vidyut adalat
-
నేడు మడకశిరలో విద్యుత్ అదాలత్
అనంతపురం అగ్రికల్చర్ : విద్యుత్ వినియోగదారులకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం గురువారం మడకశిర ట్రాన్స్‌కో సబ్ డివిజన్ ఆఫీస్‌లో ప్రత్యేక విద్యుత్ అదాలత్ ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే అదాలత్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవాలని సూచించారు. -
నేడు హిందూపురంలో విద్యుత్ అదాలత్
అనంతపురం అగ్రికల్చర్ : విద్యుత్ వినియోగదారులకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం బుధవారం హిందూపురం ట్రాన్స్‌కో డివిజినల్ ఇంజనీరు కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ ఏర్పాటు చేసినట్లు ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే అదాలత్ కార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని సూచించారు. -
విద్యుత్ అదాలత్‌కు స్పందన కరువు
నెల్లూరు (టౌన్): విద్యుత్‌శాఖ అధ్వర్యంలో స్థానిక విద్యుత్ భవన్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యుత్ అదాలత్‌కు స్పందన కరువైంది. కార్యక్రమానికి పరిష్కార వేదిక అధ్యక్షులు జగదీష్ చంద్రారావు, లీగల్, అకౌంట్స్, కస్టమర్ అఫైర్స్ సభ్యులు హజరయ్యారు. అయితే అదాలత్‌కు బిల్లు ఎక్కువగా వచ్చిందని కేవలం ఒక ఎచ్‌టీ సర్వీసు వినియోగదారుడు మాత్రమే వచ్చారు. ఆదాలత్పై ముందుగా వినియోగదారులకు ఎలాంటి అవగాహన కల్పించపోవడమే ఇందుకు కారణం. పత్రికలో హడావుడిగా ప్రకటన ఇచ్చి విద్యుత్ అధికారులు చేతులు దులుపుకున్నారు. వినియోగదారులు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు తిరుపతి నుంచి సుమారు 8 మంది సభ్యులు వస్తే ఒక్క వినియోదారుడు మాత్రమే అదాలత్‌కు రావడం చూసి వేదిక సభ్యులు అశ్చర్యపోయారు. అయితే అదాలత్‌కు విద్యుత్ అధికారులు హాజరై వినియోగదారులు రాకపోవడంతో మొక్కుబడిగా సమావేశం నిర్వహించి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.