నల్లగొండ క్రైం జిల్లా కేంద్రంలో పేరుమోసిన రౌడీ షీటర్ యూసుఫ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గురువారం సంచలనం రేకెత్తించింది.సెంట్‌మెంట్లు, ఆదిపత్య పోరు నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. డీఎస్పీ రాములునాయక్, సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం..
అర్ధరాత్రి దాటిన తరువాత..
పలు కేసుల్లో నిందితుడైన యూసుఫ్ హైదరాబాద్‌లో కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. రెండు రోజుల క్రితమే జిల్లా కేంద్రానికి వచ్చాడు. బుధవారం రాత్రి తన అనుచరులతో కలిసి క్యాటరింగ్ నిర్వహణ కోసం బీటీఎస్‌లో మూడు గదులు తీసుకున్నాడు. అనుచరులతో కలిసి రాత్రి మద్యం సేవించారు. 12 -2 గంటల మధ్య కంట్లో కారం చల్లి వేటకొడవల్లతో దారుణంగా హతమార్చినట్టు భావిస్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన దాడిని అడ్డుకునేందుకు యూసుఫ్ ప్రయత్నించడంతో అతడి చెయ్యి తెగినట్టు తెలుస్తోంది. మెత్తను ముఖంపై పెట్టి, కాల్లు అదిమి పట్టి వేటకొడవలితో గొంతు కోసిన ఆనవాళ్లు ఉన్నాయి. తలపై బలంగా నరికినట్లు గాట్లు ఉన్నాయి. మూడు వేట కొడవల్లను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
సోదరుడికి ఫోన్ చేసి..
క్యాటరింగ్ నిర్వహణ గదిలోకి వచ్చిన యూసుఫ్ సోదరుడు వహీద్‌కు ఫోన్ చేసి అనుచరులతో వచ్చినట్టు చెప్పాడు. గురువారం ఉదయం వహీద్ క్యాటరింగ్ గది వద్దకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఉన్న యూసుఫ్ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్యోందంత వెలుగుచూసింది.
పలు కేసుల్లో నిందితుడు...
యూసుఫ్‌పై వివిధ పోలీస్‌స్టేషన్‌లో మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. ఇందులో నాలుగు హత్య కేసులు, 2 హత్యాయత్నం, చోరీ, దోపిడీ కేసులున్నాయి.2013 ఆగస్టు 26వ తేదీన జరిగిన రౌడీషీటర్ జాల శ్రీను హత్య కేసులో యుసూఫ్ ప్రధాన నిందితుడు.పాతకక్షలతో జి.రామఅప్పలనాయకుడు 8-11-2010లో హత్య చేసి ముక్కలుగా వేరు చేసి దేవరకొండ, నార్కట్‌పల్లి, నల్లగొండ, చిట్యాల జనసముదాయ ప్రాంతంలో విడిభాగాలు వేసి సంచలనం సృష్టించాడు. దేవరకొండలో 29-5-1999లో కరుణాకర్‌ను పాత కక్షల నేపథ్యంలో హత్య చేశాడు.హైదరాబాద్ నాంపల్లి కోర్టు ప్రాంగణంలో 2005లో ఓ వ్యక్తిని హత్య చేశాడు.
పథకం ప్రకారమేనా..?
పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉంటున్న యుసూఫ్ కొంతకాలంగా హైదరాబాద్‌లోనే నివాసముంటున్నాడు. ఎప్పుడు జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్లినా పోలీసులకు సమాచారం ఇచ్చే వాడని తెలిసింది. అయితే రెండు రోజుల క్రితం నల్లగొండకు వచ్చిన యుసూఫ్ పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు..? అనే అనుమానం వ్యక్తంమవుతోంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే యూసుఫ్ అనుచరులే పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టారనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
పోలీసులకు ఫిర్యాదు
తన సోదరుడిని జిల్లా కేంద్రానికి చెందిన జి.శ్రీను అలియాస్ టమాట శ్రీను, జాంగీర్, శంకర్ అలీయాస్ పూల శంకర్, రషీద్, జాని, అంజద్‌లే మట్టుబెట్టారని అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి సోదరుడు వహీద్ టుటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసుల అదుపులో అనుమానితులు..?
సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలను చేపట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. నిందితులను త్వరితగతిన పట్టుకునేందుకు మూడు పోలీసు బృందాలతో గాలింపు చేపట్టినట్టు డీఎస్పీ, సీఐ వివరించారు.
రౌడీషీటర్ దారుణహత్య
Published Fri, Feb 27 2015 12:08 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement