కుటుంబ సమస్యలు తాళలేక మండలంలోని బండమీదపల్లి గ్రామంలో గురువారం బలిజ తిప్పేస్వామి(45) అనే వ్యక్తి ఇంట్లో ఉన్న పైకప్పుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుందుర్పి : కుటుంబ సమస్యలు తాళలేక మండలంలోని బండమీదపల్లి గ్రామంలో గురువారం బలిజ తిప్పేస్వామి(45) అనే వ్యక్తి ఇంట్లో ఉన్న పైకప్పుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి నారాయణప్ప, పోలీసులు తెలిపిన మేరకు.. తిప్పేస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య భాగ్యమ్మ 20 ఏళ్ల క్రితమే వదిలి వెళ్లగా రెండోభార్య పార్వతమ్మ వద్ద ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం పార్వతమ్మకు జబ్బు చేసింది. పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేదు.
జబ్బు నయం కాకపోగా వైద్యానికి బయట అప్పు ఇచ్చే నాథులు కరువయ్యారు. దీంతో తాగుడుకు బానిసైన తిప్పేస్వామి గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుందుర్పి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.