మర్మాంగాలు కోసి..వ్యక్తి దారుణ హత్య | Tragedy Incident In Chanda Nagar | Sakshi
Sakshi News home page

మర్మాంగాలు కోసి..వ్యక్తి దారుణ హత్య

Published Thu, Oct 10 2024 11:53 AM | Last Updated on Thu, Oct 10 2024 11:53 AM

Tragedy Incident In Chanda Nagar

చందానగర్‌: ఓ వ్యక్తిని పురుషాంగాలు కోసి దారుణంగా హత్య చేసిన సంఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ పాలవెల్లి తెలిపిన ప్రకారం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకామనిపాడు గ్రామానికి చెందిన తన్నీరు మాలాద్రి (36) భార్య మాధవితో కలిసి ఆరేళ్లుగా శేరిలింగంపల్లి తారానగర్‌లో ఉంటున్నాడు. 

సెంట్రింగ్‌ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. మాలాద్రి ఇంటి పక్కనే సోదరి అరుణ కూడా నివాసముంటున్నారు. కాగా అతని భార్య మాధవి సెప్టెంబర్‌ 30న తన సొంత గ్రామంలో బంధువుల పెళ్లి ఉండడంతో పిల్లలతో కలిసి ఊరెళ్లింది. మంగళవారం మాలాద్రి ఉదయం ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం 6 గంటలకు అతని సోదరి అరుణ పిలిస్తే పలకలేదు. 

నిద్రపోయి ఉంటాడని ఆమె వెళ్లిపోయింది. 6.30 గంటలకు ఫోన్‌ చేయగా తీయకపోవడంతో వారు మళ్లీ ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడని, మర్మాంగాలు కోసి ఉన్నాయని ధృవీకరించారు. దీంతో అర్ధరాత్రి చందానగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ పాలవెల్లి, క్లూస్‌ టీం సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement