మెదక్ : మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణం బృందావన్ కాలనీ సమీపంలోని నిర్జన ప్రదేశంలో యువకుడి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మృతుడు హైదరాబాద్ నగరంలోని మూసాపేట రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన రౌడీషీటర్ వాహేద్గా పోలీసులు గుర్తించారు. అతడి అనుచరుడు ఫిరోజ్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.