మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే.. | anantapuram road accident: death toll rises to 8 | Sakshi
Sakshi News home page

మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే..

Published Wed, Jan 7 2015 9:40 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

anantapuram road accident: death toll rises to 8

అనంతపురం : అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. మడకశిర నుంచి పెనుకొండ  వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం  మలుపు తిరుగుతూ లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది.

మరోవైపు ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా ప్రమాదానికి గురైన బస్సు AP 10 Z 1053.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement