కంబదూరు (కళ్యాణదుర్గం) : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కంబదూరు మండలం నూతిమడుగులో చిన్న నరసింహులు భార్య లక్ష్మీనరసమ్మ(37) కడునొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ నరసింహుడు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం కోసం మృతదేహన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గొంచిరెడ్డిపల్లిలో ఉరేసుకుని మరొకరు..
బ్రహ్మసముద్రం(కళ్యాణదుర్గం) : బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లిలో తిప్పేస్వామి(35) అతిగా మద్యం తాగి ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన ఆయన మద్యం మత్తులో ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. మృతుని భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నట్లు చెప్పారు. మృతునికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
జీవితంపై విరక్తితో ఇద్దరి ఆత్మహత్య
Published Mon, Jun 12 2017 12:19 AM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM
Advertisement
Advertisement