రాజీలేని పోరాటం చేస్తా : డా. తిప్పేస్వామి  | I Will Fight For Madakasira People Says YSRCP Leader Thippeswamy | Sakshi
Sakshi News home page

రాజీలేని పోరాటం చేస్తా : డా. తిప్పేస్వామి 

Published Wed, Nov 28 2018 7:16 PM | Last Updated on Wed, Nov 28 2018 7:27 PM

I Will Fight For Madakasira People Says YSRCP Leader Thippeswamy - Sakshi

సాక్షి,  అనంతపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆశీస్సులతో ముందుకు వెళ్తానని, మడకశిర ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తానని మడకశిర వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త డా. తిప్పేస్వామి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక రద్దు తీర్పు చారిత్రాత్మకమన్నారు.

హైకోర్టు తీర్పు కాపీ అందగానే స్పీకర్‌ను కలవనున్నట్లు తెలిపారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. నామినేషన్ల పరిశీలన సమయంలోనే ఆధారాలను సమర్పించినా అధికారులు పట్టించుకోలేదన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement