రచ్చబండ సాక్షిగా.. | young man brutally murdered in in nalgonda district | Sakshi
Sakshi News home page

రచ్చబండ సాక్షిగా.. యువకుడిపై కత్తితో దాడి

Published Sun, Mar 25 2018 5:04 PM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM

young man brutally murdered in in nalgonda district - Sakshi

నిడమనూరు (నాగార్జునసాగర్‌) : ఎర్రబెల్లి గ్రామానికి చెందిన పెదమాం రజనీకాంత్‌(25)ను శనివారం ఉదయం అదే గ్రామానికి చందిన ముడి నాగయ్య కత్తితో పొడవడంతో మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే గ్రామానికి చెందిన వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్నట్టు తెలిసింది. ఎర్రబెల్లికి చెందిన దాసరి వెంకన్న దామరచర్ల మండలం కల్లేపల్లి మైసమ్మ వద్ద మొక్కు తీర్చుకునేందుకు ఈనెల 22న వెళ్లాడు. బంధువులైన ముడి నాగయ్య, పెదమాం రజనీకాంత్‌లను పిలవడంతో ఇద్దరూ సైతం అక్కడికెళ్లారు. రజనీకాంత్‌ తన భార్యతో వివాహేతర పెట్టుకున్నాడనే అనుమానం ఉన్నదని, అతన్ని ఎందుకు పిలి చారం టూ ముడి నాగయ్య దాసరి వెంకన్నను, రజనీకాంత్‌ను తిట్టాడు. తనను అకారణంగా దూషించాడని రజనీకాంత్‌.. శనివారం పెద్దమనులను పిలిచి పంచాయితీ పెట్టిం చాడు.  పెద్దలు మాట్లాడుతుండగానే నాగయ్య, రజనీకాంత్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. రజనీకాంత్‌ మొదట ఆవేశంగా తనను తిడతావా అంటూ ముడి నాగయ్యపైకి దూసుకెళ్లాడు. అదే క్రమంలో నాగయ్య అప్పటికే తన వద్ద దాచుకున్న చుర కత్తితో రజనీకాంత్‌ను పొడిచాడు. వెంటనే చికిత్స కోసం మిర్యాలగూడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. 

గ్రామంలో ఉద్రిక్తత
నాగయ్యను వెంటనే అరెస్ట్‌ చేసి శిక్షిం చాలని రజనీకాంత్‌ బంధువులు డిమాండ్‌ చేశారు. మృతదేహాన్ని నాగయ్య ఇంటి వద్ద ఉంచే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకుంటున్నారు. మిర్యాలగూడ, హాలి యా సీఐలు రమేష్, ధనుంజయగౌడ్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడి సోదరు డు వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement