గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం | unidentified woman Dead body Available in Nalgonda | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం

Published Sat, Oct 25 2014 3:04 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం - Sakshi

గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం

నల్లగొండ క్రైం : జిల్లా కేంద్రంలోని లెప్రసీ కాలనీ శివారులో గురువారం ఉదయం గుర్తుతెలియని యువతి (22) మృతదేహం లభ్యమైంది.  పరి సర ప్రాంతాల రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలిని సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి కుడి బుగ్గపై నల్లటి మచ్చ, ముక్కుపుడిక, తెలుపురంగులో  ఉండి, తెల్లని పంజాబి డ్రెస్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యువతి 5.6 ఎత్తు ఉంటుందన్నారు. మృతురాలి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ముక్కులో నుంచి రక్తం కారడంతో విషప్రయోగం ద్వారా యువతిను చంపి ఇక్కడ పడవేసి ఉంటారా..? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమా, లేక నగల కోసం హత్య చేశారా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి నల్లగొండ జిల్లాకు చెందినదా..? లేక హైదరాబాదు నుంచి తీసుకువచ్చి చంపి మృతదేహాన్ని ఇక్కడ పడవేశారా.? అనే కోణంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. మృతురాలి ఆచూకీ తెలిస్తే  9440795657, 9440795656 నెంబర్లకు సమాచారం అందించాలని ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.  

మిస్సింగ్ కేసులపై ఆరా...
యువతి మృతదేహం లభించడంతో జిల్లాలో వున్న యువతల మిస్సింగ్ కేసుల వివరాల నమోదుపై ఆరా తీస్తున్నారు. ఫొటోలను అన్ని పోలీసు స్టేషన్‌లకు పంపించారు.  మహిళా హాస్టళ్లు, అన్ని కాలేజీల్లో యువతి ఫొటోను చూపిస్తూ ఆరా తీస్తున్నారు. విద్యార్థినా.. లేక ప్రైవేట్ ఉద్యోగినా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement