విద్యుత్‌ అదాలత్‌కు స్పందన కరువు | Vidyut adalat at Nellore | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ అదాలత్‌కు స్పందన కరువు

Published Thu, Sep 22 2016 1:28 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

విద్యుత్‌ అదాలత్‌కు స్పందన కరువు - Sakshi

విద్యుత్‌ అదాలత్‌కు స్పందన కరువు

 
నెల్లూరు (టౌన్‌):
విద్యుత్‌శాఖ అధ్వర్యంలో స్థానిక విద్యుత్‌ భవన్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యుత్‌ అదాలత్‌కు స్పందన కరువైంది. కార్యక్రమానికి పరిష్కార వేదిక అధ్యక్షులు జగదీష్‌ చంద్రారావు, లీగల్, అకౌంట్స్, కస్టమర్‌ అఫైర్స్‌ సభ్యులు హజరయ్యారు. అయితే అదాలత్‌కు బిల్లు ఎక్కువగా వచ్చిందని కేవలం ఒక ఎచ్‌టీ సర్వీసు వినియోగదారుడు మాత్రమే వచ్చారు. ఆదాలత్‌పై ముందుగా వినియోగదారులకు ఎలాంటి అవగాహన కల్పించపోవడమే ఇందుకు కారణం. పత్రికలో హడావుడిగా ప్రకటన ఇచ్చి విద్యుత్‌ అధికారులు చేతులు దులుపుకున్నారు. వినియోగదారులు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు తిరుపతి నుంచి సుమారు 8 మంది సభ్యులు వస్తే ఒక్క వినియోదారుడు మాత్రమే అదాలత్‌కు రావడం చూసి వేదిక సభ్యులు అశ్చర్యపోయారు. అయితే అదాలత్‌కు విద్యుత్‌ అధికారులు హాజరై వినియోగదారులు రాకపోవడంతో మొక్కుబడిగా సమావేశం నిర్వహించి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement