డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే...ప్రమాదం | anantapuram bus ccident, caused by Bus dirver Negligence | Sakshi
Sakshi News home page

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే...ప్రమాదం

Published Wed, Jan 7 2015 10:13 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే...ప్రమాదం - Sakshi

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే...ప్రమాదం

హైదరాబాద్ : బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే  ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైనట్లు అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలో మడకశిర నుంచి పెనుకొండకు బయల్దేరిన బస్సు అదుపు తప్పి లోయలో పడిన విషయం తెలిసిందే. కాగా మృతుల సంఖ్య 15 నుంచి 20 వరకూ ఉండవచ్చని పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.

ప్రస్తుతం విజయవాడలో ఉన్న తాము... ఘటనా స్థలానికి బయల్దేరినట్లు పల్లె రఘునాధరెడ్డి తెలిపారు. మధ్యాహ్నానికి సంఘటనా స్థలానికి  చేరుకుంటామని ఆయన చెప్పారు. అలాగే గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement