ బంధువుల ఆందోళన రఫీ కుటుంబ సభ్యులు, బంధువులు తమకు న్యాయం చేయాలని మంగళవారం సాయంత్రం రఫీ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చేందుకు ప్రయతి్నంచారు. పోలీసులు వారిని ప్రభుత్వ హాస్పిటల్ వద్దే అడ్డుకుని గేటు మూసేసి బయటకు రాకుండా నిలిపివేశారు. -
మర్మాంగాలు కోసి..వ్యక్తి దారుణ హత్య
చందానగర్: ఓ వ్యక్తిని పురుషాంగాలు కోసి దారుణంగా హత్య చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పాలవెల్లి తెలిపిన ప్రకారం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకామనిపాడు గ్రామానికి చెందిన తన్నీరు మాలాద్రి (36) భార్య మాధవితో కలిసి ఆరేళ్లుగా శేరిలింగంపల్లి తారానగర్‌లో ఉంటున్నాడు. సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. మాలాద్రి ఇంటి పక్కనే సోదరి అరుణ కూడా నివాసముంటున్నారు. కాగా అతని భార్య మాధవి సెప్టెంబర్ 30న తన సొంత గ్రామంలో బంధువుల పెళ్లి ఉండడంతో పిల్లలతో కలిసి ఊరెళ్లింది. మంగళవారం మాలాద్రి ఉదయం ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం 6 గంటలకు అతని సోదరి అరుణ పిలిస్తే పలకలేదు. నిద్రపోయి ఉంటాడని ఆమె వెళ్లిపోయింది. 6.30 గంటలకు ఫోన్ చేయగా తీయకపోవడంతో వారు మళ్లీ ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడని, మర్మాంగాలు కోసి ఉన్నాయని ధృవీకరించారు. దీంతో అర్ధరాత్రి చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ పాలవెల్లి, క్లూస్ టీం సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. -
వివాహేతర సంబంధం వద్దన్నందుకు..
పహాడీషరీఫ్: ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట హఫీజ్‌బాబానగర్‌కు చెందిన సయ్యద్ మునీర్ కుమారుడు సయ్యద్ సమీర్(19), సోహెల్, సోఫియన్ స్నేహితులు. వీరిలో ఒకరైన సోహెల్ ఇదే కాలనీలలో ఉండే ఓ వివాహితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సమీర్.. అందరం ఒకే కాలనీలో ఉంటున్నాం.. నాకు కూడా అక్కాచెల్లెళ్లు ఉన్నారు.. ఇలా చేయడం తప్పు అని సోహెల్‌కు సూచించాడు. ఇది జీరి్ణంచుకోలేని అతను సమీర్ తనపై దు్రష్పచారం చేస్తున్నాడని భావించాడు. ఎలాగైనా అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే గురువారం రాత్రి తన మరో స్నేహితుడు సోఫియన్‌తో కలిసి ముందస్తు పథకంలో భాగంగా.. సమీర్‌ను తీసుకుని బాలాపూర్ ఠాణా పరిధిలోని గుర్రం చెరువు ప్రాంతానికి వెళ్లారు. అనంతరం వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో సోహెల్ దాడికి పాల్పడ్డాడు. సమీర్ ఛాతి, వీపు భాగాల్లో ఐదుసార్లు బలంగా పొడిచాడు. ఈ సమయంలో విరిగిపోయిన కత్తి మృతుడి కడుపులోనే ఉండిపోవడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
అనంతపురం: మాజీ ప్రిన్సిపాల్ దారుణహత్య.. అంతలోనే మరో విషాదం
అనంతపురం: వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేసిన ఘటన అనంతపురం పట్టణాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మేనల్లుడి చేతిలో హతమైన మూర్తిరావు (58) గురించి తెలిసేలోపే భర్త వియోగాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మరణించడంతో స్థానిక జేఎన్టీయూ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఈయనకు ఓ కుమారుడు, కుమార్తె. కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు. భార్య కళ్లెదుటే దారుణం.. మూర్తిరావుకు షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు సొంతిల్లు ఉంది. వీటిని అద్దెకు ఇచ్చేసి ఆయన నగరంలోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబసభ్యులతో ఉంటున్నారు. ఇంట్లో అద్దెకున్న మణికంఠ అనే వ్యక్తి ఆదివారం ఇల్లు ఖాళీ చేసి మూర్తిరావుకు ఫోన్ చేశారు. ఖాళీ చేసిన ఇంటిని చూసుకుని తాళాలు తీసుకు వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో తన భార్య శోభతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు. అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా... నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు. హతుడి పక్కనే కూర్చొని.. మూర్తిరావును హతమార్చిన అనంతరం ఆదిత్య ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్కు వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, మృతదేహం పక్కనే కూర్చుండి పోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్‌లర్‌లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌లైన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. వివాదరహితుడు మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్టీయూఏలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి పీహెచ్డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్‌లో బ్యాంక్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. -
ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువతి హత్య
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం బక్‌లేలో దారుణ ఘటన జరిగింది. హైదరాబాద్ ఏఎస్రావునగర్కు చెందిన వివాహిత చైతన్య మదగాని అలియాస్ శ్వేత శనివారం హత్యకు గురైంది. చైతన్యను చంపిన దుండుగులు ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన చెత్త డబ్బాలో పారేశారు. హత్యకు సంబంధించి సెకండ్ క్రైమ్ సీన్‌ను పాయింట్ కుక్లోని మిర్కా వేలో ఉన్న చైతన్య ఇంట్లో పోలీసులు రీ క్రియేట్ చేశారు. అయితే హత్య చేసిన వాళ్లు చైతన్యకు తెలిసిన వాళ్లేనని పోలీసులు చెబుతున్నారు. ఆమెను చంపినతర్వాత దుండగులు వేరే దేశానికి పారిపోయారని తెలిపారు. హత్య చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. కాగా, శ్వేత భర్త, మూడేళ్ల కొడుకు హైదరాబాద్ వచ్చేశారు. ఇదీ చదవండి.. కర్రతో బాది యువకుడకి హత్య -
శ్రీనివాసులరెడ్డి హత్య కేసులో నిందితుల అరెస్ట్‌కు రంగం సిద్ధం
కడప అర్బన్ : వైఎస్ఆర్సీపీ నాయకుడు చిన్ననాగిరెడ్డి గారి శ్రీనివాసులరెడ్డి (42) దారుణ హత్య కేసును జిల్లా పోలీసు యంత్రాంగం ఛేదించింది. కొన్ని రోజులుగా కీలక నిందితులు పక్కాగా వ్యూహం పన్నినట్లు స్పష్టమైంది. శ్రీనివాసులరెడ్డికి, ప్రధాన నిందితుడు ప్రతాప్‌రెడ్డికి ఇద్దరికీ వెన్నుదన్నుగా నిలిచిన మరో కీలక వ్యక్తికి కూడా ఈ హత్యలో ప్రమేయం వుందని పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తికి సంబంధించిన వ్యాపార సంస్థల వద్దనే రోజుల తరబడి కీలక నిందితుడు ప్రతాప్‌రెడ్డి, మరి కొంత మందితో గంటల తరబడి మంతనాలు చేసినట్లుగా పోలీసులకు సీసీ ఫుటేజీల ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రతాప్‌రెడ్డి స్వగృహాంలో నిర్వహించిన సోదాలలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు ఛేదించడంలో ప్రమేయమున్న అందరిపైనా పోలీసులు నిష్పక్షపాతంగా, చట్ట పరిధిలో శిక్షించేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం. శ్రీనివాసులరెడ్డి వ్యతిరేకుల ప్రమేయం, వ్యాపార లావాదేవిల్లో నెలకొన్న వివాదాలు, భాగస్వాముల మధ్య భేదాభిప్రాయాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. గురువారం రాత్రి మట్టుబెట్టేందుకు మాటు వేసిన ప్రధాన నిందితుడు శ్రీనివాసులరెడ్డిని హత్య చేసేందుకు గురువారం రాత్రి కూడా మాటు వేసినట్లు తెలుస్తోంది. ఒకప్పటీ అనుకూలమైన సహచరుడుగా ఉంటూ దాదాపు ఏడాదిగా దూరంగా ఉన్న ఎర్రముక్కపల్లెకు చెందిన గుంటీ నాగేంద్ర సమీప బంధువులచే శ్రీనివాసులరెడ్డిని డిన్నర్‌కు ఆహ్వానించారు. డిన్నర్ ముగించుకొని రాజీవ్‌మార్గ్ ప్రధాన రహదారిలో శ్రీనివాసులరెడ్డి వచ్చే అవకాశం ఉంటుందనే భావనతో.. సమీపంలో ప్రధాన నిందితుడు మాటు వేసి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్‌కు హాజరు కావడం, వెహికల్లో వెళ్లి రావడంతో హత్య పథక రచన అమలు చేయలేకపోయినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం మాటు వేసి, పక్కా ప్రణాళిక బద్ధంగా బుర్ఖాలు ధరంచి హత్యాకాండను అమలు చేశారు. ప్రత్యక్ష, పరోక్ష సహకారంపై ప్రత్యేక దృష్టి శ్రీనివాసులరెడ్డి హత్యలో ప్రత్యక్ష, పరోక్షంగా ప్రధాన నిందుతులకు సహకరించిన వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈక్రమంలో ఓ వ్యాపారవేత్తతో ప్రధాన నిందితుడు ప్రతాప్‌రెడ్డి చేపట్టిన లావాదేవిలపై కూపీ లాగినట్లు సమాచారం. హత్యాకాండలో పాల్గొన్న వారికి మృతుడు శ్రీనివాసులరెడ్డి మధ్య నెలకొన్న వివాదాలను సరిపోల్చుకుంటున్నారు. అయితే హత్య తర్వాత ప్రధాన నిందితుడు ప్రతాప్‌రెడ్డికి సహకరించిన వ్యక్తులపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి స్కూటర్‌పై ఒక చోటి నుంచి మరో ప్రాంతానికి ప్రతాప్‌రెడ్డిని తరలించినట్లు కూడా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆపైన డయల్ 100కు సమాచారమిచ్చిన పిదప పోలీసులకు దొరికిపోయేలా చాకచక్యంగా వ్యవహరించినట్లు సమాచారం. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, కడప ఒన్‌టౌన్ సీఐ ఎన్వి నాగరాజు, కడప రూరల్ సీఐ కె.అశోక్‌రెడ్డి, ఎస్ఐలు, సిబ్బందితో కలిసి ఈ హత్య కేసులో ఇప్పటికే కీలక ఆధారాలను, ప్రతాప్‌రెడ్డితోపాటు, ఇతర నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజులల్లో నిందితుల్ని మీడియా ముందు హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది. -
సామాజిక కార్యకర్త దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌కు చెందిన ఆశా స్వచ్ఛంద సేవాసంస్థ డైరెక్టర్ గౌరీ మిశ్రా(54) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్పులు జరపడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మిశ్రాను గుణుçపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించారు. తనిఖీ చేసిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి గుణుపూర్ ఆదర్శ పోలీస్ స్టేసన్ ఐఐసీ నీలాంబర్ జాని వివరాలను ఆదివారం వెల్లడించారు. రోజూ రాత్రి భోజనం అనంతరం గౌరీ మిశ్రా, కొంతమంది మిత్రులు కలిసి సమీపంలోని వంశధార నది వంతెన వద్దకు బైక్‌పై వెళ్లి, కొద్దిసేపు గడిపి తిరిగి వస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో అంతా వంతెనకు చేరుకోగా.. మరికొంత సమయం ఉండి వస్తానని మిశ్రా చెప్పడంతో మిగతా వారంతా ఇళ్లకు తిరిగి వెళ్లారు. కొద్ది సేపటికి కొంతమంది దుండగులు బైకుపై వచ్చి, తుపాకీతో అతి సమీపం నుంచి అతనిపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. దర్యాప్తు ముమ్మరం.. గౌరీ మిశ్రా గత కొన్నాళ్లుగా ఆశా అనే స్వచ్ఛంద సేవాసంస్థకు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అంతకుముందు పాత్రికేయుడిగా పనిచేసిన ఆయన.. డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తుండటంతో పాత్రికేయ వృత్తి వీడారు. ఆశా తరఫున పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ స్థానికంగతా ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఈ దారుణ హత్యకు గురికావడం స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గుణుపూర్ పరిసర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. హత్యకు సంబంధించి ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనలో మావోయిస్టుల ప్రమేయం ఉందా? గిట్టని వారు ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారా అని అనుమానిస్తున్నారు. పూర్తి ఆధారాలు సేకరించిన అనంతరం హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు స్పష్టంచేశారు. -
వ్యక్తి దారుణ హత్య
ములకలచెరువు: ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ములకలచెరువు మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దేవులచెరువు పంచాయతీ గోళ్లవారిపల్లెకు చెందిన పసుపులేటి శ్రీనివాసులు(32), భార్య శోభా దంపతులు ములకలచెరువులోని ఒక టమాట మార్కెట్‌యార్డులో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. వీరికి కుమార్తె వర్షా(17), కుమారుడు మునిచరణ్(5) ఉన్నారు. శనివారం భార్య శోభా తన భర్త తల్లి పసుపులేటి సాలెమ్మతో కలిసి టమాట పొలంలో పనులకు వెళ్లింది. పసుపులేటి శ్రీనివాసులు మాత్రం యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. రోజూ చుట్టు పక్కల కూలీలను ప్రత్యేక వాహనంలో ఇళ్ల వద్ద వదిలేసి వచ్చేవారు. కానీ శ్రీనివాసులు వాహనంలో పోలేదు. ఏమైందో కానీ ఉదయం గోళ్లవారిపల్లె సమీపంలోని పొలాల్లో శవమై కనిపించాడు. అటువైపు వెళ్లే ప్రయాణికులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం చేరవేశారు. మదనపల్లి డీఎస్పీ రవిమనోహరచారి, సీఐ శివాంజనేయులు, ఎస్ఐ డీవై స్వామి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తలపై రాయితో మోదడంతో ప్రాణాలు కోల్పోయి నుజ్జునుజ్జుగా మారి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మార్కెట్లో తనతో పాటు పని చేసే వేణుగోపాల్, శంకరపైన అనుమానం ఉన్నట్లు తల్లి సాలెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యతో టెన్షన్ వాతావరణం
-
తుమ్మల అనుచరుడి దారుణ హత్య
సాక్షి ప్రతినిధి, ఖమ్మం /ఖమ్మం రూరల్: వజ్రోత్సవ స్వాతంత్య్ర సంబురాల వేళ ఖమ్మం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య (60)ను దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. తల, చేతులపై తల్వార్లతో దాడి చేయడంతో తల ఛిద్రం కాగా రెండు చేతులు తెగిపడ్డాయి. తెల్దారుపల్లి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం కాగా.. రాజకీయ కక్షతో వీరభద్రం, ఆయన సోదరులే ఈ హత్య చేయించారని కృష్ణయ్య కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. తన తండ్రి హత్యకు తమ్మినేని కోటేశ్వరరావు, మరో ఆరుగురు కారకులని పేర్కొంటూ కృష్ణయ్య కుమారుడు నవీన్ ఖమ్మం రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ హత్యోదంతంతో కోపోద్రిక్తులైన కృష్ణయ్య బంధువులు, కుటుంబీకులు, అనుచరులు..వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు, అనుమానితుల ఇళ్లపై దాడి చేసి ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి దాడి కృష్ణయ్యకు భార్య (ఎంపీటీసీ) మంగతాయారుతో పాటు కుమార్తె రజిత, కుమారుడు నవీన్ ఉన్నారు. కుమారుడు గ్రానైట్ వ్యాపారం చేస్తుండగా, కృష్ణయ్య ఇటీవల వరకు సీపీఎంలోనే కొనసాగారు. కోటేశ్వరరావుతో విభేదాలు రావడంతో సీపీఎంను వీడి టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి తుమ్మల అనుచరుడిగా, టేకులపల్లి ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సమితి సభ్యుడిగా కొనసాగుతున్నారు. సోమవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, పొన్నెకల్‌లోని రైతువేదికలో జాతీయ జెండా ఎగురవేసి, మండలంలోని గుర్రాలపాడులో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఉదయం 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. వాహనాన్ని తెల్దారుపల్లికే చెందిన ముత్తేశం నడుపుతుండగా కృష్ణయ్య వెనుకాల కూర్చున్నారు. గ్రామం సమీపిస్తుండగా వెనుక నుండి ఆటోలో వచ్చిన దుండగులు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. కృష్ణయ్య రోడ్డు పక్కనే ఉన్న చిన్న కాల్వలో పడిపోగానే తల్వార్లతో తలను, చేతులను ఇష్టారాజ్యంగా నరికారు. దీంతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. దుండగులు ఆటోలో తెల్దారుపల్లి గ్రామంలోకి వెళ్లారు. గ్రామస్తులే చంపారన్న ప్రత్యక్ష సాక్షి భయంతో అక్కడినుంచి వెళ్లిపోయిన ప్రత్యక్ష సాక్షి ముత్తేశం కాసేపటికి ఘటనాస్థలానికి వచ్చాడు. అక్కడే మీడియా, పోలీసులతో వేర్వేరుగా మాట్లాడాడు. గ్రామానికే చెందిన బోడపట్ల శ్రీను (తండ్రి చిన్న ఎల్లయ్య), గజ్జి కృష్ణస్వామి, నూకల లింగయ్య, బండ నాగేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు దాడికి పాల్పడినట్లు చెప్పాడు. డాగ్‌స్క్వాడ్‌తో వచ్చిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టగా జాగిలం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు ఇంటి వద్ద ఆగింది. దీంతో కృష్ణయ్య అనుచరులు, కుటుంబీకులు, బంధువులు ఒక్కసారిగా ఇంటిపై దాడి చేసి సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే కోటేశ్వరరావు, కుటుంబ సభ్యులు అప్పటికే ఇంటి నుండి వెళ్లిపోయారు. గ్రామంలో సీపీఎం దిమ్మెలను ధ్వంసం చేయడంతో పాటు వీరభద్రం ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను కృష్ణయ్య అనుచరులు చించేశారు. గ్రామంలో 144 సెక్షన్ కృష్ణయ్య హత్య జరిగిన 20 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా 144 సెక్షన్ విధించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తుమ్మల గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విలేకరులతో మాట్లాడారు. కృష్ణయ్య హత్య దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు అభివృద్ధికి అవరోధం కల్పిస్తాయని పేర్కొన్నారు. నిందితులెంతటి వారైనా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తమ్మినేని వీరభద్రమే హత్య చేయించారు.. గ్రామంలో సీపీఎంకు ఆదరణ తగ్గడం, కృష్ణయ్యకు మంచి పేరు వస్తుండటంతో తట్టుకోలేక తమ్మినేని వీరభద్రమే తన భర్త కృష్ణయ్యను హత్య చేయించినట్లు మంగతాయారు విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. తన తండ్రి హత్యకు వీరభద్రం, ఆయన సోదరుడు కోటేశ్వరరావే కారణమని, అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నంచడంతో హత్యకు పాల్పడ్డారని కృష్ణయ్య కుమార్తె రజిత ఆరోపించారు. -
ఒకేసారి ఇద్దరితో వివాహిత వివాహేతర సంబంధం.. ఐటీ ఉద్యోగి దారుణహత్య
తోట్లవల్లూరు (కృష్ణా జిల్లా) : వివాహేతర సంబంధం కారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైన ఘటన తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు శివారు ఆళ్లవారిపాలెంలో జరిగింది. చిమ్మచీకట్లో తెల్లవారుజామున జరిగిన ఈ ఘాతుకంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో యాకమూరుకు చెందిన గాడికొయ్య శ్రీనివాసరెడ్డి(38) దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. యాకమూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి భద్రిరాజుపాలెంకు చెందిన ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి స్నేహితులు. ఇరువురూ బాగా చనువుగా ఉండటంతో పాటు ఒకరింటికి ఒకరు పరస్పరం వచ్చి వెళుతుంటారు. వర్క్ ఫ్రం హోంలో భాగంగా శ్రీనివాసరెడ్డి యాకమూరులోని ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రీకాంత్‌రెడ్డి గ్రామంలోనే వ్యవసాయం చేస్తుంటాడు. చాగంటిపాడు శివారు ఆళ్లవారిపాలెంకు చెందిన ఆళ్ల మిధున అలియాస్ జ్యోతితో గత కొన్నేళ్లుగా శ్రీకాంత్‌రెడ్డి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. జ్యోతి భర్త అమాయకంగా ఉంటాడు. దానిని ఆసరాగా తీసుకుని ఆమె శ్రీకాంత్‌రెడ్డితోనే కాకుండా కొంతకాలంగా శ్రీనివాసరెడ్డితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి యాకమూరులోని ఇంటి నుంచి ల్యాప్‌టాప్ తీసుకుని పునాదిపాడు స్నేహితుల ఇంటికి వెళుతున్నానని చెప్పి బయటకు వచ్చిన శ్రీనివాసరెడ్డి ఆళ్లవారిపాలెంలోని మిధున ఇంటి వరండాలో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన ప్రదేశంలో గొడ్డలి, కత్తి లభ్యమయ్యాయి. రక్తపుమడుగులో పడి ఉన్న శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని చూసి గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న గుడివాడ డీఎస్పీ సత్యానందం, పమిడిముక్కల సీఐ ముక్తేశ్వరరావు, ఎస్ఐ అర్జున్ ఘటనా ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. హత్యకు కారకులుగా భావిస్తున్న ఆళ్ల శ్రీకాంతరెడ్డి, ఆళ్ల మిధున, ఆమె పదినెలల పాపతో కలిసి పరారయ్యారు. డాగ్‌స్కా్వడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి పోలీసులు వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ఎస్ఐ అర్జున్ తెలియజేశారు. -
పిల్లల ముందే తల్లి పై అఘాయిత్యం... గొంతు కోసి, బాయిల్ చేసి...
మహిళల పై జరుగుతున్న ఘోరాలకు అంతేలేదు. పిల్లల తల్లి అని కనికరం కూడా లేకుండా పోతోంది. అదీ కూడా స్వయంగా భర్తలే భార్యలపై దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడుతుండటం బాధకరం. కలిసి ఉండటం ఇష్టం లేనప్పుడు ఆమెను తన మానన తనని బతకనవ్వకుండా హతమార్చి ఇరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో వారికి పుట్టిన పిలలు అనాథలుగా మారిపోతున్నారు. ఇక్కడొక వ్యక్తి అచ్చం అలాంటి దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం పాకిస్తాన్లో సింథ్ ప్రావిన్స్‌కి చెందిన ఆషిక్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతను తన ఆరుగురి పిల్లల ముందే తన భార్య గొతుకోసి.. ఒక పెద్ద పాత్రలో వేసి బాయిల్ చేసి చంపాడు. ఈ దారుణ ఘటన తర్వాత ఆశిష్ తన ముగ్గురు పిల్లలను తీసుకుని పారిపోయాడు. ఐతే బాధితురాలి 15 ఏళ్ల కుమార్తె పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఘటన పోలీసులను సైతం కదిలించింది. ఈ మేరకు గుల్షన్-ఎ-ఇక్బాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్లోని వంటగదిలో బాధితురాలు నర్గీస్ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. విచారణలో ఆశిష్ తన భార్యను బాయిల్ చేయడానికి ముందే గొతు కొసి చంపినట్లు తేలిందని చెప్పారు. అతను తన భార్యను అక్రమ సంబంధాలు పెట్టుకోమని బలవంతం చేశాడని, ఆమె అందుకు నిరాకరించడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు ఊహాగానాలు వెలువెత్తాయి. కానీ కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మిగిలిన ముగ్గురు పిల్లలు సంరక్షణ బాధ్యతలను పోలీసులు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: టులెట్ బోర్డు.. ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండడంతో..) -
ఉద్యోగ విరమణ రోజే దారుణ హత్య
మైసూరు: ఉద్యోగ విరమణ పొందిన రోజే వర్సిటీ ఉద్యోగి హత్యకు గురయ్యాడు ఈ ఘటన మైసూరు నగరంలోని విద్యారణ్యపురలోని బూతాల్ మైదానంలో చోటు చేసుకుంది. మైసూరు వి.విలో ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కృష్ణేగౌడ(60) గురువారం ఉద్యోగ విరమణ చెందాడు. సాయంత్రం బూతాల్ మైదానంలో వాకింగ్‌కు వెళ్లిన సమయంలో దుండగులు గొంతుకోసి ఉడాయించారు. పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది. బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య యశవంతపుర: మూడున్నరేళ్ల చిన్నారికి ఉరి వేసిన తల్లి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆర్‌ఆర్‌నగర పరిధిలోని మంత్రి అల్టియాన్ అపార్ట్మెంట్లో దీపా, ఆదర్శ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వారం రోజులుగా జ్వరం, కడుపునొప్పితో బాధ పడుతున్న దీపా తన కుమార్తె రియాను పడక గదిలో ఫ్యాన్‌కు ఉరివేసింది. అనంతరం ఆమె కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. గదిలో ఒక సూసైడ్ నోట్ లభించింది. తన మృతికి ఎవరూ కారణం కాదని దీపా రాసినట్లు ఉందని పోలీసులు తెలిపారు. (చదవండి: రెండో భర్త ఫిర్యాదు.. మూడో భర్తతో కలిసి..) -
ముక్కలు చేసి... మూటకట్టి!
నారాయణపేట రూరల్: గుర్తు తెలియని ఓ మహిళను అతి దారుణంగా హత్య చేసి.. తల, శరీర భాగాలను వేరు చేసి పారవేసిన ఘటన నారాయణపేట జిల్లాలో సంచలనం సృష్టించింది. నారాయణపేట పట్టణ సమీపంలోని శ్యాసన్‌పల్లి రోడ్డు మార్గంలో రోజు మాదిరి సోమవారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరికి పెద్దఎత్తున దుర్వాసన వచ్చింది. అనుమానంతో రోడ్డు దిగువన పొలంగట్ల వైపు వెళ్లి చూడగా.. ఓ మూటకట్టిన సంచిలో చిన్నపాటి మాంసం ముద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సమాచా రం ఇవ్వడంతో సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్ఐ సురేష్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తల, కాళ్లు, చేతులు లేకుండా మొండెం మాత్రమే ఉండి, చుట్టూ కొన్ని మహిళకు సంబంధించిన దుస్తులు లభించాయి. ఇప్పటికే అన్ని పోలీస్స్టేషన్లలో మిస్సింగ్ కేసులతోపాటు ఇతర జిల్లాలు, పొరుగున ఉన్న కర్ణాటక పోలీసులకు సైతం సమాచారం అందించారు. ఇటీ వల శ్యాసన్‌పల్లిలో జాతర జరిగిందని, ఆ సమయంలో ఏమైనా గొడవ జరిగిందా.. అక్రమ సం బంధం కారణమా లేదా ఆస్తి వివాదాలతో ఇలా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
దుస్తులు సరిగా కుట్టలేదని హత్య
సాక్షి, విశాఖపట్నం, పీఎంపాలెం (భీమిలి): కొత్త దుస్తులు సరిగా కుట్టలేదని ఆగ్రహించిన ఇద్దరు వ్యక్తులు ఓ టైలర్‌పై దాడి చేయగా మృతి చెందిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. పీఎం పాలెం పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన బుడు లిమా భార్య లక్ష్మి, కుమార్తె సుమంత, కొడుకు సుమన్‌తో మారికవలసలోని రాజీవ్ గృహకల్ప జీఎఫ్–1 బ్లాక్ నంబర్ 104లో నివసిస్తున్నాడు. ఇంటివద్దనే లిమా టైలరింగ్ చేస్తుంటాడు. మిగతా కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళుతుంటారు. ఇదిలా ఉండగా కాలనీకి చెందిన గణేష్ లిమా వద్ద కొత్త దుస్తులు కుట్టించుకున్నాడు. కొలతలు ప్రకారం సరిగా కుట్టకపోవడంతో సరిచేసి ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే అనుకున్న సమయానికి దుస్తులు సరిచేసి ఇవ్వకపోవడంతో టైలర్‌ను గట్టిగా ప్రశ్నించాడు. ఆ సమయంలో టైలర్ కుమార్తె, అల్లుడు సుశాంత్ ఇంట్లోనే ఉండడంతో గణేష్ వెళ్లిపోయాడు. అయితే గణేష్ తన మిత్రులు క్లింటన్, సూర్యనారాయణ మరికొందరిని వెంట తీసుకుని తిరిగొచ్చాడు. టైలర్ లిమాను విచక్షణారహితంగా గుండెలపై పిడిగుద్దులు గుద్దడంతో స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు 108 వైద్య సిబ్బంది తెలిపారు. చదవండి: (కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి..!) -
హైదరాబాద్‌లో దారుణం.. భార్య తలనరికి పోలీస్ స్టేషన్‌కు..
కట్టుకున్న వాళ్లే ఆ మహిళల పాలిట కాలయముళ్లయ్యారు. కాపాడాల్సిన వారే కర్కశత్వంతో ప్రాణాలు తీశారు. అనుమానం పెనుభూతమై ఓ రాక్షసుడు కట్టుకున్న భార్యను దారుణంగా తలనరికి హత్య చేశాడు. ఆ తర్వాత ఆ తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. మరో ఘటనలో గొంతు నులిమి భార్యను హత్య చేసిన దుర్మార్గుడు శవాన్ని ఇంట్లోనే ఉంచేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా నిలుస్తున్న ఈ ఘటనలు నగరంలోని అత్తాపూర్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం వెలుగు చూశాయి. సాక్షి, రంగారెడ్డి: అనుమానం పెనుభూతమైంది. పెళ్లై 14 సంవత్సరాలైనా భార్యపై నమ్మకం కుదరలేదు. నిత్యం వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశాడు. కేసు పెడితే..శిక్ష అనుభవించి వచ్చి పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నాడు. చివరకు ఆమెను దారుణంగా కడతేర్చాడు. తల నరికి ప్లాస్టిక్ సంచిలో వేసుకొని ముగ్గురు పిల్లలతో సహా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. గగుర్పాటు కలిగిస్తున్న ఈ ఘటన అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన షమ్రీన్ అలియాస్ సమ్రీన్‌కు, ఎంఎం పహాడీ హిమ్మత్‌నగర్‌కు చెందిన మహ్మద్ పర్వేజ్‌తో 14 ఏళ్ల కిందట పెళ్లయింది. వీరికి ముగ్గురు పిల్లలు. పెట్రోల్‌బంక్‌లో పని చేసే మహ్మద్ పర్వేజ్ పెళ్లినాటి నుంచే భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. నాలుగేళ్ల కిందట వేధింపులు అధికం కావడంతో సమ్రీన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని జైలుకు పంపించారు. జైలు నుంచి వచ్చిన పర్వేజ్ పెద్దల సమక్షంలో రాజీ కోసం భార్య కుటుంబ సభ్యుల వద్దకు వచ్చాడు. ముగ్గురు పిల్లలు ఉండడంతో ఆమె తిరిగి కలిసి ఉండేందుకు ఒప్పుకుంది. కొన్ని రోజుల పాటు సాఫీగానే సాగింది. మళ్లీ ఆరు నెలలుగా పర్వేజ్ ప్రతి విషయంలో సమ్రీన్ను అనుమానిస్తూ పలురకాలుగా వేధిస్తున్నాడు. మద్యానికి బానిసై...భార్యను కొడుతూ శారీరకంగా హింసిస్తున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు 15 రోజుల కిందటే సర్ది చెప్పారు. మాంసం కోసే కత్తితో... గురువారం రాత్రి మద్యం సేవించి వచ్చిన పర్వేజ్ భార్యను చితకబాదాడు. అనంతరం భోజనం చేసి నిద్రపోయాడు. అర్థరాత్రి లేచి ఇంట్లో మాంసం కోసే కత్తితో భార్యపై దాడి చేశాడు. మొండెం నుంచి తలను వేరు చేసి ప్లాస్టిక్ కవర్లో వేసుకున్నాడు. ముగ్గురు పిల్లలను తీసుకుని రక్తపు దుస్తులతోనే అర్థరాత్రి వేళ రెండు కిలోమీటర్లు నడిచి అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. భార్య తలను తీసి టేబుల్‌పై పెట్టి..తానే హత్య చేశానని చెప్పాడు. ఒక్కసారిగా రక్తమోడుతున్న తలను చూసిన నైట్ డ్యూటీ కానిస్టేబుల్ భయాందోళనకు గురయ్యాడు. ఇన్స్పెక్టర్తో పాటు రాజేంద్రనగర్ ఏసీపీకి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. గది మొత్తం రక్తపు మరకలే... పర్వేజ్ భార్యపై కత్తితో దాడి చేసిన సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. కత్తితో దాడి చేయడంతో గది మొత్తం రక్తం చిల్లింది. అతి కిరాతకంగా మొండెం, తలను వేరు చేశాడు. పక్కనే నిద్రిస్తున్న పిల్లలు ఈ సంఘటనతో భయకంపితులై ఏమి మాట్లాడలేని స్థితిలో తండ్రితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. తాత, అమ్మమ్మ వచ్చిన అనంతరం జరిగిన విషయాన్ని వారికి తెలిపినట్లు సమాచారం. కఠినంగా శిక్షించాలి... తమ సోదరిని కిరాతకంగా హత్య చేసిన మహ్మద్ పర్వేజ్‌ను కఠినంగా శిక్షించాలని సమ్రీన్ సోదరుడు కోరారు. జైలుకు వెళ్లి వచ్చాక మంచిగా ఉంటానని చెప్పాడని, ఇంత దారుణానికి పాల్పడతాడని అనుకోలేదని ఆయన కన్నీరుమున్నీరయ్యాడు. చదవండి: (భార్యపై అనుమానం.. గూడ్స్ షెడ్లో దారుణహత్య) -
వివాహేతర సంబంధం.. భార్యను పలుమార్లు హెచ్చరించాడు.. చివరకు
సాక్షి, షాద్‌నగర్ రూరల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడా.. లేక మరేదైనా ఘటన హత్యకు దాసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాద్‌నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో గురువారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు.. కర్నూలుకు చెందిన నాగరాజు(40) కొంతకాలంగా పట్టణంలో రోడ్ల పక్కన చిత్తు కాగితాలు సేకరిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు పట్టణంలో నివాసం ఉంటున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. సదరు మహిళ భర్తతో కలిసి పటేల్ రోడ్డులోని అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు అతడు భార్యకు సూచించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నాగరాజును ఎలాగైనా పక్కకు తప్పించాలని మహిళ భర్త పథకం పన్నాడు. అందులో భాగంగానే హత్య చేసినట్లు తెలుస్తోంది. తన భార్య కోసం ఇంటికి వచ్చిన నాగరాజును అతడు కొట్టి చంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నాగరాజు మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. -
హత్య చేసి శవంతో పోలీస్ స్టేషన్‌కు..
సాక్షి, యశవంతపుర: సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వ్యక్తిని హత్య చేసి శవాన్ని తీసుకొచ్చి లొంగిపోయిన ఘటన బెంగళూరు అన్నపూర్ణేశ్వరినగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. కోలారు జిల్లా మాలూరుకు చెందిన మహిళ ఒక గార్మెంట్స్‌లో పని చేస్తూ అన్నపూర్ణేశ్వరినగర చంద్రశేఖర్ లేఔట్లో నివాసముంటోంది. ఆమె భర్త మాలూరులోనే ఉండేవాడు. ఈ సమయంలో తమిళనాడుకు చెందిన భాస్కర్ అనే వ్యక్తితో ఆమెకు రెండేళ్ల కిందట పరిచయమై అక్రమ సంబంధం ఏర్పడింది. చదవండి: (బుల్లితెర నటి ఉమామహేశ్వరి కన్నుమూత) దసరా రోజున ఆమె భర్త వద్దకు మాలూరు వెళ్లగా, అక్రమ సంబంధంపై గొడవ జరిగింది. ఇక బెంగళూరుకు వెళ్లవద్దని భర్త హెచ్చరించాడు. అయితే ఆమె చిన్న కొడుకును తీసుకొని బెంగళూరుకు వచ్చేసింది. శనివారం సాయంత్రం ఆమెను ప్రియుడు భాస్కర్ కలిశాడు. ఈ విషయాన్ని ఆమె కొడుకు మేనమామ మునిరాజుకు ఫోన్లో చెప్పాడు. మహిళ, ప్రియుడు ఆటోలో వెళ్తుండగా మునిరాజు, అతని మిత్రులు మారుతీ, నాగేశ్, ప్రశాంత్‌లు అడ్డుకుని మహిళను పంపించివేశారు. భాస్కర్‌ను తీవ్రంగా కొట్టడంతో చనిపోయాడు. అదే ఆటోలో మృతదేహాన్ని తీసుకుని అన్నపూర్ణేశ్వరినగర పీఎస్‌లో లొంగిపోయారు. నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ సంజీవ్ పాటిల్ తెలిపారు. చదవండి: (ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే భార్యను..) -
‘చాంపియన్’ విషాదం
భారత బ్యాడ్మింటన్ స్టార్ సయ్యద్ మోదీ ఎప్పటిలాగే ఆ రోజు సాయంత్రం కూడా ప్రాక్టీస్ ముగించుకొని లక్నోలోని కేడీ సింగ్ బాబు స్టేడియం నుంచి బయటకు వచ్చాడు. 26 ఏళ్ల వయసులో తన కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్న అతను మరిన్ని విజయాలు సాధించాలని పట్టుదలగా సాధన చేస్తున్నాడు. అయితే అతనికి తెలీదు... మరికొన్ని క్షణాల్లో తన ఆటే కాదు జీవితం కూడా ముగిసిపోతుందని! అనూహ్యంగా కారులోంచి దిగి దూసుకొచ్చిన నలుగురు వ్యక్తులు తుపాకులతో సయ్యద్ మోదీపై విరుచుకుపడటంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. ఒక అద్భుత క్రీడాకారుడి జీవితం ఇలా విషాదాంతం కాగా... తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ హత్య వెనుక ఉన్నట్లు ఆరోపణలు రావడం మరో వైచిత్రి. 28 జూలై, 1988... సయ్యద్ మోదీ హత్య జరిగిన రోజు. తిరుగులేని ఆటతో అతను అప్పటికే వరుసగా ఎనిమిదిసార్లు (1980–1987) జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచాడు. 1982 బ్రిస్బేన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, అదే ఏడాది ఢిల్లీ ఆసియా క్రీడల్లో కాంస్యం అతని ఖాతాలో ఉన్నాయి. ఆ సమయంలో ఎంతో గుర్తింపు ఉన్న ఆస్ట్రియన్ ఇంటర్నేషనల్, యూఎస్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ టైటిల్స్ కూడా మోదీ గెలుచుకున్నాడు. 1981లో ‘అర్జున అవార్డు’ కూడా దక్కింది. 14 ఏళ్ల వయసులో జాతీయ జూనియర్ చాంపియన్‌గా మారినప్పటి నుంచి చనిపోయే వరకు మోదీ షటిల్ ప్రస్థానం అద్భుతంగా సాగింది. ప్రకాశ్ పదుకొనే తర్వాత భారత్ నుంచి వచ్చిన మరో స్టార్‌గా అతను పేరు ప్రఖ్యాతులు పొందాడు. 1962లో డిసెంబర్ 31న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో సయ్యద్ మోదీ జన్మించాడు. పేదరిక నేపథ్యం (తండ్రి చక్కెర మిల్లులో పని చేసేవాడు) నుంచి వచ్చి కేవలం తన ప్రతిభతో దూసుకుపోయి కుటుంబంలో సంతోషం పంచాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఆమె రాకతో... జూనియర్ స్థాయిలో ఆడేటప్పుడే సహచర షట్లర్ అమితా కులకర్ణితో మోదీకి పరిచయం ఏర్పడింది. కొన్నేళ్ల తర్వాత అది ప్రేమగా మారింది. మహారాష్ట్ర హిందూ అయిన అమితా పెద్ద చదువులు చదివిన ఉన్నతస్థాయి కుటుంబం నుంచి వచ్చింది. ఇద్దరి నేపథ్యాలు పూర్తి భిన్నంగా ఉండటంతో సహజంగానే ఇరు కుటుంబాలు పెళ్లికి నిరాకరించాయి. దాంతో వీరిద్దరు పెద్దలను ఎదిరించి ముందడుగు వేసి 1984లో పెళ్లి చేసుకున్నారు. అయితే చాలా మంది భయపడినట్లుగానే పలు కారణాలతో వివాహం తర్వాత భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఒకే ప్రొఫెషన్‌కు చెందిన వారు కావడంతో అహం కూడా తోడైంది. ఆ ప్రభావం తనపై పడి మానసికంగా ఇబ్బంది పడ్డ మోదీ 1988లో జాతీయ చాంపియన్‌షిప్‌ను కోల్పోయాడు. చివరకు పాప ‘ఆకాంక్ష’ పుట్టిన కొద్ది రోజులకే చిన్న వయసులోనే అతని జీవితం ముగిసిపోయింది. మోదీ పేరు వెనక... సయ్యద్ మోదీ అసలు పేరు సయ్యద్ మెహదీ హసన్ జైదీ. స్కూల్ రికార్డుల్లో పేరు నమోదు చేస్తున్న సమయంలో మెహదీ పేరును ‘మోదీ’ అని తప్పుగా రాయడంతో అదే కొనసాగింది. అతను కూడా దానిని మార్చుకునే ప్రయత్నం చేయలేదు. మోదీ ఘనతలను గుర్తించే విధంగా భారత బ్యాడ్మింటన్ సంఘం సయ్యద్ మోదీ పేరుతో లక్నోలో ప్రతి ఏటా టోర్నీని నిర్వహిస్తోంది. మోదీ హత్యోదంతం నేపథ్యంతో 1991లో ప్రముఖ హిందీ నటుడు దేవానంద్ నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించి ‘సౌ కరోడ్’ పేరుతో సినిమాను నిర్మించారు. అతడే కారణమా? సయ్యద్ మోదీ మొత్తం వ్యవహారంలో ‘మూడో వ్యక్తి’ ప్రమేయంపైనే అందరి దృష్టీ పడింది. అతి సంపన్నుడైన రాజకీయ నేత, అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల మంత్రి సంజయ్ సింగ్‌తో అమితా స్నేహమే మోదీ ముగింపునకు కారణమైందని అంతటా వినిపించింది. భర్త వారిస్తున్నా సంజయ్‌తో ఆమె తన బంధాన్ని కొనసాగించింది. తన మాట వినకుండా బిడ్డకు హిందూ పేరు పెట్టడంతో మోదీ అనుమానం మరింత పెరిగింది. హత్య అనంతరం జరిగిన సీబీఐ విచారణలో వీటికి సంబంధించి పలు అంశాలు బయట పడ్డాయి. సంజయ్, అమితాలతో పాటు మరో ఐదుగురి పేర్లతో చార్జ్ షీట్ తయారైంది. అయితే వీరిద్దరు కలిసి హత్యకు కుట్ర పన్నారని మాత్రం ఎలాంటి సాక్ష్యాల ద్వారా కూడా నిరూపితం కాలేదు. నాటి ప్రధానులు రాజీవ్‌గాంధీకి, వీపీ సింగ్‌లకు ఆత్మీయ స్నేహితుడు, అమేథీకి చెందిన సంజయ్ సింగ్‌కు ఆ సాన్నిహిత్యం కూడా ఇలాంటి సమయంలో కలిసొచ్చిందని చెబుతారు. కేసు నుంచి తమ పేర్లు తప్పించిన కొద్ది రోజులకే 1995లో సంజయ్ తన మొదటి భార్య, మాజీ ప్రధాని వీపీ సింగ్ మేనకోడలు గరీమా సింగ్‌ను వదిలేసి అమితాను పెళ్లి చేసుకున్నాడు. చివరకు కాల్పులు జరిపిన వారిలో ఒకరికి మాత్రం జైలు శిక్ష విధించిన కోర్టు ‘హత్య వెనుక కారణం ఏమిటో తేల్చలేకపోయారు’ అంటూ ఈ కేసును 2009లో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సయ్యద్ మోదీ జీవిత క్రమాన్ని చూస్తూ వచ్చిన సన్నిహితులు, అభిమానుల దృష్టిలో అతని చావుకు అమితా, సంజయ్‌లే కారణమని నమ్మినా... అధికారికంగా అది రుజువు కాలేదు. తర్వాతి కాలంలో సంజయ్ సింగ్ వివిధ పార్టీలు మారుతూ లోక్‌సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మరోవైపు అమితా అమేథీ నియోజకవర్గం నుంచి 2002లో బీజేపీ తరఫున... 2007లో కాంగ్రెస్ తరఫున శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. కానీ ఒక గొప్ప ఆటగాడు, మంచి వ్యక్తి జీవితం మాత్రం ఇంత విషాదంగా ముగిసిపోవడం అందరినీ కలచి వేసింది. -
గొంతు కోసి.. ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థినిని గుర్తుతెలియని ఆగంతకుడు గొంతుకోసి హతమార్చాడు. గతంలో స్నేహంగా మెలిగిన యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కరీంనగర్‌లోని విద్యానగర్ పద్మావతి ఫంక్షన్ హాల్ వెనుక భాగంలో నివసించే ముత్త కొమురయ్య–ఓదెమ్మ దంపతులకు కూతురు రాధిక(19), కుమారుడు వేణు ఉన్నారు. వేణు హైదరాబాద్‌లో ఎంసీఏ చదువుతుండగా, రాధిక కరీంనగర్‌లోని సహస్ర జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఓదెమ్మ భవన నిర్మాణ కూలీగా, కొమురయ్య గోడౌన్లో కూలీగా పనిచేస్తున్నారు. రోజు లాగే తల్లిదండ్రులు ఇద్దరు సోమవారం ఉదయం కూలీ పనులకు వెళ్లగా.. ఇంట్లో రాధిక చదువుకుంటోంది. ఈ సమయంలో ఆగంతకుడు ఇంటికి వచ్చి కూరగాయల కత్తితోనే విద్యార్థిని గొంతుకోసి పరారయ్యాడు. బాలుడు చూసి చెప్పడంతో.. వీరి ఇంటి ముందు నివసించే ఓ తొమ్మిదేళ్ల బాలుడు మనోజ్ సోమవారం సాయంత్రం 5 గంటల సమ యంలో ఆడుకొనేందుకు రాధిక ఇంటికి రాగా, ఆమె అప్పటికే రక్తపు మడుగులో పడిఉంది. భయపడిన మనోజ్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూశారు. అప్పటికే రాధిక మృతి చెందడంతో పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ‘పోలియో బారిన పడ్డ కూతురికి లక్షల రూపాయలతో చికిత్స చేయించి ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాం. నా బిడ్డను ఎవడు ఎందుకు చంపాడో తెలియదు’అని రాధిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలిసిన వెంటనే అదనపు డీసీపీలు శ్రీనివాస్, చంద్రమోహన్ సంఘటనా స్థలానికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. రాధికను హతమార్చిన ఆగంతకుడు ఆధారాలు లేకుండా రక్తపు మరకలను తుడిచివేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు రాధిక నివాసంలో తనిఖీలు చేశారు. పోలీసు జాగిలాలు కి.మీ. దూరం వరకు వెళ్లి ఆగిపోయాయి. 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేస్తామని పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. తెలిసినవారి పనే! రాధిక ఇంట్లో రెండేళ్ల కింద ఓ యువకుడు అద్దెకు ఉండేవాడు. అతడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటి చుట్టూ కాంపౌండ్ గోడ ఉండటం, కొత్త వారు ఇంట్లోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో తెలిసినవారే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పాత పరిచయంతోనే.. ఆ యువకుడు తన కూతురితో స్నేహంగా ఉండటం నచ్చకపోవడంతో రాధిక తల్లిదండ్రులు అతడిని ఇల్లు ఖాళీ చేయించారు. పాత పరిచయంతో ఆ యువకుడు తరచూ రాధికతో తరచూ ఫోన్లో మాట్లాడేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పాత పరిచయంతోనే సోమవారం ఆ యువకుడే ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వచ్చి హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు. రాధిక కాల్‌డేటా, చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు ఆ యువకుడే హత్య చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరింత స్పష్టత కోసం సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. పైగా, ఇది తెలిసిన వారి పనేనని కరీంనగర్ పోలీస్ కమిషనర్ బీవీ.కమలాసన్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. నిందితుడిని పట్టుకునేందుకు ఎనిమిది బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరామర్శించిన మంత్రి గంగుల రాధిక హత్య విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డీసీపీలు చంద్రమోహన్, శ్రీనివాస్‌ను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. రాధిక కుటుంబానికి రూ.25 వేలు తక్షణ సాయంగా అందజేశారు. -
శీలాన్ని శంకించి.. ఆపై అంతమొందించి!
సాక్షి, ఒంగోలు: భార్య శీలాన్ని శంకించిన భర్త..నమ్మకంగా ఆమెను దారుణంగా హత్య చేశాడని ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం తన చాంబర్లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. డీఎస్పీ కథనం ప్రకారం.. మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు నుంచి పెద్ద కొత్తపల్లి వెళ్లే మార్గంలో సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడకు వెళ్లి విచారణ చేపట్టారు. తొలుత మహిళ ముఖం ఉన్న రక్త మరకలు తుడిచి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్ ఆమెను గుర్తించగలగడంతో దర్యాప్తు వేగవంతంగా కొలిక్కి వచ్చింది. చదవండి: అవ్వ చనిపోయిందంటూ నమ్మించి వివాహితపై లైంగికదాడి మృతురాలు కరువదికి చెందిన బత్తుల సుమలతగా గుర్తించారు. ఆమెకు అన్న, తమ్ముడు ఉన్నాడు. ఆమెకు త్రోవగుంటకు చెందిన పిచ్చయ్య (వాసు)తో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. చెడు అలవాట్లకు బానిసైన పిచ్చయ్య తొలుత ఐటీసీ కంపెనీకి లారీ డ్రైవర్‌గా వెళ్లేవాడు. ఇటీవల బావమరిది ఆటో కొనివ్వడంతో దాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తన సెల్‌ఫోన్ చెడిపోయిందంటూ భార్య ఫోను తీసుకుని వినియోగిస్తున్నాడు. సెల్లో వాయిస్ రికార్డులు విని తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని నమ్మాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి చేరింది. భర్త సైతం ఆమె వద్దకే వెళ్లి ఉంటున్నాడు. దుస్తులు కొనుక్కుందామంటూ నమ్మకంగా ఆటోలో ఆమెను తీసుకుని ఒంగోలు వెళ్లాడు. అక్కడ దుస్తులు కొనుగోలు చేశారు. అనంతరం పెద్ద కొత్తపల్లిలో డబ్బులు రావాలంటూ భార్యను తీసుకెళ్లి ఆ మార్గంలో ఎవరూ లేరని నిర్థారించుకుని తన వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాల కత్తితో నరికేశాడు. భార్యను హత్య చేసిన పిచ్చయ్య అనంతరం వీఆర్వో వద్ద లొంగిపోయాడు. నిందితుడి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన వీఆర్వో అనంతరం ఆయన్ను పోలీసులకు అప్పగించాడు. కేవలం అనుమానంతోనే పిచ్చయ్య తన భార్యను కడతేర్చాడని డీఎస్పీ స్పష్టం చేశారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన ఒంగోలు రూరల్ సీఐ సుబ్బారావు, మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు ఎస్ఐలను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అభినందించినట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. -
బాలిక దారుణ హత్య: తండ్రిపైనే అనుమానం!
సాక్షి, మేడ్చల్: నిన్న జరిగిన మేడ్చల్ బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలిక కన్న తండ్రే దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. పోలీసులకు అతను పొంతనలేని సమాధానాలు చెపుతుండడంతో అతని తీరుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన బాలిక నిందితుడి మొదటి భార్య కూతురిగా పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితం తుఫ్రాన్‌పేట్ నుంచి కుటుంబంతో మేడ్చల్‌కు వారి కుంటుంబం వలస వచ్చినట్లు తెలిసింది. కాగా మేడ్చల్‌లోని ఓ బస్తీ సమీపంలో శనివారం గోనెసంచిలో 14 ఏళ్ల ఓ బాలిక మృతదేహం లభించడం కలకలం రేపిన విషయం తెలిసిందే.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక గొంతుకోసి, ఆనవాళ్లు గుర్తించకుండా కనుగుడ్లు పీకి, మొహంచెక్కి అత్యంత కిరాతకంగా హతమార్చారు. అనంతరం గోనెసంచిలో కుక్కి.. సమీపంలోని చెత్తకుండిలో పడేశారు. బాలికను ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? లేక ఆమె స్థానికురాలేనా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే బాలిక తండ్రిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు దానికి అనుగుణంగా విచారణ చేస్తున్నారు. -
కనుగుడ్లు పీకి, మొహంచెక్కి బాలిక దారుణ హత్య
సాక్షి, మేడ్చల్: మేడ్చల్‌లోని ఓ బస్తీలో దారుణం చోటుచేసుకుంది. బస్తీ సమీపంలో గోనెసంచిలో 14 ఏళ్ల ఓ బాలిక మృతదేహం లభించడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక గొంతుకోసి, ఆనవాళ్లు గుర్తించకుండా కనుగుడ్లు పీకి, మొహంచెక్కి అత్యంత కిరాతకంగా హతమార్చారు. అనంతరం గోనెసంచిలో కుక్కి.. సమీపంలోని చెత్తకుండిలో పడేశారు. స్థానికుల సమాచారం మేరకు మేడ్చల్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గోనెసంచిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మొహంపై యాసిడ్ పోసినట్లు కూడా పోలీసులు తెలిపారు. బాలికను ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? లేక ఆమె స్థానికురాలేనా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మేకల కాపరి దారుణహత్య
సాక్షి, తుగ్గలి(కర్నూలు) : మేకల కాపరిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసి, మేకలను ఎత్తుకెళ్లిన ఘటన తుగ్గలి మండలం బోడబండ పుణ్యక్షేత్రం సమీపంలో శుక్రవారం వెలుగుచూసింది. మృతుడి సోదరుడు స్వామినాయక్ తెలిపిన వివరాలు.. సూర్యతండాకు చెందిన రమావత్ రామునాయక్(50) వ్యవసాయంతో పాటు మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే తనకున్న 25 మేకలను మేపేందుకు గురువారం అడవులకు వెళ్లాడు. మధ్యాహ్నం కుంట వద్ద భార్య దేవమ్మ తెచ్చిన భోజనాన్ని తిని, తిరిగి మేకలను తోలుకుని వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో భార్య, కుమారులు, తండా వాసులు బోడబండ పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ కనపడలేదు. చీకటి కావడంతో చేసేదేమీ లేదక రాత్రి జొన్నగిరి పోలీసులకు సమాచారమిచ్చారు. శుక్రవారం తెల్లవారు జామునే మళ్లీ వెతికేందుకు వెళ్లిన తండావాసులకు ఓ గుట్టలో రాళ్ల మధ్య తలపై తీవ్రగాయాలతో విగత జీవిగా పడిఉన్న రామునాయక్ మృతదేహం కంట పడింది. మేకలు పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించక పోవడంతో దొంగల పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి చేరే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కట్టెతో తలపై కొట్టి చంపి మేకలు ఎత్తుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. రూ.2 లక్షలు కూడా చేయని వాటి కోసం ఇంతటి దారుణానికి ఎలా ఒడిగట్టారని కుటుంబ సభ్యులు, తండావాసులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్నిపరిశీలించిన డోన్ డీఎస్పీ.. మేకల కాపరి హత్య విషయం తెలుసుకున్న డోన్ డీఎస్పీ ఖాదర్‌బాషా, పత్తికొండ సీఐ సోమశేఖరరెడ్డి, జొన్నగిరి ఎస్ఐ విజయకుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మేకల కోసం దొంగలు ఈ దారుణానికి ఒడిగట్టారా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. ఇది రెండో ఘటన.. ఆరేళ్ల క్రితం మండలంలోని పి.కొత్తూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బోయ ఎనుముల పుల్లన్న కుమారుడు సురేంద్ర(12) దారుణ హత్యకు గురయ్యారు. సురేంద్ర పక్క గ్రామంలోని హుసేనాపురానికి గొర్రెల యజమాని వద్ద గొర్రెలు మేపేందుకు జీతం ఉన్నాడు.రోళ్లపాడు అటవీ ప్రాంతంలో కొండపై గొర్రెలు మేపుతుండగా దొంగలు కాపరి తలపై బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేసి గొర్రెలు ఎత్తుకెళ్లారు. మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
సాక్షి, మహబూబ్‌నగర్ : గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హతమార్చి.. గుర్తుపట్టడానికి రాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కనిమెట్ట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గురువారం స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కనిమెట్ట గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన గల ఓ బ్రిడ్జి కింద దాదాపు 35 సంవత్సరాల వయ స్సు గల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేశారు. అనంతరం ఆనవాళ్లు దొరకుండా ఉండేందుకు శవం పై, వస్తువులపై పెట్రోల్ పోసి నిప్పంటించా రు. అక్కడికి చేరుకున్న పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహం పక్కనే పడి ఉన్న టిఫిన్ బాక్సుపై నిందితుల వేలిముద్రలను సేకరించారు. అనంతరం డాగ్‌స్క్వాడ్‌తో పరిసర ప్రాంతాల్లో గాలించగా.. కొంతదూరం వెళ్లి అక్కడే ఆగిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఎస్పీ వెంట స్థానిక సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్ఐ రవికాంత్‌రావు, ట్రైనింగ్ ఎస్ఐ హరీష్, ఏఎస్ఐ రోశన్న హెడ్‌కానిస్టేబుల్ వేమారెడ్డి, కానిస్టేబుళ్లు మహేష్, వెంకట్‌రెడ్డి, యుగంధర్‌గౌడ్ తదితరులున్నారు.