ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులను గుర్తుతె లియని దుండ గులు హత్యచేశారు.
వరంగల్ : ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులను గుర్తుతె లియని దుండ గులు హత్యచేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కే.సముద్రంలో జరిగింది. ఉప్పరపల్లి రోడ్డు సమీపంలో నివాసముంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు వెంకటరామయ్య(68) ఇంట్లొ ఈ దారుణం జరిగింది. శుక్రవారం భార్య సరస్వతి రెండేళ్లబాబుతో నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు బలమైన ఆయుధాలతో మెడ నరికి అతికిరాతకంగా ఇద్దర్ని చంపేశారు. శనివారం ఉదయం బాబు ఏడుస్తున్న శబ్ధం వినిపించడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి తలుపు తీయడంతో ఈ విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులలుఏ కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.
(కే.సముద్రం)