nagayya
-
అన్యాయం జరిగితే ఆత్మహత్యే.. ఎంపీ కేశినేని నానిని హెచ్చరించిన నాగయ్య
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద ఆయన బాబాయ్ నాగయ్య ఆందోళన చేపట్టారు. కేశినేని నాని తన ఆస్తి కాజేయాలని చూస్తున్నాడని నాగయ్య ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కేశినేని నాని కార్యాలయం పక్కనే నాగయ్య ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడు. ఆ భవన నిర్మాణం అక్రమమంటూ ఎంపీ నాని కార్పొరేషన్‌తో నోటీసులు ఇప్పించాడని నాగయ్య తెలిపారు. కేశినేని నాని దుర్మార్గుడు.. తన సంతకం ఫోర్జరీ చేసి ఆస్తి కాజేసేందుకు కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. తనకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. పోలీసులు, అధికారులు తన గోడును పట్టించుకోవడం లేదంటూ నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (Nandyal TDP: టీడీపీలో వర్గ పోరు) -
రచ్చబండ సాక్షిగా..
నిడమనూరు (నాగార్జునసాగర్) : ఎర్రబెల్లి గ్రామానికి చెందిన పెదమాం రజనీకాంత్(25)ను శనివారం ఉదయం అదే గ్రామానికి చందిన ముడి నాగయ్య కత్తితో పొడవడంతో మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే గ్రామానికి చెందిన వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్నట్టు తెలిసింది. ఎర్రబెల్లికి చెందిన దాసరి వెంకన్న దామరచర్ల మండలం కల్లేపల్లి మైసమ్మ వద్ద మొక్కు తీర్చుకునేందుకు ఈనెల 22న వెళ్లాడు. బంధువులైన ముడి నాగయ్య, పెదమాం రజనీకాంత్‌లను పిలవడంతో ఇద్దరూ సైతం అక్కడికెళ్లారు. రజనీకాంత్ తన భార్యతో వివాహేతర పెట్టుకున్నాడనే అనుమానం ఉన్నదని, అతన్ని ఎందుకు పిలి చారం టూ ముడి నాగయ్య దాసరి వెంకన్నను, రజనీకాంత్‌ను తిట్టాడు. తనను అకారణంగా దూషించాడని రజనీకాంత్.. శనివారం పెద్దమనులను పిలిచి పంచాయితీ పెట్టిం చాడు. పెద్దలు మాట్లాడుతుండగానే నాగయ్య, రజనీకాంత్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. రజనీకాంత్ మొదట ఆవేశంగా తనను తిడతావా అంటూ ముడి నాగయ్యపైకి దూసుకెళ్లాడు. అదే క్రమంలో నాగయ్య అప్పటికే తన వద్ద దాచుకున్న చుర కత్తితో రజనీకాంత్‌ను పొడిచాడు. వెంటనే చికిత్స కోసం మిర్యాలగూడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గ్రామంలో ఉద్రిక్తత నాగయ్యను వెంటనే అరెస్ట్ చేసి శిక్షిం చాలని రజనీకాంత్ బంధువులు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని నాగయ్య ఇంటి వద్ద ఉంచే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకుంటున్నారు. మిర్యాలగూడ, హాలి యా సీఐలు రమేష్, ధనుంజయగౌడ్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడి సోదరు డు వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
నిజామాబాద్ జిల్లాలో దారుణం
నిజామాబాద్: జిల్లాలో శనివారం దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో దంపతులపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటన జిల్లాలోని వర్ని మండం జాకోరాలో శుక్రవారం అర్ధ రాత్రి చోటుచేసుకుంది. భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంచపు నాగయ్య(48), సాయవ్వ(40) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సాయవ్వ అదే గ్రామానికి చెందిన సాయిలుతో వివాహేతర సంబంధం నెరుపుతోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సాయవ్వ ఇంటికి వచ్చిన సాయిలు ఆమెను కోరిక తీర్చమని బలవంతపెట్టాడు. 20 రోజుల క్రితమే సాయవ్వ కుమారుడి వివాహం జరిగడంతో.. ఇంట్లో కోడలు ఉంది.. నా ఆరోగ్యం బాలేదని ఆమె అతన్ని అడ్డుకుంది. అయినా, వినకుండా ఆమెను బలవంతం చేయబోయాడు. ఇది గమనించిన ఆమె భర్త నాగయ్య, సాయిలును అడ్డుకొని ఇంట్లో నుంచి గెంటేశాడు. అనంతరం దంపతులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన సాయిలు గొడ్డలితో ఇద్దరిపై దాడి చేశాడు. దీంతో సాయవ్వ అక్కడికక్కడే మృతి చెందగా.. నాగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
రికార్డుకెక్కిన గిరిబాబు తండ్రి
నాంపల్లిః సినీ నటులు గిరిబాబు తండ్రి నాగయ్యకు హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డు లభించింది. 105 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు ఈ రికార్డును అందజేశారు. శనివారం గిరిబాబు ఇంటికి వెళ్లిన హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్ సీఈఓ పల్లె సుమన్, దైవజ్ఞ శర్మ అధ్యక్షతన సర్టిఫికెట్‌ను అందజేశారు. ప్రకాశం జిల్లాలో 1910లో జన్మించిన నాగయ్య 106 ఏళ్ల వయసులోనూ తన పనులను తాను చేసుకుంటారన్నారు. కార్యక్రమంలో గిరిబాబు తనయుడు రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.