ముక్కలు చేసి... మూటకట్టి! | Unidentified Woman Was Deceased In Narayanpet District | Sakshi
Sakshi News home page

ముక్కలు చేసి... మూటకట్టి!

Published Tue, Mar 29 2022 3:13 AM | Last Updated on Tue, Mar 29 2022 5:04 AM

Unidentified Woman Was Deceased In Narayanpet District - Sakshi

నారాయణపేట రూరల్‌: గుర్తు తెలియని ఓ మహిళను అతి దారుణంగా హత్య చేసి.. తల, శరీర భాగాలను వేరు చేసి పారవేసిన ఘటన నారాయణపేట జిల్లాలో సంచలనం సృష్టించింది.  నారాయణపేట పట్టణ సమీపంలోని శ్యాసన్‌పల్లి రోడ్డు మార్గంలో రోజు మాదిరి సోమవారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరికి పెద్దఎత్తున దుర్వాసన వచ్చింది. అనుమానంతో రోడ్డు దిగువన పొలంగట్ల వైపు వెళ్లి చూడగా.. ఓ మూటకట్టిన సంచిలో చిన్నపాటి మాంసం ముద్ద ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే సమాచా రం ఇవ్వడంతో సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐ సురేష్‌గౌడ్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తల, కాళ్లు, చేతులు లేకుండా మొండెం మాత్రమే ఉండి, చుట్టూ కొన్ని మహిళకు సంబంధించిన దుస్తులు లభించాయి.  ఇప్పటికే అన్ని పోలీస్‌స్టేషన్లలో మిస్సింగ్‌ కేసులతోపాటు ఇతర జిల్లాలు, పొరుగున ఉన్న కర్ణాటక పోలీసులకు సైతం సమాచారం అందించారు. ఇటీ వల శ్యాసన్‌పల్లిలో జాతర జరిగిందని, ఆ సమయంలో ఏమైనా గొడవ జరిగిందా.. అక్రమ సం బంధం కారణమా లేదా ఆస్తి వివాదాలతో ఇలా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement