వనస్థలిపురంలో యువకుడి దారుణ హత్య | Lalit brutally murdered in vanasthalipuram | Sakshi
Sakshi News home page

వనస్థలిపురంలో యువకుడి దారుణ హత్య

Published Thu, Sep 29 2016 7:01 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

Lalit brutally murdered in vanasthalipuram

హైదరాబాద్ : వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున యువకుడు దారుణహత్యకు గురైయ్యాడు. స్థానిక సచివాలయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న లలిత్ అనే యువకుడి ఇంట్లోకి ఆగంతకులు ప్రవేశించి... దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంట్లోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆగంతకులు అక్కడి నుంచి పరారైయ్యారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు ప్రేమ వివాహమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2015లో లలిత్ ప్రేమవివాహం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement