chandanagar police station
-
మర్మాంగాలు కోసి..వ్యక్తి దారుణ హత్య
చందానగర్: ఓ వ్యక్తిని పురుషాంగాలు కోసి దారుణంగా హత్య చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పాలవెల్లి తెలిపిన ప్రకారం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకామనిపాడు గ్రామానికి చెందిన తన్నీరు మాలాద్రి (36) భార్య మాధవితో కలిసి ఆరేళ్లుగా శేరిలింగంపల్లి తారానగర్‌లో ఉంటున్నాడు. సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. మాలాద్రి ఇంటి పక్కనే సోదరి అరుణ కూడా నివాసముంటున్నారు. కాగా అతని భార్య మాధవి సెప్టెంబర్ 30న తన సొంత గ్రామంలో బంధువుల పెళ్లి ఉండడంతో పిల్లలతో కలిసి ఊరెళ్లింది. మంగళవారం మాలాద్రి ఉదయం ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం 6 గంటలకు అతని సోదరి అరుణ పిలిస్తే పలకలేదు. నిద్రపోయి ఉంటాడని ఆమె వెళ్లిపోయింది. 6.30 గంటలకు ఫోన్ చేయగా తీయకపోవడంతో వారు మళ్లీ ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడని, మర్మాంగాలు కోసి ఉన్నాయని ధృవీకరించారు. దీంతో అర్ధరాత్రి చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ పాలవెల్లి, క్లూస్ టీం సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. -
శేరిలింగంపల్లి యువతిపై కార్పొరేటర్ దాడి
-
యువతిపై శేరిలింగంపల్లి కార్పొరేటర్ దాడి
సాక్షి, హైదరాబాద్: శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సోమవారం ఓ యువతిపై దాడి చేశారు. కార్ పార్కింగ్ వివాదంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి దాడికి దారి తీసినట్లు తెలుస్తోంది. శేరిలింగంపల్లిలోని లక్ష్మీ విహార్ పేజ్2 కాలనీలో నాగేంద్ర యాదవ్ నివాసముంటున్నారు. అదే కాలనీలో వేణుగోపాల్ కుటుంబం కూడా ఉంటుంది. అక్కడికి కారులో వచ్చిన వేణుగోపాల్ కుమార్తె అడ్డంగా ఉన్న కార్పొరేటర్ కారు తీయాలని కోరింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అది దాడి చేసేంతగా పెరిగింది. ఈ గొడవను వేణుగోపాల్ రెండో కుమార్తె వీడియో తీసింది. షార్ట్, బనియన్‌పై ఉన్నానని వీడియో తీయ్యొద్దని కార్పొరేటర్ ఆ యువతిని వారించారు. అయినా వినకుండా వీడియో తీయడంతో వివాదం మరింత ముదిరింది. ఇద్దరు చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువురిపైన కేసు నమోదయినట్లు చందానగర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర తెలిపారు. కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ పై 323,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు యువతి పైన 448,504 సెక్షన్ల కింద కేసు పెట్టారు. -
మృత్యు పిల్లర్
హైదరాబాద్: నగరానికి వలస పోయి చేతనైన పనిచేసుకుంటూ తమ పిల్లలకు కడుపు నింపుకుందామనుకున్న ఆ దంపతుల ఆశ తీరకుండానే ఆవిరైపోయింది. బతుకుదెరువు కోసం భవన నిర్మాణ కూలీలుగా ఇద్దరు చిన్నారులతో వలస వచ్చిన ఆ భార్యాభర్తలు నగరంలో జీవనం కొనసాగిస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న భవనానికి పునాది లేకుండా సిమెంట్ ఇటుకలతో నిర్మించిన ఓ పిల్లర్ వారి పిల్లల పాలిట మృత్యు శకటమైంది. తమ అభాగ్య జీవితాల్లో భాగ్య రేఖలు నింపుతారని కొండంత ఆశతో ఉన్న ఆ దంపతులకు ఆ పిల్లర్ తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలు సీఐ రవీందర్ చెప్పిన కథనం మేరకు..ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన దస్తగిరి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌కు వలసవచ్చి గోపన్‌పల్లిలోని బెల్ల్ల విస్తవిల్లాస్ ఆర్చ్‌లో ఉంటూ భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. శుక్రవారం బెర్ల విస్తవిల్లాస్ ఆర్చ్‌లోని భవనంలో కూలీ పనులు చేస్తుండగా వారి కూతుళ్లు అమ్ములు(6), ప్రవళిక(3) ఇద్దరు కలిసి భవనం ముందు ఆడుకుంటున్నారు. ఆ చిన్నారులు ఆడుకుంటుండగా మధ్యాహ్నం పిల్లర్ కుప్పకూలిపోయింది. అందులోని సిమెంట్ ఇటుకలు ఆ చిన్నారులపై పడటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో వారిని నల్లగండ్లలోని సిటిజన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత అక్కడ నుండి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్మాణదారులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు మృతి చెందిన విషయం తెలుసుకున్న గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. సంఘటన గురించి పోలీసులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత లేకుండా నిర్మించడమే కారణం గోపన్‌పల్లిలోని బెర్ల విస్తవిల్లార్ ఆర్చ్ పేరుతో ఓ సంస్థ ఇండిపెండెంట్ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. భవన నిర్మాణాల్లో భాగంగా భవన డిజైన్ కోసమని సిమెంట్ ఇటుకలతో పునాది లేకుండానే ఓ పిల్లర్‌ను నిర్మించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. -
అడ్రస్ అడిగి మహిళ మెడలో చైన్‌స్నాచింగ్
హైదరాబాద్: అడ్రస్ అగినట్లు నటించి ఇంటి ముందు శుభ్రపరుస్తున్న ఓ మహిళలోని 3 తులాల బంగారు గొలుసును లాక్కెల్లిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వాసు సమాచారం మేరకు... శేరిలింగంపల్లి భెల్ ఎంఐజీలో నివాసముండే విజయలక్ష్మి (60) శుక్రవారం ఉదయం తన ఇంటిముందు చెత్తను తొలగిస్తుండగా.. పల్సర్‌పై వచ్చిన ఓ వ్యక్తి విజయ లక్ష్మిని అడ్రస్ అడుగుతూ దృష్టిమరల్చి ఆకస్మాత్తుగా ఆమె మెడలోని పుస్తెలతాడు, హారాన్ని తస్కరించి వేగంతో పరారయ్యాడు. విజయలక్ష్మి తేరుకొని చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.