అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకి పెరుగుతోంది. ఇప్పటివరకూ 12మంది దుర్మరణం చెందినట్లు సమాచారం.
అనంతపురం : అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకి పెరుగుతోంది. ఇప్పటివరకూ 12మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. మరో 24మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరు, అనంతపురం, హిందుపురం ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో సుమారు 60మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కాగా మృతి చెందినవారి వివరాలు ఖచ్చితంగా తెలియరాలేదని, మరికొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు హుటాహుటీన ఘటనా స్థలానికి బయల్దేరారు.