మడకశిర: ఎమ్మెల్యే డాక్టర్ ఎం. తిప్పేస్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో చోటు దక్కింది. మొత్తం 24 మందిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అందులో శ్రీసత్యసాయి జిల్లా నుంచి ఎమ్మెల్యే తిప్పేస్వామి కూడా ఉన్నారు. తొలిసారిగా మడకశిర నియోజకవర్గానికి చెందిన దళిత ఎమ్మెల్యేకి టీటీడీ బోర్డులో స్థానం దక్కడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించినందుకు ఎమ్మెల్యే తిప్పేస్వామి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటానని తెలిపారు. శ్రీవారికి సేవ చేసే భాగ్యం రావడం నిజంగా తన జీవితం ధన్యమైందని, ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
టీటీడీ బోర్డులో అశ్వర్థనాయక్‌కు చోటు
తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) పాలకమండలి సభ్యునిగా అనంతపురం వాసి, విశ్రాంత రైల్వే మేనేజర్ అశ్వర్థనాయక్‌కు చోటు దక్కింది. ఈయన నియామకంపై టీటీడీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో తిరుమలలో జరిగే కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment