మడకశిర : పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ఆదివారం మడకశిరకు వస్తున్నట్లు స్థానిక మాజీ ఎమ్మెల్యే కే సుధాకర్ తెలిపారు. ఆయన ఆదివారం ఉదయం 10.30గంటలకు పట్టణంలోని శ్రీ నీలకంఠకోల్డ్ స్టోరేజ్‌లో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పీసీసీ చీఫ్ పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.