పెనుగొండ బస్సు ఘటన మరువకముందే అదే ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది.
మడకశిర: అనంతపురం జిల్లా పెనుగొండ బస్సు ఘటన మరువకముందే అదే ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఆమిదాలగొంది సమీపంలో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏ వాహనం ఢీ కొట్టింది అనే ఇంకా తెలియ రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్న స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలిస్తున్నారు.