
సాక్షి, షాద్‌నగర్ రూరల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడా.. లేక మరేదైనా ఘటన హత్యకు దాసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాద్‌నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో గురువారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు.. కర్నూలుకు చెందిన నాగరాజు(40) కొంతకాలంగా పట్టణంలో రోడ్ల పక్కన చిత్తు కాగితాలు సేకరిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో అతడు పట్టణంలో నివాసం ఉంటున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. సదరు మహిళ భర్తతో కలిసి పటేల్ రోడ్డులోని అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు అతడు భార్యకు సూచించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నాగరాజును ఎలాగైనా పక్కకు తప్పించాలని మహిళ భర్త పథకం పన్నాడు. అందులో భాగంగానే హత్య చేసినట్లు తెలుస్తోంది. తన భార్య కోసం ఇంటికి వచ్చిన నాగరాజును అతడు కొట్టి చంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నాగరాజు మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment