కోటపల్లి : కోటపల్లి మండలం నార్పెల్లి గ్రామ శివారులోని పొలాలలో తల, మొండెం వేరైన యువకుని మృతదేహన్ని గ్రామస్తులు శనివారం గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుడు తాళ్లపూడి శ్రీనివాస్గా (32) పోలీసుల సమక్షంలో స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి బైక్పై వచ్చిన కొందరు వ్యక్తులు శ్రీనివాస్కు ఫోన్ చేసి... గ్రామ శివారుకు రప్పించుకున్నారని అతడి బంధువులు వెల్లడించారు. దాంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.