ఉద్యోగ విరమణ రోజే దారుణ హత్య | Brutal Murder On Retirement Day At Mysore | Sakshi
Sakshi News home page

ఉద్యోగ విరమణ రోజే దారుణ హత్య

Jul 2 2022 8:42 AM | Updated on Jul 2 2022 8:44 AM

Brutal Murder On Retirement Day At Mysore - Sakshi

మైసూరు: ఉద్యోగ విరమణ పొందిన రోజే వర్సిటీ ఉద్యోగి హత్యకు గురయ్యాడు ఈ ఘటన మైసూరు నగరంలోని విద్యారణ్యపురలోని బూతాల్‌ మైదానంలో చోటు చేసుకుంది.  మైసూరు వి.విలో ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న కృష్ణేగౌడ(60) గురువారం ఉద్యోగ విరమణ చెందాడు. సాయంత్రం బూతాల్‌ మైదానంలో వాకింగ్‌కు వెళ్లిన సమయంలో దుండగులు గొంతుకోసి ఉడాయించారు. పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  కేసు దర్యాప్తులో ఉంది.

బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య
యశవంతపుర: మూడున్నరేళ్ల చిన్నారికి ఉరి వేసిన తల్లి అనంతరం తానూ ఆత్మహత్య  చేసుకుంది. ఆర్‌ఆర్‌నగర పరిధిలోని మంత్రి అల్టియాన్‌ అపార్ట్‌మెంట్‌లో దీపా, ఆదర్శ్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వారం రోజులుగా జ్వరం, కడుపునొప్పితో బాధ పడుతున్న దీపా తన కుమార్తె రియాను పడక గదిలో ఫ్యాన్‌కు ఉరివేసింది. అనంతరం ఆమె కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. గదిలో ఒక సూసైడ్‌ నోట్‌ లభించింది. తన మృతికి ఎవరూ కారణం కాదని దీపా రాసినట్లు ఉందని పోలీసులు తెలిపారు.  

(చదవండి: రెండో భర్త ఫిర్యాదు.. మూడో భర్తతో కలిసి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement