గత ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు అనేక హామీలను ఇచ్చారని, సీఎం అయ్యాక ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తన సుధీర్ఘ పాదయాత్రలో ప్రతిపేదవాడి కష్టాలను దగ్గరుండి చూశానని, వారందరికీ నేనున్నానని అని భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు శిశుపాలుడు వంటి రాక్షశుడు అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.