unidentified woman
-
ముక్కలు చేసి... మూటకట్టి!
నారాయణపేట రూరల్: గుర్తు తెలియని ఓ మహిళను అతి దారుణంగా హత్య చేసి.. తల, శరీర భాగాలను వేరు చేసి పారవేసిన ఘటన నారాయణపేట జిల్లాలో సంచలనం సృష్టించింది. నారాయణపేట పట్టణ సమీపంలోని శ్యాసన్‌పల్లి రోడ్డు మార్గంలో రోజు మాదిరి సోమవారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరికి పెద్దఎత్తున దుర్వాసన వచ్చింది. అనుమానంతో రోడ్డు దిగువన పొలంగట్ల వైపు వెళ్లి చూడగా.. ఓ మూటకట్టిన సంచిలో చిన్నపాటి మాంసం ముద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సమాచా రం ఇవ్వడంతో సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్ఐ సురేష్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తల, కాళ్లు, చేతులు లేకుండా మొండెం మాత్రమే ఉండి, చుట్టూ కొన్ని మహిళకు సంబంధించిన దుస్తులు లభించాయి. ఇప్పటికే అన్ని పోలీస్స్టేషన్లలో మిస్సింగ్ కేసులతోపాటు ఇతర జిల్లాలు, పొరుగున ఉన్న కర్ణాటక పోలీసులకు సైతం సమాచారం అందించారు. ఇటీ వల శ్యాసన్‌పల్లిలో జాతర జరిగిందని, ఆ సమయంలో ఏమైనా గొడవ జరిగిందా.. అక్రమ సం బంధం కారణమా లేదా ఆస్తి వివాదాలతో ఇలా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో గుర్తుతెలియని మహిళ శవం
ఈపూరు మండలం కొంచర్ల చెరువులో ఆదివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో పడి గుర్తుతెలియని మహిళ మృతి
వర్ని మండలం రద్రూరు శివారులో ఉన్న చెరువులో పడి ఓ గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. మహిళ వయసు సుమారు 40 సంవత్సరాలు ఉండవచ్చు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
వినుకొండలో సగం కాలిన మృతదేహం
గుంటూరు జిల్లా వినుకొండ మహిళా డిగ్రీ కళాశాల సమీపంలోని నిర్జన ప్రదేశంలో దారుణ వెలుగు చూసింది. ఆదివారం ఉదయం స్థానికులు ముళ్లపొదల్లో సగం కాలిన మహిళ మృతదేహాన్ని గుర్తించారు. శనివారం రాత్రి గుర్తు తెలియని మహిళను దుండగులు హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించారని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
బావిలో గుర్తు తెలియని మృతదేహం
రాయచోటి మున్సిపల్ పరిధిలోని మాసాపేట గొల్లపల్లిలో గుర్తుతెలియని మహిళ మృత దేహం బావిలో లభ్యమైంది. మంగళవారం అటుగా వెళ్లిన స్థానికులు మహిళ మృత దేహం బావిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు. మృతి చెందిన మహిళ ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయిందా లేక ఎవరైనా తోసేశారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. మృతురాలి వివరాలు తెలియ రాలేదు. -
ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్ ఢీ కొన్న ఘటనలో గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. మంగళవారం రాధికా చౌరస్తావద్ద ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో కుషాయి గూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. -
స్టీల్‌ప్లాంట్‌లో మహిళ మృతదేహం
విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ పార్క్‌లో గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. బుధవారం పార్క్‌లో పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులకు పార్క్ లోపల ఉన్న బోటింగ్ కొలనులో మృతదేహం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సుమారూ 40 సంవత్సరాల వయసున్న మహిళ ఆత్మహత్య చేసుకుందా.. లేక ఎవరైన హత్య చేసి ఇక్కడ పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళపై అత్యాచారం, హత్య
వనపర్తి (మహబూబ్‌నగర్ జిల్లా) : గుర్తుతెలియని మహిళపై అత్యాచారం చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం నాగారం గ్రామంలో గురువారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నాగారం గ్రామానికి చెందిన కొంతమంది పశువుల కాపరులు గ్రామంలోని రాజాగారితోటలో పశువుల మేతకు వెళ్లారు. కాగా అక్కడ మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. మహిళపై అత్యాచారం చేసి ఆపై పెట్రోలు పోసి నిప్పంటించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కాగా మహిళ వివరాలు, ఆమె హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు, దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
చంపేసి.. కాల్చేసి..
