హైదరాబాద్ : మేడ్చల్ మండలం ఎల్లంపేటలో ఎనిమిదేళ్ల చిన్నారి కావ్యను బుధవారం అర్థరాత్రి దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం వారు పరారైయ్యారు. గురువారం ఉదయం కావ్య మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.