అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అనంతపురం జిల్లా మడకశిరలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబుకు ఐదేళ్ల తన పాలనపై ఓటు అడిగే ధైర్యం లేక ఢిల్లీ నుంచి నాయకులను తెచ్చుకుంటున్నారని విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో మోసం తప్ప ఏం జరగలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసే అబద్దపు వాగ్ధానాలకు మోసపోవద్దని కోరారు.