⇒ గుర్తుతెలియని మహిళ దారుణ హత్య ⇒ ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం ⇒ క్లూస్‌టీం, జాగిలాలతో వివరాల సేకరించిన పోలీసులు పరిగి:గుర్తు తెలియని ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగులు మహిళను చంపేసి మృతదేహాన్ని కాల్చేశారు. పోలీసులు క్లూస్‌టీం, జాగిలాలతో వివరాలు సేకరించారు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో సోమవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపూర్-మిట్టకోడూర్ మార్గంలోని అటవీప్రాంతంలో ఓ మృతదేహం పూర్తి గా కాలిపోయి ఉంది. ఈ విషయమాన్ని గమనించిన మిట్టకోడూర్కు చెందిన పశువుల కాపర్లు గ్రామస్తులకు తెలిపారు. ఘటన ఇబ్రహీంపూర్ రెవెన్యూ పరిధిలో జరగడంతో ఆ గ్రామ సర్పంచ్ అనంతయ్య ఫిర్యాదు మేరకు పరిగి సీఐ ప్రసాద్, ఎస్ఐ శంషొద్దీన్ సిబ్బం దితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా కాలిపోయింది. గుర్తుపట్టే వీలులేకుండా పోయింది. చేతులకు ఉన్న గాజుల ఆధారంగా హత్యకు గురైంది మహిళ అని పోలీసులు గుర్తించారు. ముఖానికి స్కార్ఫ్ చుట్టి ఉంది. మహిళ 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహానికి బెండింగ్ వైర్లు చుట్టి ఉన్నాయి. దగ్గరలో ఓ అగ్గిపెట్టె పడి ఉంది. మహిళ కాళ్లకు మెట్టెలు లేకపోవడంతో పెళ్లి కాని యువతి కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలో కారు తిరిగిన ఆనవాళ్లు కనిపించాయి. దీనిని బట్టి దుండగులు యవతిని వేరే ప్రాంతంలో హత్య చేసి శనివారం రాత్రి మృతదేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి పడేసి..కాల్చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు క్లూస్‌టీం సాయంతో ఆధారాలు సేకరించారు. పోలీసు జాగిలాలు ఘటనా స్థలం నుంచి సమీపంలో ఉన్న మట్టిరోడ్డు వరకు వెళ్లి ఆగింది. మృతదేహం పూర్తిగా కాలిపోవటంతో డాక్టర్ అపూర్వ ఘటనా స్థలంలో పోస్టుమార్టం నిర్వహించారు. యువతి హత్య విషయమై సమీపంలోని మహబూబ్‌నగర్ పోలీసులతో పాటు అన్ని ఠాణాలకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ దారుణ హత్య
శంషాబాద్ రూరల్: గుర్తుతెలియని మహిళ(35) దారుణ హత్యకు గురైంది. దుండగులు బండరాళ్లతో మోది చంపేశారు. అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన మండల పరిధిలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోశెట్టిగూడ శివారులో ఔటర్ రింగు రోడ్డు సర్వీసు రహదారి సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు మహిళ తలపై బండరాయితో మోది హతమార్చారు. ఘటనా స్థలానికి సమీపంలో ఓ రాయి రక్తపు మరకలతో పడి ఉంది. మృతురాలి ముఖం గాయాలతో, రక్తంతో నిండి ఉంది. రక్తం నలుపురంగులోకి మారడంతో దుండగులు దాదాపు రెండు రోజుల క్రితం చంపేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి ముఖం నుజ్జునుజ్జయి గుర్తుపట్టకుండా తయారైంది. హతురాలికి సంబంధించిన ఆధారాలు లభించలేవు. దుండగులు మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని, మృతురాలు స్థానికంగా ఇటుక బట్టీల్లో పని చేసే ఒడిశా కార్మికురాలు అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహానికి కొద్ది దూరంలో రక్తం మరకలతో నీలిరంగు చారల టవల్ పడి ఉంది. మృతురాలి ఒంటిపై ఎర్రరంగు చారల చీర, నలుపు రంగు జాకెట్ ఉన్నాయి. హమీదుల్లానగర్ నుంచి తొండుపల్లి ఔటర్ జంక్షన్‌కు వచ్చే దారిలోని ఈ ప్రాంతంలో సర్వీసు దారి నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీంతో ఇటువైపు వాహనాల రాకపోకలు లేకపోవడంతో నిర్మానుష్యంగా ఉంటుంది. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. జాగిలాలు ఘటనా స్థలం నుంచి సర్వీస్ రహదారి నుంచి పోశెట్టిగూడ వరకు వెళ్లి ఆగాయి. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకీ తరలించారు. మృతురాలి బంధువులు 08413-222033 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం
నల్లగొండ క్రైం : జిల్లా కేంద్రంలోని లెప్రసీ కాలనీ శివారులో గురువారం ఉదయం గుర్తుతెలియని యువతి (22) మృతదేహం లభ్యమైంది. పరి సర ప్రాంతాల రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలిని సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి కుడి బుగ్గపై నల్లటి మచ్చ, ముక్కుపుడిక, తెలుపురంగులో ఉండి, తెల్లని పంజాబి డ్రెస్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యువతి 5.6 ఎత్తు ఉంటుందన్నారు. మృతురాలి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ముక్కులో నుంచి రక్తం కారడంతో విషప్రయోగం ద్వారా యువతిను చంపి ఇక్కడ పడవేసి ఉంటారా..? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమా, లేక నగల కోసం హత్య చేశారా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి నల్లగొండ జిల్లాకు చెందినదా..? లేక హైదరాబాదు నుంచి తీసుకువచ్చి చంపి మృతదేహాన్ని ఇక్కడ పడవేశారా.? అనే కోణంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. మృతురాలి ఆచూకీ తెలిస్తే 9440795657, 9440795656 నెంబర్లకు సమాచారం అందించాలని ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. మిస్సింగ్ కేసులపై ఆరా... యువతి మృతదేహం లభించడంతో జిల్లాలో వున్న యువతల మిస్సింగ్ కేసుల వివరాల నమోదుపై ఆరా తీస్తున్నారు. ఫొటోలను అన్ని పోలీసు స్టేషన్లకు పంపించారు. మహిళా హాస్టళ్లు, అన్ని కాలేజీల్లో యువతి ఫొటోను చూపిస్తూ ఆరా తీస్తున్నారు. విద్యార్థినా.. లేక ప్రైవేట్ ఉద్యోగినా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.