thippeswamy
-
ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంత వరకు చూడలేదు..
-
అన్ని వర్గాలకూ అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్
-
టీటీడీ బోర్డు మెంబర్‌గా ఎమ్మెల్యే తిప్పేస్వామి
మడకశిర: ఎమ్మెల్యే డాక్టర్ ఎం. తిప్పేస్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో చోటు దక్కింది. మొత్తం 24 మందిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అందులో శ్రీసత్యసాయి జిల్లా నుంచి ఎమ్మెల్యే తిప్పేస్వామి కూడా ఉన్నారు. తొలిసారిగా మడకశిర నియోజకవర్గానికి చెందిన దళిత ఎమ్మెల్యేకి టీటీడీ బోర్డులో స్థానం దక్కడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించినందుకు ఎమ్మెల్యే తిప్పేస్వామి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటానని తెలిపారు. శ్రీవారికి సేవ చేసే భాగ్యం రావడం నిజంగా తన జీవితం ధన్యమైందని, ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. టీటీడీ బోర్డులో అశ్వర్థనాయక్కు చోటు తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) పాలకమండలి సభ్యునిగా అనంతపురం వాసి, విశ్రాంత రైల్వే మేనేజర్ అశ్వర్థనాయక్కు చోటు దక్కింది. ఈయన నియామకంపై టీటీడీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో తిరుమలలో జరిగే కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. -
MLA Thippeswamy: నేను క్షేమంగానే ఉన్నా.. ఎమ్మెల్యే తిప్పేస్వామి
మడకశిర (సత్యసాయి జిల్లా): తాను క్షేమంగానే ఉన్నట్లు మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు వద్ద సోమవారం రాత్రి ఎమ్మెల్యే కారు, ఓ మినీ ట్రాక్టర్ ఢీకొన్నాయి. మంగళవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ విషయం చక్కర్లు కొట్టడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు ప్రమాదంలో ఎమ్మెల్యేకు ఏమైందోనని ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి ‘సాక్షి’తో మాట్లాడి టెన్షన్‌కు తెరదించారు. ప్రమాదం జరిగిన సమయంలో అసలు తాను కారులోనే లేనని ఆయన తెలిపారు. బెంగళూరులో తనను వదిలిన అనంతరం కారు డ్రైవర్ తిరుపతికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. చదవండి👉 ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులకు ‘ఆన్లైన్ అవకాశం’ -
సీఎం జగన్‌తో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల భేటీ
సాక్షి, మడకశిర (సత్యసాయి జిల్లా): ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి కుటుంబ సభ్యులు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి సత్యవాణి, కుమారులు డాక్టర్ స్వామి దినేష్, డాక్టర్ స్వామి రాజేష్, స్వామి మహేష్ దంపతులు ముఖ్యమంత్రిని కలిశారు. మడకశిర బైపాస్ కెనాల్ నిర్మాణానికి రూ.214.85 కోట్ల నిధులను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. మడకశిర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. చదవండి: (యూజీసీ కంటే అడుగు ముందే ఏపీ) -
ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే: తిప్పేస్వామి
మడకశిర(సత్యసాయి జిల్లా): మంత్రి పదవి రాలేదని తనకు అసంతృప్తి లేదని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. సోమవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. ప్రాణం ఉన్నంత వరకు తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ఆశయమన్నారు. మంత్రి పదవి దక్కక పోవడంతో తాను అసంతృప్తితో ఉన్నట్లు మీడియా అసత్యప్రచారం చేసిందన్నారు. తాను 40 ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబం వెంటే ఉన్నానని పేర్కొన్నారు. చదవండి: నెరవేరబోతున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల.. తనకు వైఎస్సార్ 1999లో చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2014, 2019లో మడకశిర ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారని తెలిపారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్ కుటుంబానికి విశ్వాస పాత్రుడిగా ఉంటానని తెలిపారు. కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దని కోరారు. -
ఎమ్మెల్యేకి కరోనా: సీఎం జగన్ పరామర్శ
మడకశిర : అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి కరోనా పాజిటివ్ రావడంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఫోన్లో ఆయనను పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్యం పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. అంతేకాకుండా ఆస్పత్రి డాక్టర్లతో కూడా ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ స్వామిదినేష్తో కూడా ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌కు కరోనా పాజిటివ్ నూజివీడు: నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐదు నెలలుగా ప్రజాహిత కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్న ఎమ్మెల్యే ప్రతాప్ రెండు రోజుల కిందట కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎమ్మెల్యే ప్రతాప్ చెప్పారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎవరైనా అత్యవసరమైతే ఫోన్లో తనను సంప్రదించవచ్చన్నారు. ఎవరికైనా పనులుంటే పట్టణంలోని తన కార్యాలయానికి వెళ్లి కార్యాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తారన్నారు. -
‘శంకుస్థాపన చేసినా.. తట్టెడు మట్టి కూడా తీయలేదు’
సాక్షి, అనంతపురం : తెలుగు ప్రజల ఐక్యత కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేసిన ఘనత రాయలసీమ ప్రజలదని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ కోసం సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయని, చరిత్ర తెలిసి కూడా చంద్రబాబు తప్పులు చేశారని విమర్శించారు. మూడు పంటలు పండే భూముల్లో అమరావతి రాజధాని నిర్మించడం మంచిది కాదన్నారు. అవినీతి పరుడైన చంద్రబాబు పరిపాలనలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు చంద్రబాబు మూడుసార్లు శంకుస్థాపన చేసినా..తట్టెడు మట్టి తీయలేదని ఎద్దేవా చేశారు. బినామీ ఆస్తుల కోసమే చంద్రబాబు ఆరాటం, పోరాటమని విమర్శించారు. రాయలసీమ కరవు పై చంద్రబాబు, అయన కుటుంబ సభ్యులు ఎందుకు జోలె పట్టలేదని, ఆ సమయంలో రాయలసీమ టీడీపీ నేతలు చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. (మూడు రాజధానులకు మద్దతుగా అనంతలో భారీ ర్యాలీ) దేశమంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన వైపు చూస్తోందని, రాష్ట్ర సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఎమ్మెల్యే ప్రశంసించారు. రాజధాని కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసే స్థితిలో ఏపీ లేదని,అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రానికి అత్యవసరమని అన్నారు. వైఎస్సార్ కృషి వల్ల రాయలసీమకు కృష్ణా జలాలు వచ్చాయన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు, సమాంతర కాలువ ద్వారా పది వేల క్యూసెక్కుల నీరు తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకరించారని, జీఎన్ రావు, బోస్టన్,శివరామకృష్ణయ్య కమిటీలు అధికార వికేంద్రీకరణకు సిఫార్సు చేశాయని గుర్తు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాయలసీమకు వ్యతిరేకంగా జేసీ, ఇతర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. గ్రేటర్ అమరావతిలో నారాలోకేష్ ఎందుకు ఓడిపోయారో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. చదవండి: 'ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా' అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కరవు కాటకాలకు చంద్రబాబు విధానాలే కారణమని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి ధ్వజమెత్తారు. రెయిన్ గన్స్ పేరుతో చంద్రబాబు మోసం చేశారని, హంద్రీనీవా కాలువ వెడల్పుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకరించారని తెలిపారు. వృథాగా వెళ్తున్న వరద నీటిని రాయలసీమకు తరలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన ప్రణాళికలు వేశారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే లతో చంద్రబాబు రాజీనామా చేయించి ఎన్నికల కు వెళ్లాలని, బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అప్పుడెందుకు బాబు రోడ్లు ఎక్కలేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. రాయలసీమ వెనుకకబాటుకు చంద్రబాబే కారణమని, ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అదే విధంగా రాయలసీమ కరవుపై చంద్రబాబు ఏనాడూ స్పందించలేదని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యలు, వలసలు జరిగినప్పుడు చంద్రబాబు, ఆయన కుటుంబం ఎందుకు రోడ్లు ఎక్కలేదని, అమరావతి కోసం ఎందుకింత తాపత్రయమని ప్రశ్నించారు. అయిదేళ్ళ టీడీపీ పాలనలో అమరావతి ఎందుకు నిర్మించలేదని, రాజధానిలో ఎందుకు శాశ్వత నిర్మాణాలు జరపలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నిపుణుల కమిటీలను అధ్యయనం చేస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని, ఏపీలో వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కన్నారు. -
‘అలా మాట్లాడింది చంద్రబాబే’
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లపై చర్చ జరుగుతుంటే టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మడకశిర వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మండిపడ్డారు. సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. 70 ఏళ్ల తర్వాత ఆశించిన రీతిలో దళితుల అభివృద్ధి జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోపే వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దళితులకు కేబినెట్లో పెద్దపీట వేయడం అభినందనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటేడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం హర్ష ణీయన్నారు. అందుకే గట్టిగా బుద్ధి చెప్పారు.. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీలను ఏవిధంగానూ అభివృద్ధి చేయలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. అందుకే ఎన్నికల్లో ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. టీడీపీ పాలనలో దళితులను నిర్లక్ష్యం చేశారని నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తుంగలో తొక్కారన్నారు. ఎస్సీ, ఎస్టీలను ఉద్దరించానని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెబుతున్నారని, ఎలాంటి అన్యాయం జరిగిందో అందరికి తెలుసునన్నారు. ఆ ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది.. ఎస్సీ,ఎస్టీలను ఉద్ధరించామని టీడీపీ వాళ్లు చెబుతున్నారని.. దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని మాట్లాడింది చంద్రబాబేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఎస్టీ లేని కేబినెట్ ఏదైనా ఉందంటే..చంద్రబాబు హయాంలోనేనన్నారు. దళితులు పడుతున్న బాధలు చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చట్టాలు చేస్తున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. దాడులు జరిగితే ఆయన మాట్లాడలేదు.. దళితులపై దాడులు జరిగితే చంద్రబాబు మాట్లాడలేదని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. ఎస్సీ,ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను స్వాగతిస్తున్నామన్నారు. టీడీపీ పాలనలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయన్నారు. ఏపీ చరిత్రలో నూతన అధ్యాయం.. ఎస్సీ,ఎస్టీ, కమిషన్ విభజన ఏపీ చరిత్రలో నూతన అధ్యాయం అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూ అన్నారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్ విభజన వల్ల న్యాయం వేగంగా జరుగుతుందన్నారు. టీడీపీ పాలనలో ఎస్సీ,ఎస్టీలు ఎన్నో అవమానాలకు గురయ్యారన్నారు. వైఎస్సార్ హయాంలో దళితులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. దళితుల కోసం సీఎం జగన్ అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను హీనంగా చూశారన్నారు. -
ఈసీ ద్వివేదీని కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు
-
టీడీపీ దాష్టికం; ఏజెంట్ గుడిసెకు నిప్పు
సాక్షి, అనంతపురం : మడకశిర నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అమరాపురం మండలం హుదుగూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్ గుడిసెకు నిప్పంటించి రాక్షసానందం పొందారు. ఆ సమయంలో గుడిసెలో ఉన్న మహిళ శశికళను స్థానికులు రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. అదే విధంగా మద్దనకుంటలో కూడా టీడీపీ నేతలు దళితులపై దౌర్జన్యానికి దిగడంతో ఎస్పీ అశోక్ కుమార్‌కు ఫిర్యాదు చేసినట్లు మడకశిర వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. మా గెలుపును జీర్ణించుకోలేకే.. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలవబోతుందనే విషయాన్ని జీర్ణించుకోలేకే టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని తిప్వేస్వామి అన్నారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటామని.. వారి హింసా రాజకీయాలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని.. మీకు మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు పలుచోట్ల విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ అనుచితంగా ప్రవర్తించారు. -
అక్కసు.. ఆక్రోశం.. విధ్వంసం
♦ ఆత్మకూరు మండలంలో అరాచకం ఆత్మకూరు: ఆత్మకూరు మండలంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకం సృష్టించారు. సనపలో వైఎస్సార్సీపీకి అధికంగా ఓట్లు పడుతున్నాయన్న అక్కసుతో టీడీపీ నాయకులు ఓటర్లపై దాడులకు తెగబడ్డారు. అంతేకాదు ఈవీఎంలను పగులగొట్టారు. పోలింగ్ ఆపడం కోసం ఓటర్లపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు కలగజేసుకుని, గొడవను సద్దుమణిగించారు. జిల్లా కేంద్రం నుంచి ఈవీఎంలను తెప్పించి తిరిగి పోలింగ్ కొనసాగించారు. సిద్దరాంపురంలో అంధుడికి సహాయకుడిగా వచ్చిన వ్యక్తితో టీడీపీ నాయకులు వాగ్వాదం చేశారు. ఓటరే బటన్ నొక్కాలని, మీరు సహాయం చేయడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా కట్టెలు, రాళ్లతో మహిళలపైన, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైన టీడీపీ నాయకులు దాడి చేశారు. దాడిలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బాలపోనత్న, నాయకులు శ్రీరాములుకు తీవ్ర గాయాలయ్యాయి. ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళను పక్కకు నెట్టేయడంతో ఆమె గాయపడింది. దీంతో అక్కడ పోలింగ్ నిలిపివేసి.. గ్రామస్తులు ధర్నా చేశారు. బాలపోతన్న తన ప్రాణం పోయినా సరే పోలింగ్ జరగాలని, అంతవరకూ ఆస్పత్రికి వెళ్లనని స్పష్టం చేశాడు. దీంతో పోలీసులు దగ్గరుండి మరీ పోలింగ్‌ను కొనసాగించారు. ♦ వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి కళ్యాణదుర్గం: పోలింగ్ బూత్‌ల వద్ద ఎన్నికల నియమావళి పాటించాలని సూచించినందుకు వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడిన ఘటన కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లిలో గురువారం చోటు చేసుకుంది. ఎన్నికల నిబంధనలను పాటించడం లేదని భాస్కర్‌రెడ్డి ప్రశ్నించడంతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జయప్ప, బాబన్న, గోవిందప్ప, బొజ్జన్నతో పాటు మరికొంత మంది మూకుమ్మడిగా దాడి చేశారు. వైఎస్సార్సీపీకి ప్రజలు ఓట్లు వేస్తున్నారన్న అక్కసుతో రెచ్చిపోయారు. దాడిలో భాస్కర్‌రెడ్డికి గాయాలయ్యాయి. దాడి చేయడం ఎంత వరకు సమంజసమని అక్కడే ఉన్న మరికొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు గూబనపల్లి నాగరాజు, నారాయణ, చిట్టిబాబు, ఓబన్న, నాగరాజు, తిప్పేస్వామిలు నిలదీశారు. ఈ సందర్భంలో తోపులాట, వాగ్వాదం జరిగింది. భాస్కర్‌రెడ్డితో పాటు ఉమేష్ బాబు, తిప్పేస్వామి, జయన్న, ఆంజినేయులకు స్వల్ప గాయాలయ్యాయి. డీఎస్పీ మల్లికార్జున సంఘటన స్థలం వద్దకు చేరుకోవడంతో టీడీపీ దౌర్జన్యాలపై వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. ఇదే సందర్భంలో సంఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషాశ్రీచరణ్ పోలీసుల తీరును తప్పుబట్టారు. దాడి చేసిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ♦ ఈవీఎంను పగులగొట్టిన కొట్రికె గుత్తి: గుత్తిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్‌గుప్తా గురువారం పోలింగ్ బూత్‌లో అరాచకం సృష్టించారు. గుప్తా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 183 పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అక్కడ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థుల బోర్డు పెట్టలేదని అంటే రాయలేదని పోలింగ్, పోలీసు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేశంతో ఊగిపోయి ఈవీఎంను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా పోలీసులు, పోలింగ్ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. సీఐ ప్రభాకర్ గౌడ్ హుటాహుటిన అక్కడికి చేరుకుని కొట్రికె మధుసూదన్ గుప్తాను అరెస్టు చేశారు. 353, 188, ఆర్పీ యాక్ట్‌లపై కేసు నమోదు చేశారు. ♦ గుండుమలలో రిగ్గింగ్ మడకశిర: మడకశిర మండలం గుండుమలలో వైఎస్సార్సీపీకి మెజార్టీ వచ్చే అవకాశం ఉందని గ్రహించిన టీడీపీ కార్యకర్తలు పోలింగ్ స్టేషన్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఇందుకు పీఓ కూడా తనవంతు సహకారమందించారు. పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ జనరల్ ఏజెంట్ డాక్టర్ స్వామిదినేష్ అక్కడ జరుగుతున్న రిగ్గింగ్‌ను చూసి అధికారులను ప్రశ్నించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ జనరల్ ఏజెంట్ డాక్టర్ స్వామిదినేష్పై దాడి చేసి, పోలింగ్ కేంద్రం నుంచి గెంటేశారు. స్వామి దినేష్ కారుపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. విషయం తెలియగానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామి, ఏడీసీసీ బ్యాంక్ ఉపాధ్యక్షుడు ఆనందరంగారెడ్డి, పార్టీ పట్టణ కన్వీనర్ రామకృష్ణ, బూత్ కమిటీ మేనేజర్ వెంకటరంగారెడ్డి తదితరులు ఆర్ఓ ఎం.గాంధీని కలిసి, రిగ్గింగ్‌ను ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. గుండుమలలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు మడకశిరలో డీఎస్పీ అంకయ్యను కలిసి టీడీపీ కార్యకర్తల దౌర్జన్యంపై ఫిర్యాదు చేశారు. జక్కేపల్లిలోనూ టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడి వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటికి పంపారని డీఎస్పీ దృష్టికి తెచ్చారు. ఉగ్రేపల్లిలో కూడా టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. -
‘రెండు వేల పెన్షన్.. వైఎస్ జగన్ విజయమే’
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు ప్రకటించిన రూ. రెండు వేల పెన్షన్ కచ్చితంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పే స్వామి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో వృద్ధులకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించడంతో చంద్రబాబు నాయుడు భయపడి ఎన్నికల ముందు పెన్షన్‌ను పెంచారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఓట్లు దండుకోవడానికి పెన్షన్ పెంచారని, దీన్ని ప్రజలు హర్షించడంలేదని చెప్పారు. ఈ రోజు ప్రజలకు రెండు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అంటే ఇది వైఎస్ జగన్ విజయమే అన్నారు. 2014ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే మడకశిర నియోజకవర్గంలోని అన్ని చెరువులకు హంద్రీనీవా ద్వారా నీరు నింపుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇంతవరకు ఒక్క చెరువును కూడా నింపలేదని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో మరోసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారని తిప్పే స్వామి వ్యాఖ్యానించారు. -
టీడీపీ అడ్రస్ గల్లంతు ఖాయం
అనంతపురం, మడకశిర: రాబోవు ఎన్నికల్లో టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడిగే అర్హత కోల్పోయారని మడకశిర ఎమ్మెల్యే,వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి అన్నారు. ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి గురువారం మడకశిరకు వచ్చారు. పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ సర్కిల్లో సభను ఏర్పాటు చేశారు. సభలో మాజీ మంత్రి హెచ్‌బీ నర్సేగౌడ్,మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈసభలో ఎమ్మెల్యే తిప్పేస్వామి మట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడగడానికి టీడీపీ నాయకులు సిగ్గుపడాలని అన్నారు. నియోజకవర్గంలోని రైతులకు హంద్రీనీవా ద్వారా సాగునీరు ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని రైతుల భూములను లాక్కొని నిరుద్యోగులను మోసం చేశారన్నారు. హంద్రీ–నీవా ద్వారా సాగునీటి సాధనకు కృషి నియోజకవర్గానికి హంద్రీ–నీవా ద్వారా సాగునీటిని తీసుకురావడానికి కృషి చేస్తానని తిప్పేస్వామి తెలిపారు.స్థానిక ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ,కౌన్సిల్లో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించకుండా నిద్ర పోయారని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో మడకశిర నుంచి టీడీపీ పోటీలో ఉండదని, కాంగ్రెస్ మాత్రమే పోటీలో ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు కలసికట్టుగా కష్ట పడి పని చేయాలని కోరారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యేగా తనకు తక్కువ సమయం ఉన్నా కష్ట పడి పని చేస్తానని తెలిపారు. 2019లో వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి మాజీ మంత్రి హెచ్‌బీ నర్సేగౌడ్ మాట్లాడుతూ 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ జెండా ఎగరాలని కోరారు. మడకశిరలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘన విజయం సాధించాలన్నారు. టీడీపీ గత ఎన్నికల్లో సాగునీరు అందిస్తామని చెప్పి ఇంత వరకూ పట్టించుకోకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ దోపిడీ పార్టీ అని విమర్శించారు. ప్రస్తుతం ఉండేది ఎన్టీఆర్ టీడీపీ కాదన్నారు. చంద్రబాబు టీడీపీ అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం జరుగుతుందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రంగేగౌడ్, వాగేష్, డాక్టర్దేవరాజు, రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శులు బేకరీ నాగరాజు, శంకరగల్లు నాగన్న,సత్యనారాయణయాదవ్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శులు బరగూరప్ప, కృష్ణమూర్తి, రాష్ట్ర రైతువిభాగం కార్యదర్శులు బుళ్లసముద్రం రామిరెడ్డి, కరికెర జయరామ్, పట్టణ కన్వీనర్ రామకృష్ణ, మండల కన్వీనర్లు రామిరెడ్డి,డాక్టర్ శివప్రసాద్, మహేంద్ర పాల్గొన్నారు. -
ఉద్యోగం వీడి..ప్రజాసేవలోకి..
మోపురగుండు డాక్టర్ తిప్పేస్వామి...సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు....కష్టపడి చదువుకున్నాడు...వైద్య విద్య పూర్తి చేసి మంచి డాక్టర్‌గా పేరుగాంచాడు...తాతలు, తండ్రులెవరూ రాజకీయాల్లో లేకపోయినా...వైఎస్సార్ అండతో ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో తొలిసారి పలమనేరు నుంచి పోటీ చేశాడు. బంపర్ మెజార్టీతో గెలిచి ప్రజాసమస్యలపై తొలిసారి అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు. ఆ తర్వాత కూడా ప్రజాసేవలోనే కొనసాగుతున్నాడు. 2014లో తన సొంత నియోజకవర్గం మడకశిర నుంచి పోటీ చేసి ఓటమి చెందినా...కోర్టు తీర్పుతో తాజాగా బుధవారం మరోసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాడు. అనంతపురం, మడకశిర: డాక్టర్ తిప్పేస్వామిది అమరాపురం మండలం ఉదుగూరు గ్రామం. పదోతరగతి వరకూ అమరాపురంలోనే చదువుకున్నాడు. ఇంటర్ అనంతపురంలో... ఆ తర్వాత కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. అనంతరం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎండీ, డీజీఓ కోర్సులను పూర్తి చేసి కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో పని చేశారు. తొలిసారిగా పాండిచ్చేరిలో వైద్య ఆరోగ్యశాఖలో పని చేశారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా... ఆ తర్వాత పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రిలో, వాయల్పాడు ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ఇదే హాదాలో పని చేశారు. ఇలా వైద్య వృత్తిలో ఉంటూనే ప్రజా సేవ చేయాలన్న లక్ష్యం...వైఎస్సార్ ప్రోత్సాహంతో 1994లోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 1999లో పలమనేరు నుంచి రెండోసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ♦ ఎమ్మెల్యేగా ఉన్నసమయంలో అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలోల సభ్యుడిగా కొనసాగారు. ♦ 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగానే పలమనేరు నుంచే పోటీ చేసి కేవలం 737 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ♦ ఇక 2009లో చిత్తూరు పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి స్వల్పతేడాతో ఓడి పోయారు. ♦ డాక్టర్ తిప్పేస్వామి కాంగ్రెస్ పార్టీలోనూ పలు పదవులు దక్కించుకున్నారు. 2004 నుంచి 2008 వరకు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ♦ కర్నూలు, కడప జిల్లాలకు కాంగ్రెస్ ఇన్చార్జ్గా పని చేశారు. ♦ కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్, లీగల్ సెల్, లేబర్సెల్లో రాష్ట్ర స్థాయి పదవుల్లో కొనసాగుతూ క్రీయాశీలకంగా వ్యవహరించారు. ♦ తమిళనాడులోని రామనాథపురం జిల్లా కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌గా, గుంటూరు జిల్లా కాంగ్రెస్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా కూడా పని చేశారు. ♦ విద్యార్థి, డాక్టర్ల సంఘాల్లో కూడా వివిధ పదవుల్లో కొసాగారు. ఇలా ఆయన రాజకీయాల్లో రాణించి మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా వైఎస్సార్ ముఖ్య అనుచరుడిగా ముద్ర వేసుకున్నారు. ♦ వైఎస్ కుటుంబానికి విధేయుడైన డాక్టర్ తిప్పేస్వామి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ స్థాపించగానే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలబడ్డారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో పలమనేరులో పోటీ చేయడానికి తిప్పేస్వామికి అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఆయన స్వస్థమైన మడకశిర ఎస్సీలకు రిజర్వు అయ్యింది. దీంతో ఆయన 2014లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అండతో మడకశిర నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. న్యాయ పోరాటంతో విజయం మడకశిర అసెంబ్లీ నుంచి 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ తిప్పేస్వామి, టీడీపీ అభ్యర్థిగా ఈరన్న పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ఈరన్న తన నేర చరిత్రను నామినేషన్ వేసే సందర్భంగా అఫిడవిట్లో పేర్కొన లేదు. ఈ విషయాన్ని ఆ రోజే డాక్టర్ తిప్పేస్వామి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారు పట్టించుకోలేదు. దీంతో ఆయన 2014 జూన్‌లో హైకోర్టును ఆశ్రయించారు. గత నవంబర్ 27న హైకోర్టు ఈరన్న ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేగా డాక్టర్ తిప్పేస్వామిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై ఈరన్న సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు కూడా డాక్టర్ తిప్పేస్వామినే ఎమ్మెల్యేగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు డాక్టర్ తిప్పేస్వామి చేత ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. సాగునీటికోసం రాజీలేని పోరాటం మడకశిర: సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ...హంద్రీనీవా నీటిని పొలాల్లో పారించేందుకు ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తానని మడకశిర ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. బుధవారం ఆయన అమరావతిలో స్పీకర్ సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యం తగ్గడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పదవీ సమయం చాలా తక్కువగానే ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు. ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకుని వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతానన్నారు. టీడీపీ ప్రభుత్వం హంద్రీనీవా ద్వారా మడకశిరకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అందువల్లే తాను సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నానన్నారు. అలాగే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే తనకు ఈ అవకాశం వచ్చిందనీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైఎస్సార్ సీపీకి మంచి పేరు తెస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపునకు మడకశిర నుంచే నాంది పలుకుతామన్నారు. కోర్టులు ఇచ్చిన తీర్పు క్రిమినల్ కేసులున్న టీడీపీ ప్రజాప్రతినిధులకు చెంపపెట్టు లాంటిదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీలో క్రిమినల్స్ లేరని పదేపదే చెబుతుంటారని, ఈ సంఘటనతో క్రిమినల్స్ ఏ పార్టీలో ఉన్నారో బయటపడిందన్నారు. 2014 ఎన్నికల నామినేషన్ రోజే ఈరన్నపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను రిటర్నింగ్ అధికారికి అందించినా పట్టించుకోలేదన్నారు. అందువల్లే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. చివరకు సుప్రీంకోర్టు కూడా తనకే మద్దతు తెలిపిందన్నారు. ఆలస్యంగానైనా న్యాయం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మడకశిరలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఇక నుంచి రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. నాకున్న సమయం చాలా తక్కువే. అయినా ప్రజాసమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా. ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకునేందుకు కృషి చేస్తా. ఈ విజయం 2019 ఎన్నికలకు నాంది. రానున్న ఎన్నికల్లోనూ మడకశిరలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయం– డాక్టర్ తిప్పేస్వామి,మడకశిర ఎమ్మెల్యే నేడు మడకశిరకు ఎమ్మెల్యే తిప్పేస్వామి మడకశిర: అమరావతిలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి గురువారం మడకశిరకు రానున్న డాక్టర్ తిప్పేస్వామికి ఘన స్వాగతం పలికేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి ఉదయం 9 గంటలకు మడకశిరకు చేరుకోనుండగా...పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరానున్నారని వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ రామకృష్ణ, మండల కన్వీనర్ రామిరెడ్డి తెలిపారు. వైఎస్సార్ సర్కిల్లో సభ కూడా ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. -
ఎమ్మెల్యేగా తిప్పేస్వామి ప్రమాణం
సాక్షి, అమరావతి: ఎట్టకేలకు అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా డాక్టర్ మోపురుగుండు తిప్పేస్వామితో స్పీకర్ కోడెల ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలోని తన చాంబర్లో స్పీకర్ కోడెల బుధవారం తిప్పేస్వామితో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటివరకు మడకశిర ఎమ్మెల్యేగా కొనసాగిన ఈరన్న పదవి సుప్రీంకోర్టు తీర్పు మేరకు రద్దవడంతో తిప్పేస్వామికి అవకాశం లభించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఈరన్న ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారమిచ్చినట్లు రుజువవడంతో ఆయన ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పడం, ఈరన్న తర్వాత స్థానంలో ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టం చేయడం తెలిసిందే. ఆ మేరకు ఈరన్న ఎమ్మెల్యే అభ్యర్థిత్వం రద్దయింది. అయితే రద్దయిన సభ్యత్వానికి ఈరన్న రాజీనామా చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కోర్టు ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పిన నేపథ్యంలో ఈరన్న ఇచ్చిన రాజీనామా లేఖపై స్పీకర్ ఎలా స్పందిస్తారోననే చర్చ జరిగింది. దీనిపై ప్రజాస్వామ్యాన్ని, కోర్టు తీర్పును గౌరవిస్తూ తిప్పేస్వామితో ప్రమాణస్వీకారం చేయించాలని వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం స్పీకర్‌ను కోరింది. ఈ నేపథ్యంలో స్పీకర్ బుధవారం తిప్పేస్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎట్టకేలకు న్యాయం జరిగింది.. అనంతరం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో తిప్పేస్వామి మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తన గెలుపే తొలి మెట్టు అవుతుందని పేర్కొన్నారు. మడకశిర ఎమ్మెల్యేగా తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు పాలనకు పతనం ప్రారంభమైందన్నారు. మూడేళ్లక్రితం రావాల్సిన తీర్పు ఆలస్యంగా వచ్చినా తనకు న్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పుద్వారా న్యాయం గెలిచినట్లైందన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మార్గంలో నడిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. చంద్రబాబు తీరుకు న్యాయస్థానం తీర్పు చెంపపెట్టు లాంటిదని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. మడకశిర ఎమ్మెల్యేగా తిప్పేస్వామిని నియమిస్తూ హైకోర్టు తీర్పిచ్చినా స్పీకర్ స్పందించకుండా అధికారపార్టీ ఎమ్మెల్యేను కొనసాగించడంతో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వైఎస్సార్సీపీ విజయంగా భావిస్తున్నామన్నారు. విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువల్ని చంద్రబాబు తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. స్పీకర్ అసెంబ్లీ స్థాయిలో చేయాల్సిన నిర్ణయాన్ని కోర్టుల దగ్గరకు వెళ్తే గానీ న్యాయం జరిగే పరిస్థితి కనిపించట్లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సమావేశంలో మాజీ మంత్రి నర్సెగౌడ్, బీసీ సెల్ రాష్ట్ర అ«ధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అలస్యమైనా నాకు న్యాయం జరిగింది
-
‘సుదీర్ఘ పోరాటం తర్వాత న్యాయం గెలిచింది’
సాక్షి, విజయవాడ: సుదీర్ఘ పోరాటం తర్వాత న్యాయం గెలిచిందని మడకశిర వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపునకు ఇది నాంది అని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఉదయం అమరావతిలోని స్పీకర్ కార్యాలయంలో తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తర్వాత విజయవాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో తిప్పేస్వామి మాట్లాడుతూ.. మడకశిర నియోజకవర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా టీడీపీ నెరవేర్చలేదని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో హంద్రీనీవా పనులు 80 శాతం పనులు పూర్తయినప్పటికీ.. సీఎం చంద్రబాబు నాయుడు కనీసం 20 శాతం పనులు కూడా చేపట్టలేకపోయారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హంద్రీనీవా నీటి కోసం పోరాడతానని తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మడకశిర ఎమ్మెల్యే విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం వల్లే న్యాయం జరిగిందని అన్నారు. ఈ విషయంలో నాలుగున్నరేళ్లు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం కాలాయపన చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు అన్యాయపాలనకు పతనం ప్రారంభమైందని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. చంద్రబాబు దుర్మార్గాలపై తగిన తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసు, రాజధాని నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డ చంద్రబాబుకు ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. తిప్పేస్వామి తీర్పులాగే పార్టీ ఫిరాయించిన 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల విషయంలో కూడా తీర్పు రాబోతుందని అన్నారు. ఈ తీర్పు టీడీపీకి, అసెంబ్లీ స్పీకర్‌కు కనువిప్పు కావాలని పేర్కొన్నారు. -
ప్రమాణ స్వీకారం చేసిన తిప్పేస్వామి
-
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తిప్పేస్వామి
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా వైఎస్సార్ సీపీ నాయకులు తిప్పేస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని స్పీకర్ కార్యాలయంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగింది. కాగా, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈరన్న.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. తిప్పేస్వామి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై ఈరన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తిప్పేస్వామి నేడు మడకశిర ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. చదవండి: టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్.. ఎన్నిక చెల్లదని ఆదేశాలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించండి -
ఎమ్మెల్యేపై అనర్హత: అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నపై అనర్హత వేటు వేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యేపై వేటు వేసి.. ఆయన స్థానంలో మడకశిర నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగించాలని న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 20లోగా తనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శిని తిప్పేస్వామి కోరుతున్నారు. శాసనసభ ఆవరణలో అసెంబ్లీ కార్యాదర్శి కార్యాలయానికి వెళ్లిన తిప్పేస్వామి వెంట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోన రఘుపతి, ఆదిములపు సురేష్ తదితరులు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మడకశిర తదుపరి ఎమ్మెల్యేగా తనను గుర్తించాలని తిప్పేస్వామి అసెంబ్లీ కార్యదర్శిని కోరారు. ఇప్పటికే స్పీకర్‌కు, అసెంబ్లీ కార్యదర్శికి తనను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను ఫ్యాక్స్, ఈ–మెయిల్ ద్వారా పంపానని ఆయన వెల్లడించారు. స్పీకర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని, కోర్టు ఉత్తర్వులను గౌరవించి తనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీలో శుక్రవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని తిప్పేస్వామి కలిసి కోర్టులు ఇచ్చిన తీర్పు ప్రతులను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు. -
‘సుప్రీం తీర్పు టీడీపీకి చెంపపెట్టు లాంటిది’
సాక్షి, అమరావతి : అధికార పార్టీ ఎమ్మెల్యే ఈరన్న విషయంలో సుప్రీంకోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టు లాంటిదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేర చరితుడైన నేతను టీడీపీ ఇన్నాళ్లు కాపాడిందనీ, అలాంటి వారిని ఎమ్మెల్యేగా తెచ్చి అసెంబ్లీని మలినం చేసిందని మండిపడ్డారు. కోర్టు తీర్పు ప్రతిని అసెంబ్లీ కార్యదర్శికి అందించామని తెలిపారు. తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించాలని స్పీకర్‌కి కోర్టు స్పష్టంగా చెప్పినా.. సన్నాయి నొక్కులు నొక్కుతూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత స్పీకర్‌కి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేదా అని ప్రశ్నించారు. 24 గంటల్లోగా కోర్టు తీర్పుని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నేర చరిత్ర కలిగిన ఈరన్నను కాపాడాలనుకుంటున్నారంటూ మండిపడ్డారు. కోర్టు 27వ తేదీన ఈరన్న ఎమ్మెల్యే కాదని తీర్పు ఇస్తే.. ఆయన నిన్న (శుక్రవారం) రాజీనామా చేయటం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యటంగా సురేష్ అభివర్ణించారు. (ఎమ్మెల్యే ఈరన్న పిటీషన్ కొట్టివేత) తీర్పుని గౌరవించండి.. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ.. 23 మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టు కొన్నారని టీడీపీపై నిప్పులు చెరిగారు. స్పీకర్‌ని కలిసి కోర్టు తీర్పును గౌరవించాలని కోరినట్టు తెలిపారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ రాజ్యాంగాన్ని అపహస్యం చేసేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఇప్పుడైనా న్యాయస్థానం తీర్పును గౌరవించి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించాలని డిమాండ్ చేశారు. (ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించండి) ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించండి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తిప్పేస్వామి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేగా పరిగణించాలని కోర్టు వెల్లడించింది. ఈరన్నపై ఏపీ, కర్ణాటకల్లో క్రిమినల్ కేసులున్నాయి. ఆయన భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. ఆ విషయాలేవీ ఈరన్న ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదు. దీనిపై నాలుగేళ్లుగా పోరాడాను. కోర్టు తీర్పు నాకు అనుకూలంగా రావడం ఆనందంగా ఉంది’అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించమని స్పీకర్‌ను కోరినట్టు వెల్లడించారు. కోర్టు తీర్పును అసెంబ్లీ కార్యదర్శికి అందించామని చెప్పారు. -
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించండి
సాక్షి, మడకశిర: ఈ నెల 20లోగా తనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శిని అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి కోరారు. ఈ మేరకు ఫ్యాక్స్, ఈ–మెయిల్ చేసినట్లు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. తనను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను కూడా పంపానన్నారు. స్పీకర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని, కోర్టు ఉత్తర్వులను గౌరవించి తనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీలో శుక్రవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని తిప్పేస్వామి కలిసి కోర్టులు ఇచ్చిన తీర్పు ప్రతులను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు. సుప్రీం తీర్పును గౌరవించి రాజీనామా: ఈరన్న సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఈరన్న తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా సమర్పించానన్నారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదించాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యేనే కానప్పుడు ఈరన్న పదవికి రాజీనామా చేయడం హాస్యాస్పదంగా ఉందని డాక్టర్ తిప్పేస్వామి అన్నారు. కోర్టుల తీర్పుల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేనే కాదన్నారు. నేడు అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఈరన్న అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీ కార్యదర్శికి అందచేయనున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈరన్న.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనపై ఉన్న క్రిమినల్ కేసులతోపాటు కుటుంబసభ్యుల ప్రభుత్వ ఉద్యోగాల గురించి ప్రస్తావించలేదని వైఎస్సార్సీపీ అభ్యర్థి తిప్పేస్వామి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన హైకోర్టు తిప్పేస్వామి వాదనను సమర్థిస్తూ.. ఈరన్న ఎన్నిక చెల్లదని ఇటీవల తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఈరన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈరన్న తన ఎన్నికల అఫిడవిట్లో వ్యక్తిగత వివరాలు దాచిపెట్టారని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ధారించడమేగాక.. ఆయన ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పును సమర్థించింది. ఆ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగుతారని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో శనివారం వెలగపూడి అసెంబ్లీ కార్యాలయంలో కార్యదర్శిని వ్యక్తిగతంగా కూడా కలసి పార్టీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తీర్పు కాపీని అందచేయనున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, కోన రఘుపతి, తిప్పేస్వామిలతోపాటు పలువురు పార్టీ నేతలు అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్నారు. ఈరన్న రాజీనామా వ్యూహం.. సుప్రీం తీర్పును తప్పించుకునేందుకేనా? తన ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మడకశిర ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఈరన్న ఎన్నిక చెల్లదని, ఆయన తర్వాత స్థానంలోని వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కొనసాగుతారని తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. తీర్పు ప్రకారం ఈరన్న ఎమ్మెల్యే పదవి రద్దయింది. కానీ ఆయన రద్దయిన ఎమ్మెల్యే పదవికి వ్యూహాత్మకంగా రాజీనామా చేశారు. శుక్రవారం వెలగపూడిలోని అసెంబ్లీకి వచ్చి కార్యదర్శి విజయరాజుకు తన రాజీనామా లేఖను ఇచ్చి వెళ్లిపోయారు. ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించాల్సి ఉంటుంది. స్పీకర్ ఆమోదించేవరకూ ఈరన్న ఎమ్మెల్యేగానే కొనసాగే అవకాశం ఉంటుంది. స్పీకర్ ఏ విషయం తేల్చకుండా రాజీనామా లేఖను అలాగే రెండు, మూడు నెలలు కాలం గడిపితే ఈ అసెంబ్లీ సమయం ముగిసిపోతుంది. అప్పటివరకూ ఈరన్న ఎమ్మెల్యేగా కొనసాగవచ్చని టీడీపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈరన్నతో రాజీనామా చేయించనట్లు భావిస్తున్నారు. రాజీనామాకు ముందు గురువారం ఈరన్న సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ను కలిశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని ఈరన్నను ఎమ్మెల్యే పదవిలో కొనసాగించేందుకు చంద్రబాబు ఎత్తు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
రాజీలేని పోరాటం చేస్తా : డా. తిప్పేస్వామి
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ముందుకు వెళ్తానని, మడకశిర ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తానని మడకశిర వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డా. తిప్పేస్వామి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక రద్దు తీర్పు చారిత్రాత్మకమన్నారు. హైకోర్టు తీర్పు కాపీ అందగానే స్పీకర్‌ను కలవనున్నట్లు తెలిపారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. నామినేషన్ల పరిశీలన సమయంలోనే ఆధారాలను సమర్పించినా అధికారులు పట్టించుకోలేదన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్.. ఎన్నిక చెల్లదని ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: అనంతరం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు హైకోర్టు షాక్ ఇచ్చింది. శాసనసభ సభ్యుడిగా ఆయన ఎన్నిక చెల్లదంటూ మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఆయనపై వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ మోపురగుండు తిప్పేస్వామి విజయం సాధించినట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పుడు సమాచారమిచ్చారనే ఆరోపణలపై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తనపై ఉన్న నాలుగు క్రిమినల్ కేసుల గురించిన వివరాలు, అలాగే భార్య ప్రభుత్వ ఉద్యోగనే విషయాన్ని ఈరన్న అఫిడవిట్లో పేర్కొనపోవడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో ఈరన్న తప్పుడు సమాచారం ఇచ్చారని, కర్ణాటకలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్లో తెలియజేయలేదని, ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ తిప్పేస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదన్న హైకోర్టు.. ఆయన స్థానంలో డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగవచ్చునని ఆదేశాలు ఇచ్చింది. వివరాలు దాచి అఫిడవిట్..! టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకి కర్ణాటకలో నమోదైన ఓ కేసులో శిక్ష కూడా పడింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కేసులు నమోదవ్వగా.. అందులో ఒక కేసులో చార్జిషీట్ దాఖలైంది. ఈరన్న భార్య కర్ణాటక అంగన్ వాడి విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ వివరాలను ఆయన తన అఫిడవిట్లో పొందుపరచలేదు. ఈ విషయాలన్నీ 2014 ఎన్నికల సమయంలోనే వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామి రిటర్నరింగ్ అధికారి దృష్టికి తెచ్చారు. కాని అప్పుడు పట్టించుకోలేదు. ఈ విషయమై ఆయన న్యాయపోరాటం చేసి ఇప్పుడు విజయం సాధించారు.