అనంతపురం అగ్రికల్చర్ : విద్యుత్ వినియోగదారులకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం గురువారం మడకశిర ట్రాన్స్‌కో సబ్ డివిజన్ ఆఫీస్‌లో ప్రత్యేక విద్యుత్ అదాలత్ ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఆర్‌ఎన్ ప్రసాదరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే అదాలత్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవాలని సూచించారు.