నిజామాబాద్ జిల్లాలో దారుణం
Published Sat, Apr 1 2017 11:20 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
నిజామాబాద్: జిల్లాలో శనివారం దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో దంపతులపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటన జిల్లాలోని వర్ని మండం జాకోరాలో శుక్రవారం అర్ధ రాత్రి చోటుచేసుకుంది. భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంచపు నాగయ్య(48), సాయవ్వ(40) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సాయవ్వ అదే గ్రామానికి చెందిన సాయిలుతో వివాహేతర సంబంధం నెరుపుతోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సాయవ్వ ఇంటికి వచ్చిన సాయిలు ఆమెను కోరిక తీర్చమని బలవంతపెట్టాడు. 20 రోజుల క్రితమే సాయవ్వ కుమారుడి వివాహం జరిగడంతో.. ఇంట్లో కోడలు ఉంది.. నా ఆరోగ్యం బాలేదని ఆమె అతన్ని అడ్డుకుంది.
అయినా, వినకుండా ఆమెను బలవంతం చేయబోయాడు. ఇది గమనించిన ఆమె భర్త నాగయ్య, సాయిలును అడ్డుకొని ఇంట్లో నుంచి గెంటేశాడు. అనంతరం దంపతులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన సాయిలు గొడ్డలితో ఇద్దరిపై దాడి చేశాడు. దీంతో సాయవ్వ అక్కడికక్కడే మృతి చెందగా.. నాగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Advertisement
Advertisement